ఆంధ్రా లిక్కర్ స్కాం కేసులోనూ నిందితులు పిటిషన్ల వ్యూహం పాటిస్తున్నారు. జగన్ అక్రమాస్తుల కేసుల్లో నిందితులు ఎలా అయితే ఒకరి తర్వాత ఒకరు పిటిషన్లు వేసి.. కేసును ట్రయల్ వరకూ రాకుండా చేశారో ఇప్పుడూ అంతే చేస్తున్నారు. ఫామ్ హౌస్ లో పట్టుబడిన పదకొండు కోట్ల గురించి నాలుగైదు పిటిషన్లు వేశాడు రాజ్ కెసిరెడ్డి. ఇప్పుడు వెంకటేష్ నాయుడు ఫ్యామిలీ రంగంలోకి దిగింది. ఆ వీడియోను ఫోన్ నుంచి లీక్ చేశారంటూ కోర్టులో ఓ పిటిషన్ కోర్టులో పడేశారు.
తన భర్త ఫోన్ ను.. పోలీసులు స్వాధీనం చేసుకుని అందులో సమాచారం లీక్ చేస్తున్నారని అలా చేయకుండా చూడాలని.. డబ్బుల కట్టల వీడియోలు లీక్ చేసిన అధికారిపై చర్యలు తీసుకోవాలని ఆ అధికారిని బెదిరించేలా పేరు పెట్టి మరీ ఈ పిటిషన్ వేశారు. తప్పుడు పనులు చేసి అడ్డంగా దొరికిపోయి.. సాక్ష్యాలు బయటపడుతూంటే..బయటపెట్టొద్దని ఈ పిటిషన్ ఉన్నట్లుగా ఉంది.
అసలు విషయాలు బయటకు రాకపోతే.. తప్పుడు ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. వెంకటేష్ నాయుడు టీడీపీ వ్యక్తి అంటున్నారు. పచ్చదొంగ అని… వైసీపీ పత్రికలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నా ఈ వెంకటేష్ నాయుడి సతీమణికి చీమ కుట్టినట్లుగా లేదు. కానీ.. జరిగిన విషయం లిక్కర్ స్కామ్ తో సంబంధం ఉన్న వీడియో బయటకు వస్తే.. లీకులు ఇస్తున్నారని కోర్టుకెళ్లారు.
ఆ ఫోన్ లో ఇంకా ఎన్నో సంచలనాత్మకమైన విషయాలు ఉన్నాయని అవి క్రమంగా వరుసగా మీడియాలోకి వస్తే.. అడ్డంగా దొరికిపోతారన్న భయంతోనే వెంకటేష్ నాయుడు భార్య పేరుతో పిటిషన్ వేయించారు. అందులో ఏవో పర్సనల్ అంశాలు ఉన్నాయన్న అభిప్రాయం కల్పించడానికి ఆమెను కోర్టుకు తీసుకువచ్చారని సులువుగా అర్థమవుతుంది. ఇలాంటి రాజకీయాలు చేసే జగన్తో భాగమయ్యే వారు కుటుంబాలను ఇలా రోడ్డున పడేసుకోవాల్సిందే.