‘విరూపాక్ష’తో ఓ సూపర్ హిట్టు కొట్టాడు సాయిధరమ్ తేజ్. ఆ తరవాత ‘బ్రో’లోనూ నటించాడు. ‘సంబరాల ఏటి గట్టు’ సెట్స్‌పై ఉంది. తేజ్ సినిమాల్లోకెల్లా భారీ బడ్జెట్ తో రూపొందించిన చిత్రమిది. నిరంజన్ రెడ్డి నిర్మాత. రోహిత్ దర్శకుడు. కథపై నమ్మకంతో కొత్త దర్శకుడు అని కూడా చూడకుండా చాలా భారీగా ఖర్చు పెడుతున్నారు. అయితే ఈసినిమా ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని, అందుకే షూటింగ్ కి గ్యాప్ వచ్చిందన్న వార్తలు వినిపించాయి. దానికి తగ్గట్టుగానే షూటింగ్ మధ్యలో ఆగిపోయింది. ఇటీవల సాయిధరమ్ తేజ్ పుట్టిన రోజున ఓ గ్లింప్స్ కూడా విడుదల చేశారు. కానీ షూటింగ్ అప్ డేట్ మాత్రం చెప్పలేదు.
అయితే ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ కి లైన్ క్లియర్ అయినట్టు టాక్. సినిమాకు సంబంధించిన ఆర్థిక వనరుల్ని నిర్మాత సమకూర్చుకొన్నారని, త్వరలోనే షూటింగ్ మొదలవుతుందని తెలుస్తోంది. ఈవారంలోనే ఈ చిత్రానికి సంబంధించిన కొత్త అప్ డేట్ బయటకు రావొచ్చు. అక్టోబరు 24 న ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని అప్పట్లో ప్రకటించారు. ఆ తరవాత రిలీజ్ డేట్ వాయిదా వేశారు. 2026 వేసవిలో ఈ చిత్రాన్ని విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.
మరోవైపు సాయిధరమ్ తేజ్ ఓ కొత్త సినిమా ఒప్పుకొన్నాడన్న ప్రచారం జరుగుతోంది. దేవాకట్టా దర్శకత్వంలో ఓ చిత్రాన్ని పట్టాలెక్కిస్తారని సమాచారం. వీరిద్దరి కాంబోలో ‘రిపబ్లిక్’ అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఆ చిత్రానికి ఇది సీక్వెల్ గా ఉండబోతోందని టాక్.