చిరు, నాగ్‌ల‌పై క‌న్నేసిన లారెన్స్‌

అటు చిరంజీవితోనూ, ఇటు నాగార్జున‌తోనూ మంచి అనుబంధ‌మే ఉంది లారెన్స్‌కి. డాన్స్ మాస్ట‌ర్ గా లారెన్స్ స్టార్ డ‌మ్ వెలిగిపోవ‌డానికి చిరంజీవి కార‌ణ‌మైతే, లారెన్స్‌ని ద‌ర్శ‌కుడిగా మార్చిన ఘ‌న‌త నాగార్జున‌కి ద‌క్కింది. లారెన్స్ చిత్రం `స్టైల్‌`లో ఈ హీరోలిద్ద‌రూ అతిథి పాత్ర‌ల్లో క‌నిపించిన సంగ‌తి గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు వీరిద్దరితోనూ మ‌ళ్లీ క‌ల‌సి ప‌నిచేయాల‌న్న ఆశాభావం వ్య‌క్తం చేస్తున్నాడు లారెన్స్‌. “చిరు అన్న‌య్య‌తో, నాగ్ సార్‌తో మ‌ళ్లీ సినిమాలు చేయాల‌నివుంది. మిగిలిన హీరోలతోనూ సినిమాలు తీస్తా. ద‌ర్శ‌కుడిగా ఇప్పుడు స్పీడు పెంచుతా” అంటున్నాడు లారెన్స్‌. లారెన్స్‌కి నాగ్ మ‌రో ఛాన్స్ ఇవ్వ‌డం అంత తేలికైన విష‌యం కాదు. ‘డాన్‌’ ఎఫెక్ట్‌… నాగ్ ఇప్ప‌టికీ మ‌ర్చిపోలేడు. ఇక చిరంజీవి ఆచి తూచి అడుగేసే ర‌కం. ఇప్పుడు త‌న దృష్టంతా కేవ‌లం పెద్ద ద‌ర్శ‌కుల‌పైనే ఉంది. ఇప్పుడున్న పొజీష‌న్‌లో లారెన్స్‌ని ఆయ‌న కేవ‌లం డాన్స్ మాస్ట‌ర్‌గానే చూస్తాడేమో.

అయితే లారెన్స్ కేవ‌లం వీళ్ల‌పైనే ఆధార‌ప‌డ‌డం లేదు. త‌న మార్కెట్‌ని బాలీవుడ్‌లోనూ విస్క్కృత ప‌ర‌చాల‌నుకుంటున్నాడు. ద‌క్షిణాదిన మంచి వ‌సూళ్లు అందుకున్న `కాంచ‌న‌`ని బాలీవుడ్‌కి తీసుకెళ్లే ప్ర‌య‌త్నాల్లో ఉన్నాడు. అక్ష‌య్ కుమార్‌తో ఈ సినిమాని రీమేక్ చేస్తున్నాడు లారెన్స్‌. ఏప్రిల్‌లో ఈ సినిమా మొద‌ల‌వుతుంది. అది పూర్త‌య్యాకే ద‌క్షిణాది చిత్రాల గురించి ఆలోచిస్తాడ‌ట‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com