కుప్పంను పులివెందుల చేసేశారు !

కుప్పంను పులివెందులలా చూసుకుంటా అని సీఎం జగన్ ..మాట ఇచ్చి కొద్ది రోజుల్లోనే అన్నట్లుగానే చేశారు. చంద్రబాబు పర్యటన రెండో రోజు.. వైసీపీ నేతలు బంద్‌కు పిలుపునిచ్చారు. చంద్రబాబు ప్రారంభించాల్సిన అన్న క్యాంటీన్‌ను ధ్వంసం చేశారు. టీడీపీ జెండాలను బ్యానర్లను చిందరవందర చేశారు. భారీగా ర్యాలీ నిర్వహించిన అల్లరి మూకకు పోలీసులు రక్షణగా ఉండి.. ఈ ధ్వంసం జరిగేలా చూశారు. అన్నీ స్పష్టంగా వీడియోల్లో నమోదయ్యాయి. కానీ పోలీసులు మాత్రం ఎక్కడా కనిపించలేదు.

కుప్పంలో ఇలాంటి పరిస్థితులు ఎప్పుడూ లేవు. అత్యంత దారుణంగా శాంతిభద్రతలు దిగజారిన పరిస్థితి స్పష్టంగా కనిపించింది. దారుణమైన విషయం ఏమిటంటే పోలీసులే వారికి సహకారం అందించడం.. వైసీపీ అల్లరి మూకలు చేయాల్సినంత రచ్చ చేసిన తర్వాత చిత్తూరు ఎస్పీ కుప్పం చేరుకుని వైసీపీ నాయకుల ఇళ్లకు భద్రత ఎలా ఉందో సమీక్ష చేశారు. ఎమ్మెల్సీ భరత్ ఇంటికి వందమంది పోలీసుల భద్రత పెట్టారు. కుప్పంలో వైసీపీ విధ్వంసకాండ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ప్రశాంతంగా ఉండే కుప్పంలో ఇంత దారుణమైన పరిస్థితులను తీసుకు రావడం ఏమిటన్న విశ్మయం వ్యక్తమవుతోంది. చంద్రబాబు మూడు రోజుల పర్యటనకు వస్తున్నారని తెలిసి తొలి రోజే చంద్రబాబు వెళ్లే రూట్‌లో పోలీసు సాయంతో వైసీపీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయించారు. వాటిని తొలగించారని చెప్పి కొంత మంది ఉద్దేశపూర్వకంగా గొడవకు దిగారు. తర్వాత ప్రతి గ్రామం నుంచి కార్యకర్తలు రావాలని పిలుపునిచ్చారు. అన్నీ స్పష్టంగా కనిపిస్తున్నా పోలీసులు మాత్రం విధ్వంసానికే సహకరించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఉత్తరాంధ్ర… ‘అధికార’ నిర్ణయాంధ్ర !

రాజకీయంగా ఎంతో చైతన్యంగా ఉండే ప్రాంతాల్లో ఉత్తరాంధ్ర జిల్లాలు ముందు వరుసలో ఉంటాయి... ఏదో ఒక మూలకు విసిరేసినట్లు ఉన్నప్పటికీ... ఈ మూడుజిల్లాలు... నేడే కాదు, నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా......

భీమిలి… ‘గంటా’ మజిలీ!

మాజీ మంత్రి, TDP నాయకుడు గంటా శ్రీనివాసరావు... వాస్తవానికి విశాఖ జిల్లాకు వలస వచ్చిన నాయకుడే అయినా... దాదాపు పాతికేళ్ళుగా ఓటమి ఎరుగని నాయకుడుగా ఉండటంతో స్థానికుడు అయిపోయాడు. ఎన్నికలు వస్తున్నాయి అంటే......

గుండు సున్నా కావాలా.. గుండె ధైర్యం కావాలా… ఇందూరు గడ్డపై కేసీఆర్ గర్జన

ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం నిజామాబాద్ రోడ్ షోలో పాల్గొన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీజేపీపై నిప్పులు చెరిగారు. నరేంద్ర మోడీ పాలనలో అచ్చేదిన్ కాదు... సచ్చేదిన్ వచ్చిందని మండిపడ్డారు. ప్రధాని మోడీ...

బటన్ల నొక్కిన డబ్బులపై వైసీపీ డ్రామా ఫెయిల్

ఏపీ లో అధికార పార్టీకి పుట్టెడు తెలివితేటలు. ఓటర్లకు తాము పంచే డబ్బులు కాకుండా పెండింగ్ పెట్టిన డబ్బులు వేయాలని అనుకున్నారు. చివరికి ఎటూ కాకుండా పోయింది. చేయూత సహా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close