ఫెడరల్ టూర్స్ అండ్ ట్రావెల్స్..! తేలిపోతున్న కేసీఆర్ ఫ్రంట్..!

ఫెడరల్ ఫ్రంట్ పెట్టి.. దేశవ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను ఏకతాటిపైకి తెచ్చి.. కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేకగా పోరాడతానని కేసీఆర్ ప్రకటించిన కార్యాచరణ కూడా ప్రారంభించారు. కానీ ఈ ఫెడరల్ ఫ్రంట్ రాను రాను కామెడీ అయిపోతోంది. సీరియస్ నెస్ లేకుండా… గంభీరమైన ప్రకటనలే తర్వాత కేసీఆర్ చేస్తున్న మాయాజాలం అన్నట్లు తెలిపోతోంది. దాంతో అసలు కేసీఆర్ ఫ్రంట్ అనేదే లెక్కలోకి ఎవరూ తీసుకోవడం లేదు.

ఫెడరల్ ఫ్రంట్ ప్రకటించిన తర్వాత తనకు మమతాబెనర్జీ, హేమంత్ సోరెన్ ఫోన్ చేశారని కేసీఆర్ హంగామా చేశారు. కానీ తర్వాత తేలిందేమిటంటే.. కేసీఆర్ తరపున ఎంపీ కేకే.. వారికి ఫోన్ చేసి మాట్లాడారు. వారు చూద్దాం.. అని మాట ఇచ్చారు. కానీ అలా అన్న ఒకటి రెండు రోజులకే అటు దీదీ… ఇటు హేమంత్ సోరెన్.. కాంగ్రెస్ తో చర్చలు జరిపేశారు. హేమంత్ సోరెన్ అయితే యూపీఏలో చేరిపోయారు కూడా. కానీ ఆ తర్వాత హేమంత్ సోరెన్ కుటుంబంతో కలిసి షాపింగ్ కి హైదరాబాద్ వస్తే.. తానే ఆతిధ్యం ఇచ్చి… ఫెడరల్ ఫ్రంట్ లో చేరేందుకు ఒప్పించినట్లు వార్తలు పుట్టించారు. కానీ జేఎంఎంకు కాంగ్రెస్ ను వదిలే పరిస్థితి లేదు. అలాగే మమతా బెనర్జీ కూడా. ప్రత్యేక విమానం పెట్టుకుని… కోల్ కతా వెళ్లిన కేసీఆర్ కు…ఆమె.. గట్టి షాకే ఇచ్చారు. కేసీఆర్ చెప్పినది వినడమే తప్ప… ఆమె ఎలాంటి హామీ ఇవ్వలేదు. అలాగే బెంగళూరు వెళ్లినా .. దేవేగౌడ కూడా… మంచి మాటలు … భోజనం పెట్టి పంపించారు తప్ప.. ధర్డ్ ఫ్రంట్ గురించి మాట మాత్రంగా కూడా చెప్పలేదు.

ఇవన్నీ ఇలా ఉండగానే… నవీన్ పట్నాయక్ ధర్డ్ ఫ్రంట్ కోసం చర్చలకు… కేసీఆర్ ను ఆహ్వానించారంటూ.. టీఆర్ఎస్ వర్గాలు ప్రచారం ప్రారంభించాయి. పత్రికల్లోనూ ప్రాధాన్యం కల్పించారు. కానీ నిజానికి తేలిందేమిటంటే.. కేసీఆర్ పూరి జగన్నాథుని ఆలయ సందర్శనకు వెళ్లనున్నారు. ఎలాగూ వస్తున్నారు కాబట్టి.. సంప్రదాయంగా కేసీఆర్ కలుస్తారని… ఒరిస్సా ప్రభుత్వానికి తెలంగాణ అధికారులు సమాచారం ఇచ్చారు. దానికి నవీన్ పట్నాయక్ సరే అన్నారట. దానికే..ధర్డ్ ఫ్రంట్ కలరింగ్ ఇచ్చి ప్రచారం చేసేసుకున్నారు.. టీఆర్ఎస్ నేతలు. ఇలాంటి చేష్టల వల్లే సీతారాం ఏచూరీ ఫెడరల్ ఫ్రంట్ ను మూసితో పోల్చారు.

ఇలాంటి కబుర్లు… సామాన్య ప్రజలకు చెప్పడానికి బాగుంటాయేమో కానీ.. .నిజాలు తెలిసిన తర్వాత మాత్రం..టీఆర్ఎస్, కేసీఆర్ సిన్సియారిటీని..సీరియస్ నెస్ ను… ప్రమాదంలోకి నెట్టేస్తాయి. ప్రస్తుతం అదే జరుగుతోంది. కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ కామెడీ అయిపోయింది. తప్ప.. ఒక్కరంటే. ఒక్కరైనా… ఆసక్తి చూపిస్తారని ఎవరూ నమ్మడం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

మెకానిక్ గా మారిన మాస్ కా దాస్

ఈమ‌ధ్యే 'గామి'గా ద‌ర్శ‌న‌మిచ్చాడు విశ్వ‌క్‌సేన్‌. త‌న కెరీర్‌లో అదో వెరైటీ సినిమా. ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు, విమ‌ర్శ‌కుల మెచ్చుకోళ్లూ ద‌క్కాయి. త‌ను న‌టించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి' విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఇప్పుడు మ‌రో...

“చెంగిచెర్ల” మీదుగా బీజేపీ ఎలక్షన్ ప్లాన్లు !

మేడ్చల్ నియోజకవర్గం చెంగిచెర్ల గ్రామంలో హోలీ పండుగ సందర్భంగా ఘర్షణ జరిగింది. డీజే పాటలు పెట్టుకొని హోలీ సంబరాలు చేసుకుంటుండగా.. మరో వర్గానికి చెందిన వారు ఆ పాటలు ఆపాలని కోరారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close