తెలకపల్లి రవి : తెదేపా.. వైసీపీలకు తుని పాఠాలు

Telakapalli-Raviతునిలో కాపునాడు సందర్భంగా రగులొక్కన్న చిచ్చు ఎపి రాజకీయాలను బాగా వేడెక్కించింది. అయితే ఇదంతా జరిగిన తీరు పాలక ప్రతిపక్షాలలో ఎవరికీ పెద్ద ప్రయోజనం కలిగించేదిగా లేకపోవడం విశేషం!ఇది ఇంకా పెరుగుతుందే గాని తగ్గుతుందని భావించడం కష్టం. ఎందుకంటే నిర్వాహకులు, ప్రభుత్వం ప్రధాన ప్రతిపక్షం ఎవరూ అంగుళం కూడా సర్దుబాటు ధోరణి ప్రదర్శించడం లేదు. కాపునాడుకు తమ వారిని వెళ్లకుండా చేయడం, ఆటంకాలు కల్పించినట్టు ఆరోపణల కారణంగా తెలుగుదేశం తనకు అనుకూలంగా మలుచుకునే అవకాశాలు నామమాత్రం. పైగా కొన్ని అరాచక శక్తులు వైసీపీ వారే ఇదంతా చేశారని పదే పదే చెప్పడం ద్వారా ఈ మొత్తం సభకు ఘనత వారిదేనని ఒప్పుకుంటున్నట్టు అవుతుంది. అదే నిజమైతే ఇంత ప్రచారంతో భారీగా సభ జరుగుతున్న చోట అప్రమత్తంగా వుండి పరిస్థితి అదుపు తప్పకుండా చూడవలసిన బాధ్యత కూడా ఎక్కడైనా ప్రభుత్వానిదే గనక ఆ రీత్యానూ విమర్శ ఎదుర్కోవాలి. నిజానికి చంద్రబాబు నాయుడు చొరవ చూపించినంతగా ఆయన సహచరులు, ముఖ్యంగా ఆ వర్గీయులు ముందుకు రాలేదు. సభకు ఆహార వాహనాలు సమకూర్చిన వారిలో కొందరు తెలుగుదేశం ముఖ్యుల పేర్లు కూడా నిన్న వినిపించాయి. అక్కడ దగ్గరుండి నడిపిస్తున్న ముద్రగడ పద్మనాభంను గాక జగన్‌పై ధ్వజమెత్తడం ద్వారా ముఖ్యమంత్రి ఆయనకు మరింత ప్రచారం కల్పిస్తున్నారు. ఈ కమీషన్‌ పూర్తి నియామకం, దాని సిఫార్సులు రావడం వంటివి చాలా సమయం తీసుకోవడం అనివార్యం గనక ఈ రాజకీయ కాష్టం రగులుకుంటూనే వుంటుంది. దాని ప్రభావం ప్రభుత్వంపైనా పడుతుంది. పైగా సామాజికాంశాన్ని రాజకీయ ప్రత్యర్థిపై దాడికే ఉపయోగించారన్న నింద మోయవలసి వస్తుంది. పట్టిసీమ, రాయలసీమ, అమరావతి, కాల్‌మనీ కేసులను ఈ సందర్భంలో ప్రస్తావించడం సమర్థనీయం కాదు కూడా. అధికారులకు సంయమనం పాటించమని చెప్పి మంచి పనిచేసిన చంద్రబాబు తానే ఎందుకు దాన్ని పాటించలేకపోయారనేది సమాధానం లేని ప్రశ్న. బీసీల నుంచి అభ్యంతరాలు వస్తాయని తనే చెప్పడం కూడా ఉద్దేశపూర్వకంగా ఎగదోస్తున్నారనే ఆరోపణకు దారి తీస్తుంది. వైసీపీకి కూడా ఇరకాటమే ఇక జగన్‌ , వైసీపీ ఈ సభ నుంచి ఆశించిన ప్రయోజనం నెరవేరిందా? అంటే దహన కాండతో పరిస్థితి మారిపోతుంది. ప్రభుత్వానిదే బాధ్యత అని చెప్పినా ముఖ్య నేతలను పంపించిన జగన్‌కూడా సమాధానం చెప్పకతప్పదు. మా బాధ్యత లేదు అంటే మీకు పట్టులేని చోటకు ఎందుకు వెళ్లారనేది చెప్పాలి. రిజర్వేషన్ల కల్పన సాధ్యం కాదంటే మీ తండ్రి హయాంలో ఎందుకు చేయలేదనే ప్రశ్న కూడా వుంటుంది. రాజకీయాంశాలకు జగన్‌ గట్టిగానే జవాబు చెప్పొచ్చు గాని ఈ దాడులకు ఎత్తుగడలకు సంబంధించి ఆయన దగ్గర పెద్ద సమాధానాలు దొరకవు. రేపు జరిగేవి కూడా వారి చేతుల్లో లేనప్పుడు ముఖ్య పాత్రధారులుగా ముద్ర వేయించుకోవడం తప్పవుతుంది.గతంలో కోస్తా ప్రాంతంలో జరిగిన కుల ఘర్షణలను గుర్తు చేయడం వల్ల పెరిగే అభద్రతా భావం చంద్రబాబుకే ఉపయోగపడుతుంది. ఈ పాతికేళ్ల కాలంలో పరిస్థితులు చాలా మారాయనే వాస్తవం వైసీపీ గుర్తించవలసి వుంటుంది. మౌలిక సమస్య.. మామూలుగా నేను కులాల ప్రస్తావనతో మాట్లాడ్డం అరుదు. కాని కాపునాడు విషయంలో కులాలు రాజకీయాలు పెనవేసుకుపోయాయి. ఇందులో రెండు ప్రధాన పార్టీల పాత్ర వుంది. మొదటి కాపునాడు జరిగినప్పుడు గాని వంగవీటి రంగా హత్య, ఆ తర్వాతి పరిణామాలు గాని ప్రత్యక్షంగా చూశాను. దీనంతటి నుంచి వారు చాలా నేర్చుకుని వున్నారు. కాంగ్రెస్‌తో చాలా కాలం వుండి ఆ తర్వాత చిరంజీవిని వెనక నడిచి నష్టపోయామని భావిస్తున్న కాపులు విభజన తర్వాత  మొదటిసారిగా తెలుగుదేశంను బలపర్చారు. వైసీపీకి అండగా వుంటాయనుకున్న గోదావరి జిల్లాలు తెలుగుదేశంను గద్దెక్కించడంలో కీలక పాత్ర వహించాయి. అయితే కాపుల మద్దతు రిజర్వేషన్లు, నిధులు, రాజకీయ ప్రాధాన్యత వంటి హామీలను బట్టి ఇచ్చిందే. వాటిని అమలు చేయడంలో గాని విస్త్రతంగా చర్చకు పెట్టడంలో గాని ప్రభుత్వం జాగు చేసిన మాట నిజం.. ఎన్నికల అనంతర రాజకీయ పునస్సమీకరణలో( అంటే ఇంగ్లీషులో చెప్పుకునే రీ అలైన్‌మెంట్‌- రాజకీయ సామాజిక శక్తులు అటూ ఇటూ మారడం) ఇది ప్రధానమైన మలుపుగా అందరూ భావించారు. అయితే తుని విధ్వంసకాండ ఈ పరిణామాన్ని మరింత సంక్లిష్లం చేసింది. కాపునాడు నాయకులను పిలిచి చర్చలు జరిపి సహేతుక పరిష్కారం సాధించవలసిన బాధ్యత ప్రభుత్వానిది. తమ నిరసనలో ఉద్రిక్తతలు చేయిదాటకుండా చూసుకోవలసిన బాధ్యత కాపునాడు నాయకత్వానిది. ఈ ఇద్దరి మధ్యలో వైసీపీ ఏ మాత్రం వ్యూహాత్మకంగా వ్యవహరించగలుగుతుందనేది రాజకీయ ప్రశ్న. పవన్‌ ప్రవేశం! ఈ సన్నివేశంలో పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ మాట్లాడతారంటున్నారు. కాని గతంలో ఆయన జోక్యం చేసుకున్న సందర్బాలను చెప్పిన మాటలను చేతలను బట్టి చూస్తే హితబోధలు శాంతి వచనాలే వినిపిస్తారని వూహించవచ్చు. ఈ దశలో వాటిని ఎవరూ పట్టించుకోకపోవచ్చు. అలాగే తెలుగుదేశం బిసిలతో సహా ఇతర కుల సంఘాలను రంగం మీదకు తేవడం కూడా ఘర్షణ పెంచుతుంది. రాజ్యాంగ పరంగా చేసేది చేయడం రాజకీయంగా విశ్వాసంలోకి తీసుకుని భరోసా కల్పించడం ఇక్కడ ముఖ్యం. ఇటీవలి కాలంలోని గుజ్జర్ల పటేళ్ల తరహా వాతావరణం ఈ విభజిత రాష్ట్రానికి ఏమాత్రం మంచిది కాదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రియదర్శి తాటతీసే ‘డార్లింగ్’

హనుమాన్ విజయం తర్వాత నిర్మాత నిరంజన్ రెడ్డి కొత్త సినిమా ఖరారు చేశారు. ప్రియదర్శి హీరోగా ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి డార్లింగ్ అనే టైటిల్ పెట్టారు. అశ్విన్ రామ్ దర్శకుడు....

నినాదాలు చేస్తే సస్పెండ్ చేస్తారా..?

ఏపీ సీఎం జగన్ బస్సు యాత్రలో జై పవన్ కళ్యాణ్ అంటూ నినాదాలు చేసిన విద్యార్థులను సస్పెండ్ చేసింది ఆదిత్య విశ్వవిద్యాలయం. ఈమేరకు సర్క్యులర్ జారీ చేసిన వర్సిటీ అధికారులు.. సీఎం...

మార్గదర్శిపై జగన్ ప్రచారాన్ని రోజా కూడా నమ్మలేదే !

మార్గదర్శి నిండా మునిగిపోయిందని చిట్స్ పాడుకున్న వారికి డబ్బులు ఇవ్వడం లేదని జగన్ రెడ్డి అండ్ సీఐడీ కంపెనీ చేసిన ప్రచారం అంతా ఇంతా కాదు. కోర్టుల్లో చెప్పారు.. కేసుల్లో...

టీడీపీ కూటమికి వంగవీటి రాధా విస్తృత ప్రచారం !

ఎన్డీఏ కూటమి తరపున స్టార్‌ క్యాంపెయినర్‌ రంగంలోకి దిగారు వంగవీటి రాధా. గతంలో కాంగ్రెస్, PRP, వైసీపీ నుంచి పోటీ చేసిన ఆయన ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉన్నారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close