లావణ్య త్రిపాఠి, దేవ్ మోహన్ జంటగా రూపొందిన చిత్రం ‘సతీ లీలావతి’. తాతినేని సత్య ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. తాజాగా టీజర్‌ను రిలీజ్ చేశారు. ఇదొక రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్. కొత్తగా పెళ్లైన జంట మధ్య తలెత్తిన గొడవలను ఫన్ కోటింగ్‌తో చూపించారు. లావణ్య త్రిపాఠి క్యారెక్టరైజేషన్ కొత్తగా ఉంది.
హ్యాపీగా ఉండలేమని అనిపించినప్పుడు విడిపోవడమే కరెక్ట్ అని భావించిన భర్త. సీన్ కట్ చేస్తే… భర్తని ఓ చెయిర్లో కట్టిపడేసింది లీల. తర్వాత కథలో ఇంకొన్ని మలుపులు. భార్య భర్తల కెమిస్ట్రీని కాస్త కొత్తగా డిజైన్ చేశారు. ఓ రెండు కౌంటర్ డైలాగులు బాగానే పేలాయి. ఓ యాక్షన్ ఫ్యాక్టర్ కూడా ఉంది.
కామెడీ పంచడానికి సప్తగిరి, విటీవీ గణేష్‌లాంటి పాత్రలు కూడా ఉన్నాయి. మిక్కీ జే మేయర్ అందించిన నేపథ్య సంగీతం జానర్‌కి ఫిట్ అయ్యింది. ఈ మధ్య భార్యభర్తల కథలకు కొంచెం గ్యాప్ వచ్చింది. ‘సతీ లీలావతి’ ఆ గ్యాప్‌ని ఫిల్ చేసే సినిమా అవుతుందామో చూడాలి.