ఆర్మూర్ రివ్యూ: దుబాయ్ జీవన్ రెడ్డి ఎదురీదుతున్నాడా..?

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌ నియోజకవర్గంపై ఇప్పడు అందరి దృష్టి పడింది. మంత్రి కేటీఆర్‌కు అత్యంత సన్నిహితుడయిన తాజామాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి.. రెండో సారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ఆయనపై ఇటీవల నటీమణి శ్రీరెడ్డి చేసిన ఆరోపణలు కలకలం రేపాయి. జీవన్ రెడ్డికి…కాంగ్రెస్ నాయకులు ఆకుల లలిత సవాల్ విసురుతున్నారు ప్రధాన ప్రత్యర్థిగా… విజయం కోసం పోటీ పడుతున్నారు. ఈ నియోజకవర్గంలో అనుచర వర్గం ఉన్న..మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి.. టీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఆయన ఆర్మూర్ నుంచి లేదా బాల్కొండ నుంచి పోటీ చేసి ఉండేవారు. కానీ టీఆర్ఎస్ ప్రభంజనం ఉంటుందనుకున్న ఆయన… తొందరపడి టీఆర్ఎస్‌ లో చేరిపోయారు. ఇప్పుడు మారిపోయిన పరిస్థితులు చూసి.. ఆయన అనుచర వర్గం ఇబ్బంది పడుతోంది.

ఎమ్మెల్యేపై తీవ్ర వ్యతిరేకత ఉందన్న ప్రచారం జరుగుతోంది. జీవన్‌రెడ్డి హైదరాబాద్‌లో ఎక్కువగా ఉంటారు. ఆయన సోదరుడు.. షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తూంటారు. ఆయన ఇసుక దందాల్లో వేలు పెట్టడంతో.. ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి. జీవన్ రెడ్డి వ్యవహారశైలితో చాలా మంది నేతలు ఆయనకు దూరమయ్యారు. దళిత యువకులు తలారిసత్యం, చేపూర్ రవి హత్య కేసుల విషయంలో… జీవన్ రెడ్డిపై అనేక ఆరోపణలు వచ్చాయి. ఆయనపై కేసు నమోదు చేయాలని ప్రజాసంఘాలు హైకోర్టు, సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఈ కేసు కోర్టులో కోనసాగుతుంది. దీంతో దళితులు జీవన్‌రెడ్డికి దూరం ఉన్నారు. గతంలో జీవన్‌రెడ్డి గల్ప్‌లో ఉండేవారు. ఆ సమయంలో అక్కడ బ్యాంకులను మోసం చేసి వచ్చారు. అక్కడి బ్యాంకులు భారతదేశంలోని కేంద్రహోంశాఖకు జీవన్‌రెడ్డిపై లేఖను పంపారు. దీనిని వడ్డీతో సహా చెల్లించి బయటపడినట్లు చెబుతున్నారు. ఇదీ కాక.. ఆర్మూర్ మున్సిపల్ చైర్‌పర్సన్ భర్త..బబ్లూ దొంగ బంగారం కేసులో అరెస్టయ్యారు. ఈయనను.. జీవన్ రెడ్డి వెనకేసుకొచ్చారు. ఇతన్ని పార్టీ నుంచి నిజామాబాద్ ఎం.పి కల్వకుంట్ల కవిత ప్రకటించారు. అయితే.. ఎమ్మెల్యే మాత్రం.. పార్టీలో పెద్ద పీట వేస్తున్నారు.

మున్సిపాల్ వ్యవహారాల్లో బబ్లూ పెత్తనం చెలయిస్తారనే ఆరోపణలు ఉన్నాయి.దీంతో కౌన్సిలర్లు కూడా పార్టీ కార్యక్రమాల్లో అంతమాత్రంగానే ఉంటున్నారు.మండల స్థాయిలో ద్వితీయశ్రేణి నాయకులు పట్టించుకోవడంతో ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. దీంతో జీవన్‌రెడ్డిపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఆర్మూర్‌లో లెదర్‌పార్క్,లక్కంపల్లి సెజ్‌లో పరిశ్రమలు తీసుకురావడంలో జీవన్‌రెడ్డి విఫలం అయ్యారనే అసంతృప్తి ప్రజల్లో ఉంది. గత ఎన్నికల్లో ఉన్న నేతలు ఇప్పుడు ప్రచారంకు అంతంత మాత్రంగానే దూరమవుతున్నారు. గత ఎన్నికల్లో జీవన్‌రెడ్డికి సన్నిహితులు, ఆన్ని తామై వ్యవహరించిన పోద్ధుటూరి వినయ్ కుమా ర్‌రెడ్డి, నిమ్మల జలందర్‌యాదవ్‌లు దూరంగా ఉన్నారు. వినయ్‌కుమార్‌రెడ్డి బీజేపీ ఆభ్యర్థిగా బరిలో నిలువగా, జలంధర్‌యాదవ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్‌పార్టీ ఆభ్యర్థి ఆకుల లలిత నామినేషన్‌కు 40 వేల మంది వరకు పాల్గొనడంతో కార్యకర్తల్లో ,నాయకుల్లో ఉత్సాహం నెలకోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రజల కోసం ప్రభుత్వాన్ని నిలదీస్తానంటున్న ఆనం..!

ప్రజల కోసం ప్రభుత్వాన్ని... అధికారులను నిలదీయడానికి సిద్దమని ప్రకటించారు వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామ నారాయణరెడ్డి. అధికారులను సరే కానీ..ప్రభుత్వాన్ని నిలదీస్తామనే మాటే నెల్లూరు రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతోంది. అంతటితో వదిలి...

సుప్రీంకోర్టులోనూ ఏపీ సర్కార్‌కు మళ్లీ “రంగు పడింది”..!

ప్రభుత్వ కార్యాలయాలపై రంగుల విషయంలో ఎక్కడా లేని పట్టుదలకు పోయిన ఏపీ సర్కార్‌కు.. రెండో సారి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. నాలుగు వారాల్లో ప్రభుత్వ కార్యాలయాలపై రంగులు తొలగించకపోతే.. కోర్టు ధిక్కరణ చర్యలు...

డాక్టర్ సుధాకర్‌పైనా సీబీఐ కేసు..!

నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ కేసు దర్యాప్తులో అనూహ్య మలుపు చోటు చేసుకుంది. సీబీఐ ఆయనపైనా కేసు నమోదు చేసింది. లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించినందుకు, బాధ్యత కలిగిన ఓ ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి ప్రభుత్వ...

మ‌రో బ‌యోపిక్ మిస్ చేసుకున్న నిత్య‌మీన‌న్‌

ఒక‌ప్పుడు తెలుగు నాట నిత్య‌మీన‌న్ హ‌వా బాగా న‌డిచింది. కాస్త ప్ర‌త్యేక‌మైన క‌థానాయిక పాత్ర‌లు ఆమె చుట్టూ చేరిపోయాయి. గ్లామ‌ర్ మాటెలా ఉన్నా, స‌ర‌దా న‌ట‌న‌తో ఆక‌ట్టుకునేది. అయితే ఇప్పుడు త‌న‌ని అంతా...

HOT NEWS

[X] Close
[X] Close