రివ్యూ: లైగర్

Liger movie review telugu

రేటింగ్: 2.5/5

పూరీ జగన్నాథ్ ఇండస్ట్రీని ఒక మలుపు తిప్పిన దర్శకుడు. వంద రోజుల సినిమాలు ఇచ్చి ఇండస్ట్రీ లెక్కలు మార్చిన క‌థ‌కుడు. హీరోలకు కెరీర్ లో గుర్తుండిపోయే బ్లాక్‌ బస్టర్స్ ఇవ్వడమే కాదు.. వాళ్ల‌కు డిఫరెంట్ మాస్ స్వాగ్ సెట్ చేసిన దర్శకుడు. అందుకే పూరి సినిమా అంటే ఎప్పుడూ క్రేజే. విజయ్ దేవర కొండ కూడా ఇంతే. అర్జున్ రెడ్డి తో పెద్ద‌ స్టారైపోయాడు. ఇప్పటివరకూ బాలీవుడ్ లో విజయ్ ఒక్క సినిమా కూడా చేయలేదు. కానీ విజయ్ కి నార్త్ లో అనూహ్యమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఈ ఇద్దరు సెన్సేషనల్ స్టార్స్ కలసి ‘లైగర్’ని పాన్ ఇండియా సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. పూరి, విజయ్ దేవరకొండల మొదటి పాన్ ఇండియా సినిమా లైగర్. విజయ్ ఫైట్లు, డ్యాన్సులు చేసిన సినిమా లైగర్. బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ ఇండియన్ స్క్రీన్ పై తెచ్చిన సినిమా లైగర్. పూరి హీరో తొలిసారి వైకల్యం(నత్తి)తో నటించిన సినిమా లైగర్. ఇలా ఎన్నో విశేషాలతో ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచిన లైగర్… ఆ అంచ‌నాల్ని అందుకొందా, లేదా?

లైగర్ (విజయ్ దేవరకొండ) తల్లి బాలామణి (రమ్య కృష్ణ)తో కలసి కరీంనగర్ నుంచి ముంబైకి వస్తాడు. MMA (మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ )లో ఛాంపియన్ కావాలనేది లైగర్ లక్ష్యం. టీ అమ్ముకొని జీవనం గడుపుతున్న బాలామణి తన కొడుక్కి ఎంఎంఎ ట్రైనింగ్ ఇవ్వమని కోచ్ (రోనిత్ రాయ్ ) ద‌గ్గ‌ర‌కు తీసుకొని వెళ్తుంది.. డబ్బులు లేకుండా నేర్పించడం కుదరదని చెప్పిన కోచ్.. బాలామణి తన గతం చెప్పడంతో లైగర్ కి ట్రైనింగ్ ఇవ్వడానికి అంగీకరిస్తాడు కోచ్. తాన్య (అనన్య పాండే) రీల్స్ చేస్తుంటుంది. సోషల్ మీడియాలో సెలబ్రిటీ అయిపోవాలనేది ఆమె లక్ష్యం. లైగర్ ని చూసి ఇష్టపడుతుంది తాన్య. సంజు (విష్ రెడ్డి) తాన్య బ్రదర్. లైగర్ , తాన్యలు ప్రేమలో వున్నారని తెలిసి రగిలిపోతాడు. తన బర్త్ డే రోజు అందరూ చూస్తుండగా త‌న‌ని ఎత్తుకెళ్ల‌మని లైగర్ ని కోరుతుంది తాన్య. ఈ సంగతి తల్లి బాలామణికి తెలిసి లైగర్ మందలిస్తుంది. ఆటపై ద్రుష్టి పెట్టమని హెచ్చరిస్తుంది. అయితే తల్లిమాటని కాదని తాన్యని ఎత్తుకొస్తాడు లైగర్. అయితే లైగర్ కి నత్తి వుందని తెలిసి షాక్ అవుతుంది తాన్య. లైగర్ ని అవమానిస్తుంది. అసలు తాన్య ఎందుకలా ప్రవర్తించింది ? మైక్ టైసన్ లైగర్ జీవితంలోకి ఎందుకు వచ్చాడు ? చివరిగా లైగర్ ఛాంపియన్ అయ్యాడా లేదా ? అనేది మిగతా కథ.

పూరీ జగన్నాథ్ విభిన్నమైన కథకుడు. రెండు సీన్లు చూస్తే చాలు.. ఇది పూరి సినిమాని చెప్పచ్చు. పూరి హీరో తెరపై అలా న‌డిచొస్తుంటే ఒక ఎనర్జీ కదులుతునట్లే వుంటుంది. అంత బలమైన మార్క్ ఆయనది. విచిత్రమేమిటంటే.. లైగర్ సినిమా పుర్తయిపోయి థియేటర్ నుంచి బయటికి వస్తున్నపుడు.. మరోసారి టైటిల్స్ చూడాలనిపిస్తుంది. కారణం.. అసలు ఈ సినిమా రాసింది, తీసింది పూరియేనా ? అని చెక్ చేసుకోవడానికి. లైగర్ కి వున్న స్పెషాలిటీ ఏమిటంటే.., ఒక్క సీన్ లో కూడా ఇది పూరి జగన్నాథ్ సినిమా అనిపించకపోవడం.

ఈ సినిమాలో హీరోకి నత్తి పెట్టారు. నిజంగా చాలా డేరింగ్ నిర్ణయం ఇది. ఇంత డేరింగ్ నిర్ణయం తీసుకున్నపుడు.. నత్తితో హీరో ఏం సాధిస్తాడు ? కథకు ఇది విధంగా పనికొస్తుంది? అని అలోచించినట్లు కనబడదు. నత్తిని కథలో వాడుకున్న విధానం చాలా హాస్యాస్పదంగా వుంటుంది. ‘నీకు నత్తి వుంది కాబట్టి నువ్వు నాకు వద్దు”చెబుతుంది హీరోయిన్. హీరోయిన్ ఈ కారణం చెప్పడానికి నత్తి పనికొచ్చింది. ఈ మాత్రానికి సినిమా మొత్తం నత్తితో చిరాకు తెప్పించాలా ? నువ్వు స్లమ్ము నేను స్లిమ్ము అంటే సింపుల్ గా సరిపోయేదానికి .. ఆ నత్తి రభస అవసరమా ? ఖచ్చితంగా అవసరం లేదు.

హీరో తన పరిచయంలోనే దాదాపు వందమంది రౌడీలని కొట్టేస్తాడు. ఇంత ధీరోధాత్తుడైన‌ హీరో ఎంఎంఎ ఛాంపియన్ కావడం పెద్ద లెక్క కాదనే సంగతి ప్రేక్షకుడికి ముందే తెలిసిపోతుంది. తర్వాత హీరో ఎన్ని ఫైట్లు చేసినా.. ఎలాంటి ఇంపాక్ట్ రాలేదు. ఇలాంటి సినిమాల్లో ప్రతి ఫైట్ కథని ముందుకు తీసుకెళ్లాలి. లైగర్ లో అది జరగలేదు. తమ్మడు సినిమాలో పవన్ కళ్యాణ్ రింగ్ లో చేసిన ఫైట్ ఒక్కటంటే ఒక్కటే. ఆ ఫైట్ కోసం, ఆ గెలుపు కోసం ప్రేక్షకుడు ఊపిరి బిగబట్టుకొని చూస్తాడు. నిజానికి ఇలాంటి స్పోర్ట్స్ నేపధ్య సినిమాలకు కావాల్సిన స్క్రీన్ టెక్నిక్ అదే. హీరో చేసే ఫైట్ ప్రేక్షకుడు తన ఫైట్ గా ఫీలవ్వాలి. కానీ లైగర్ లక్ష్యాన్ని ఎంత నవ్వులాటగా చేశారంటే.. తన ఫైట్ ని లక్ష్యాన్ని వదులుకొని వెళ్లిపోతాడు లైగర్. రింగులో కాకుండా ఎక్కడో గొడవ పడతాడు. ఆ గొడవని లైవ్ లో టెలీకాస్ట్ చేస్తారు. ఇదేం విచిత్ర‌మో అర్థం కాదు. ఎంత సినిమా అయినా స‌రే, ఇంత లిబ‌ర్టీ తీసుకోవాలా..?

స్క్రీన్ రైటింగ్ ని ఎంత లోకువగా చేసి ఈ సినిమాని రాశారంటే.. ఆట నేర్పించమని కోచ్ దగ్గరికి వస్తాడు హీరో. ఆ కోచ్ ముందు ఆఫీసు పనులు చూడామని, తర్వాత నేర్పిస్తానని చెప్తాడు. హీరోకి వున్న స్కిల్ చూసి నేర్పించడానికి అంగీకరిస్తాడు. హీరో తల్లి చాలా సంబరపడిపోతుంది. ఇంత ఎపిసోడ్ నడిపిన తర్వాత ఈ కోచ్ ఇతడికి ఏం నేర్పించాడంటే .. ఏం నేర్పించలేదు. అదే వైరైటీ. మాంటేజ్ సాంగ్ లో హీరో వెంట పరిగెట్టడం తప్పితే.. ఆ కోచ్ నేర్పించిన టెక్నిక్స్, హీరో నేర్చుకున్న విద్య అంటూ ఏమీ లేదు. బాలామణి తన గతం గురించి కోచ్ దగ్గర చెబుతుంది. కోచ్ షాక్ అవుతాడు. అంత షాకింగ్ గతం తాలుకూ ఒక్క సీన్ కాదు కదా.. కనీసం ఫోటో కూడా చూపించలేదు. అందరూ చూస్తుండగా బర్త్ డే పార్టీ నుంచి ఎత్తుకెళ్ళని చెబుతుంది హీరోయిన్. కట్ చేస్తే.. రోడ్డు మీద హీరో హీరోయిన్ ని ఓపెన్ చేస్తారు. ఇది బర్త్ డే పార్టీ బడ్జెట్ సమస్య కాదు.. కథ కంటే చాలా గొప్ప వాళ్ళమనుకునే గర్వంతోనే ఇలాం
టి ట్రీట్మెంట్ వస్తుంది.

హీరో తన లక్ష్యాన్ని వదిలి తన ప్రేయసి కోసం వెళ్తాడు. ఈ సినిమాలో అర్ధం కానీ విషయాల్లో ఇదొకటి. అసలు హీరో హీరోయిన్ ఎప్పుడు ప్రేమించుకున్నారో ప్రేక్షకుడికి అర్ధం కాదు. ఫస్ట్ సీన్ లో హీరోయిన్ కాలర్ పట్టుకుంటాడు. సెకండ్ సీన్ లో హీరో ఫైట్ చూసి పడిపోతుంది. మూడో సీన్ లో పాట. నాలుగో సీన్ లో హీరోయిన్ ని ఎత్తుకొచ్చేస్తాడు. తెరపై ఆ తంతు చూస్తున్నప్పుడు.. పూరి లాంటి ద‌ర్శ‌కుడి నుంచి రావాల్సిన సీన్లు ఇవేనా? అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ వరకూ ఎదో ఇలా నడిపించారు. సెకండ్ హాఫ్ గురించి ఇంక చెప్పడానికి ఏమీ లేదు. లైగర్ ఇండియాలో ఫైట్లు చేస్తాడు. లైగర్ అమెరికా వెళ్తాడు. లైగర్ అమెరికాలో ఫైట్లు చేస్తాడు. స్వస్తి.

లైగర్ కోసం సర్వస్వం ఇచ్చేశాని చెప్పాడు విజయ్. ఆయన ఏం ఇచ్చాడో కానీ పెంచిన సిక్స్ ప్యాక్ బాడీ, పెరిగిన జట్టు మాత్రం తెరపై కనిపిస్తుంది. చాలా కష్టపడి నత్తి నటించాడు. నిజానికి ఏదైనా వైకల్యం వుంటే రెండు సీన్లు తర్వాత ప్రేక్షకుడు దానికి అలవాటు పడిపోవాలి. కానీ విజయ్ నత్తి మాత్రం చివరి వరకూ కొత్త చెప్పులు కరిచినట్లు చిరాగ్గానే వుంటుంది. ఫైట్లు కోసం కష్టపడ్డాడు. డ్యాన్సుల విషయంలో విజయ్ ఇంకా మెరుగవ్వాలి. డ్యాన్స్ లో ఇంకా గ్రేస్ రావాలి. ది గ్రేట్ మైక్ టైసన్ ని ఇండియన్ స్క్రీన్ మీదకి తెచ్చిన ఘనత మాత్రం పూరికి దక్కుతుంది. ఆయన బేసిగ్గా నటుడు కాదు. అయితే ఆయన ప్రజన్స్ ఎంజాయ్ చేసేలా వుంటుంది. అనన్య గ్లామరస్ గా వుంది. డ్యాన్సులు బాగా చేసింది. రమ్యకృష్ణ పాత్రలో ఎమోషన్ వర్క్ అవుట్ కాలేదు. ప్రతి డైలాగ్ ని అరచి చెబుతుంటుంది. ఆ అరుపులో అరుపు తప్పితే మెరుపు వుండదు. విషు రెడ్డి, అలీ, రోనిత్ రాయ్, మకరంద్ దేశ్ పాండే, గెటప్ శ్రీను పాత్రలు పరిధిమేర వున్నాయి.

సాకేతికంగా సినిమా ఉన్నతంగా వుంది. పాటల్ని లావిష్ గా చిత్రీకరీంచారు. యాక్షన్ సీక్వెన్స్ ని బాగానే డిజైన్ చేశారు. పూరి డైలాగ్స్ లో మెరుపులు తగ్గాయి. నేపధ్య సంగీతం కోసం సునీల్ కశ్యప్ చాలా కష్టపడ్డాడు. కానీ సీన్స్ లో బలం లేకపోవడంతో ఎలివేట్ కాలేదు. విష్ణు శర్మ సినిమాటోగ్రఫీ డీసెంట్ గా వుంది. ఎడిటింగ్ లో చాలా జంప్స్ వున్నాయి. అక్డీ పక్డీ పాట ప్లేస్ మెంట్ మధ్యలో రెండు సీన్లు లేపేసి ఇరికించినట్లు వుంటుంది. స్టంట్ డైరెక్టర్ కేచ కి మంచి మార్కులు పడతాయి. నిర్మాణ విలువలు ఉన్నతంగా వున్నాయి.

పూరీ జగన్నాథ్ లో పూర్వపు మెరుపులు లేవు. అయితే ఆయనకంటూ ఒక స్టయిల్ వుంది. లైగర్ లో ఆ స్టయిల్ కూడా కనిపించలేదు. ఈ సినిమా చేస్తున్నప్పుడు మెంటలెక్కిపొయిందని చెప్పాడు విజయ్. విజయ్ ఏ ఉద్దేశంతో చెప్పాడో కానీ లైగర్ చూశాక మాత్రం విజ‌య్ ఫ్యాన్స్‌కి నిజంగానే మెంట‌ల్ ఎక్కేస్తుంది.

ఫినిషింగ్ ట‌చ్‌: ‘లైట‌’ర్‌…

రేటింగ్: 2.5/5

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close