అప్పట్నుంచి గడ్డం తీసుకోని ఎల్వీ సుబ్రహ్మణ్యం..!

మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణం హఠాత్తుగా గుంటూరులో కనిపించారు. రామ మందిరానికి విరాళాలు సేకరించే ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. గబుక్కున ఆయనను చూసిన వారు చాలా మంది పోల్చుకోలేకపోయారు. ఎవరో స్వామిజీ ప్యాంట్, షర్టు వేసుకుని వచ్చారని అనుకున్నారు. ఎందుకంటే ఆయన పొడువాటి గడ్డం, బాగా పెరిగిపోయిన జుట్టుతో కనిపించారు. పూర్తిగా తెల్లగడ్డం. కానీ డ్రెస్సింగ్ మాత్రం ఆఫీసర్ స్టైల్లో ఉంది. ఈ ప్రత్యేకత చూసినా.. ప్రత్యేకంగా పరిశీలన జరిపిన తర్వాత ఆయన ఎల్వీ సుబ్రహ్మణ్యం అని నిర్ధారించుకున్నారు. వెంటనే.. ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు.. ఉద్యోగుల తీరుపై మీడియా అభిప్రాయం తెలుసుకుంది.

ప్రభుత్వ ఉద్యోగులు రాజ్యాంగబద్ధంగా విధుల్లో పాల్గొనాలని… రాజ్యాంగ స్ఫూర్తితో అందరూ పనిచేయాలని ఎల్వీ సుబ్రమణ్యం పిలుపునిచ్చారు. ఉద్యోగులు ప్రాణాలు త్యాగం చేయాల్సిన అవసరం లేదని.. ప్రభుత్వాన్ని, ఎస్ఈసీని నిర్భయంగా అడిగి… తగిన రక్షణ ఏర్పాట్లు చేసుకోవాలని సలహా ఇచ్చారు. రాజ్యాంగ విలువలను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని సలహా ఇచ్చారు. ఎల్వీ మాటలు మీడియాలోనూ హైలెట్ అయ్యాయి. సాధారణ ఎన్నికల సమయంలో… ఎన్నికల కమిషన్ అప్పటి ప్రభుత్వ చీఫ్ సెక్రటరీని తొలగించి… ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని సీఎస్‌గా నియమించింది.

ఆయన ఫలితాలు రాక ముందే వైసీపీకి కావాల్సిన సమాచారం ఇచ్చి వారి ప్రాపకం పొంది. .. ఆ తర్వాత కూడా సీఎస్‌గా కొనసాగారన్న విమర్శలు ఉన్నాయి. మధ్యలో గొడవలు వచ్చి.. అవమానకరంగా బదిలీ అయ్యారు. ఆ తర్వాత విధుల్లో చేరకుండానే.. రిటైర్మెంట్ ఇచ్చేశారు. ఆ తర్వాత ఎక్కడా పెద్దగా కనిపించలేదు. కానీ ఇప్పుడు మాత్రం అప్పట్నుంచి ఆయన గడ్డం పెంచుకుటున్నారని బయటపడింది. ఆయన ఆధ్యాత్మికత వైపు మళ్లారా లేక.. ఏదైనా శపథం పెట్టుకున్నారా అన్నదానిపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మోడీ ఆలోచిస్తారు..కేటీఆర్ పాటిస్తారు..! మరీ ఇంత ఫాస్టా..?

తెలంగాణలో " ఆజాదీ కా అమృత్ మహోత్సవ్" పేరిట వేడుకలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ నెల పన్నెండు నుంచే... ప్రారంభించాలని ఆదేశించారు. ఆగస్టు పదిహేను వరకు సాగుతాయి. ఉత్సవాలకు రూ.25...

వైసీపీపై రిపబ్లిక్ టీవీ ఆర్నాబ్‌కు కోపం ఎందుకు..!?

రిపబ్లిక్ టీవీ అంటే ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఆర్నాబ్ గోస్వామి తన అరుపులతోనే ఓ బ్రాండ్ ను క్రియేట్ చేసుకున్నారు. ఆయన నేతృత్వంలో నడుస్తున్న చానల్‌పై ఉన్న వివాదాలు అన్నీ...

అంతా రాజకీయమే..! స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకునేదెలా..?

స్టీల్ ప్లాంట్‌పై కేంద్రం తేల్చేసింది. రోడ్డెక్కి చేస్తున్న ఆందోళనలను.. అధికార ప్రతిపక్ష లేఖను కేంద్రం పట్టించుకోలేదు. చెత్తబుట్టలో వేసింది. ఎవరేం అనుకున్నా.. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను వంద శాతం అమ్మి తీరుతామని స్పష్టం...

సీబీఐ చేతికి నయీం కేసు..! రాజకీయ ప్రకంపనలు తప్పవా..!?

తెలంగాణలోకి సీబీఐకి ఎంట్రీ నయీం కేసు ద్వారా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. నయీం కేసును సీబీఐకి ఇస్తారా అంటూ.. కేంద్ర హోంశాఖ నుంతి తెలంగాణ సర్కార్‌కు లేఖ వచ్చింది. సాధారణం రాష్ట్ర ప్రభుత్వం...

HOT NEWS

[X] Close
[X] Close