వ్యాక్సినేషన్ ఉన్నా గుజరాత్‌లో స్థానిక ఎన్నికల నోటిఫికేషన్..!

పంచాయతీ ఎన్నికల అంశం ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర ఉత్కంఠకు కారణం అవుతోంది. వ్యాక్సినేషన్ వల్ల ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని ఏపీ సర్కార్ సుప్రీంకోర్టులో బలంగా వాదించాలని నిర్ణయించుకుంది. ఎన్నికలు జరపాలని అనుకుంటే వ్యాక్సినేషన్ ఆగిపోతుందని అంటోంది. అయితే.. అదే సమయంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న గుజరాత్‌లో అక్కడి రాష్ట్ర ఎన్నికల సంఘం… స్థానిక ఎన్నికలు నిర్వహించడానికి షెడ్యూల్ విడుదల చేసింది. ఫిబ్రవరి ద్వితీయార్థంలో అక్కడ స్థానిక ఎన్నికలు జరుగుతాయి. ఇక్కడలా అక్కడ పదిహేను రోజుల్లో ముగించేయాలన్న చట్టం తీసుకు రాలేదు.

అందుకే.. నిబంధనలకు అనుగుణంగా కావాల్సినంత సమయం ఇచ్చి ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఓ వైపు ఇప్పటికే చాలా ప్రభుత్వాలు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించగా… తాజాగా గుజరాత్ కూడా… నిర్వహించడానికి సిద్ధమయింది. ఇలాంటి సమయంలో ఏపీ సర్కార్ మాత్రం.. ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్వహించబోమని చెబుతోంది. ఈ క్రమంలో సోమవారం సుప్రీంకోర్టులో పిటిషన్ విచారణకు రానుంది. ఉదయం పదకొండు గంటల తర్వాత జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపడుతుంది. మొదట.. జస్టిస్ లావు నాగేశ్వరరావు నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపడుతుందని సుప్రీంకోర్టు వెబ్ సైట్‌లో చూపించారు. అయితే తర్వాత ధర్మాసనాన్ని మార్చారు. ఎన్నికలకు సంబంధించిన పిటిషన్లన్నింటినీ జస్టిస్ సంజయ్ కిషన్ ధర్మాసనమే విచారిస్తుంది. ఉద్యోగుల పిటిషన్ కూడా ఆ ధర్మాసనమే విచారిస్తుంది.

సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభానికంటే ముందే .. అంటే ఉదయం పది గంటలకల్లా.. జిల్లాల్లో రిటర్నింగ్ ఆఫీసర్లు నోటిఫికేషన్లు జారీ చేసి… నామినేషన్లు స్వీకరించాల్సి ఉంటుంది. కానీ… సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకూ తాము సహకిరంచేది లేదని.. ప్రభుత్వం, ఉద్యోగ సంఘాలు తేల్చి చెబుతున్నాయి. ఈ క్రమంలో నామినేషన్లు తీసుకోకపోతే.. రాజ్యాంగ సంక్షోభం ఏర్పడే అవకాశం ఉంది. పది గంటల తర్వాత తాము నామినేషన్లు దాఖలు చేసేందుకు రిటర్నింగ్ అధికారుల కార్యాలయాలకు వెళ్తామని టీడీపీ నేతలు ఇప్పటికే ప్రకటించారు. దీంతో సోమవారం పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కీలకమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అగ్రదేశాలు పక్కనపెడుతుంటే ఇండియాలోనే ఎందుకు? ఈవీఎంలే బీజేపీ బలమా..?

లోక్ సభ ఎన్నికల వేళ మరోసారి ఈవీఎంల పనితీరుపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. సాంకేతికతకు పెద్దపీట వేసే అగ్రదేశాలు సైతం ఈవీఎంలను పక్కనపెడుతుంటే ఇండియాలో మాత్రం ఎందుకు ఈవీఎంలతోనే ఎన్నికలను నిర్వహిస్తున్నారనే ప్రశ్నలు...

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close