వైఎస్-జగన్ పాఠమే కెసీఆర్, బాబులను తొందరపెడుతోందా?

పైకి ఎన్నిరకాలుగా తిట్టుకున్నప్పటికీ ఇండియాలో ఉన్న ఎక్కువ శాతం మంది రాజకీయ జీవులు ఒకే గూటి పక్షులు. కోటాను కోట్ల రూపాయలు సంపాదించుకోవాలి. కొన్ని తరాల పాటు తమ కుటుంబ సభ్యులే అధికారంలో ఉండాలి, ప్రపంచంలో ఉన్న అత్యున్నత సౌకర్యాలన్నీ అనుభవించాలి అని ఆశిస్తూ ఫక్తు కోరికల లిస్టు ప్రకారం డబ్బు, అధికారం కోసమే ఆలోచిస్తూ ఉండే బాపతు జనాలు. గతంలో స్వతంత్ర మీడియా వాయస్ కాస్త గట్టిగా వినిపించేది కాబట్టి ప్రజల్లో ఎక్కడ వ్యతిరేకత వస్తుందో అని చెప్పి ఆచితూచి అడుగులు వేసేవాళ్ళు. ఇప్పుడంతా కూడా భజన మీడియా హవానే కాబట్టి అలాంటి శషబిషలు ఏమీ లేవు. లోకేషుడు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నుంచీ కూడా ప్రధాన తెలుగు మీడియాలో వస్తున్న వార్తలను చూడండి. చంద్రబాబుకు పాదాభివందనం ఎలా చేశాడు? కేబినెట్ మీటింగ్‌లో లోకేష్ ఎక్కడ కూర్చున్నాడు? మొదటి సంతకం ఎక్కడ పెట్టాడు?…అబ్బో అన్నీ ఇలాంటి వార్తలే. కానీ తన రాజకీయ వారసుడు బాలకృష్ణ అని ఎన్టీఆర్ ప్రకటించినప్పుడు …ఆ విషయాన్ని తప్పు పట్టిన చంద్రబాబు ఇప్పుడు లోకేష్‌ని ఏకంగా మంత్రిని ఎలా చేయగలిగాడు? కాంగ్రెస్ పార్టీ వారసత్వ రాజకీయాలను ఈసడించుకున్న ఇద్దరు చంద్రులూ అదే వారసత్వ రాజకీయాలను ‘అంతకుమించి’ అనే స్థాయిలో ఎలా అమలు చేస్తున్నారు?

వారసులకు పట్టాభిషేకం చేయడం కోసం ఇద్దరు చంద్రులూ కూడా ఈ స్థాయిలో తొందరపడడం, తపనపడడం వెనుక జగన్ పాఠం కూడా ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే దొడ్డిదారినో, అడ్డదారినో వైఎస్ జగన్‌ని కూడా మంత్రివర్గంలో చేర్చుకుని ఉంటే ఈ రోజు జగన్‌కి ఇన్ని కష్టాలు ఉండేవి కాదు. వైఎస్ చనిపోయిన వెంటనే ముఖ్యమంత్రిగిరీ కూడా వచ్చి ఉండేది. కేసుల వ్యవహారం కూడా ఉండేది కాదు అనడంలో సందేహం లేదు. వైఎస్ జగన్‌కి మంత్రిగా చేసిన అనుభవం లేకపోవడమే శాపమైంది. ఇప్పుడు కెసీఆర్-కెటీఆర్, చంద్రబాబు-లోకేష్‌లను అలర్ట్ చేస్తోంది కూడా వైఎస్-జగన్‌ల పాఠమే అనడంలో సందేహం లేదు. తండ్రుల కంటే కూడా కొడుకులే కాస్త ఎక్కువ తొందరపడుతున్నారు. ఎటుండి ఎటు వచ్చినా …తండ్రులకు ఏమైనా కూడా పార్టీ, కుర్చీ మాత్రం తమకే దక్కాలన్న స్వార్థంతో మంత్రులు అయిపోతున్నారు. తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మంత్రిగా ఎంట్రీ ఇస్తే ఇంకో గొప్ప సౌలభ్యం కూడా ఉంటుంది. భజన పరులు, భజన మీడియా దెబ్బకు సమర్థులుగా ముద్ర వేయించుకోవడం చాలా సులభం. నారా కుటుంబం, కల్వకుంట్ల కుటుంబం, వైఎస్ కుటుంబం….ఇలా కొన్ని కుటుంబాల కింద బానిసలుగా ఉండాలని…ఆ బానిసత్వ భజనతో బ్రహ్మాండమైన గిఫ్ట్స్ పుచ్చుకుంటూ బానిసలు బ్రతికేయాలని ఆలోచించే భజనగాళ్ళకు మన దగ్గర కొదవేముంది? లోకేష్ మొదటి సంతకం ఎంత గొప్పదో అన్న భజన ఆల్రెడీ మొదలెట్టారు. గట్టిగా ఆరు నెలలు తిరిగేసరికి చంద్రబాబు కంటే సమర్థుడు లోకేష్ అని కూడా ప్రచారం చేస్తారనడంలో సందేహం లేదు. జనోద్ధరణ కోసం లోకేష్ రోజుకు 34 గంటలు కష్టపడుతున్నాడని వినే రోజులు కూడా దగ్గరలోనే ఉన్నాయనడంలో సందేహం లేదు. అధికార బలం, డబ్బు బలం చేతిలో ఉండాలే కానీ తప్పులను కూడా ఒప్పులుగా ఒప్పించడం ఎంత సేపు?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇళ‌య‌రాజాకు ఇంకా ఈ వ్యామోహం ఎందుకు?

ఇళ‌య‌రాజా స్వ‌ర‌జ్ఞాని. సంగీత బ్ర‌హ్మ‌. ఆయ‌న అభిమాని కానివారంటూ ఉండ‌రేమో..?! ఆయ‌న్ని దేవుడిగా ఆరాధిస్తారు అభిమానులు. ఇంత గొప్ప ఇళ‌య‌రాజాకు `కాపీ రైట్స్`పై మ‌మ‌కారం ఎక్కువైపోతోంది. త‌న పాట ఎవ‌రు పాడినా, వాడుకొన్నా.....

హీరోయిన్ల నెత్తిమీద `పాన్ ఇండియా` కిరీటం

పాన్ ఇండియా హీరోలు పాన్ ఇండియా సినిమాలూ ఉన్న‌ప్పుడు.. పాన్ ఇండియా హీరోయిన్లూ ఉంటారు. ఉన్నారు కూడా. అదే గుర్తింపుతో సినిమాల్ని చేజిక్కించుకొంటున్న‌వాళ్లూ, ఆ పేరు చెప్పి పారితోషికాన్ని గ‌ట్టిగా గుంజుతున్న‌వాళ్ల గురించే ఈ క‌థ‌నం. ప్ర‌స్తుతం...

గుడ్ న్యూస్ చెప్పిన హైదరాబాద్ వాతావరణ శాఖ

వేసవిలో ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతోన్న హైదరాబాద్ ప్రజలకు కాస్త ఊరట లభించింది. శనివారం ఉదయం నుంచి నగరంలో పలు చోట్ల మోస్తరు వర్షాలు కురవడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ప్రతి రోజూ వడగాడ్పులతో...

విజ‌య్ పాత లెక్క‌ల‌న్నీ బ‌య‌ట‌కు తీస్తారా?

విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన 'డియ‌ర్ కామ్రేడ్‌', 'ఖుషి' చిత్రాల తాలుకూ క‌మ‌ర్షియ‌ల్ రిజ‌ల్ట్ ఏమిటి? ఈ సినిమాల వ‌ల్ల నిర్మాత‌లు న‌ష్ట‌పోయారా, లాభ‌ప‌డ్డారా? ఈ లెక్క‌ల‌న్నీ బ‌య‌ట‌కు రాబోతున్నాయి. విజ‌య్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close