ప్రొ.నాగేశ్వర్ : చిరంజీవి వైఫల్యం పవన్ పై ఉంటుందా..?

మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పటి నుంచి ఎక్కడ ఎన్నికలు జరిగినా.. చిరంజీవి పేరు ప్రచారంలోకి వస్తుంది. అయితే.. 2014 ఎన్నికల తర్వాత క్రమంగా రాజకీయాలకు దూరమయ్యారు. ఇప్పుడు పూర్తిగా… సినిమాలకు అంకితమయ్యారు. అయినా సరే.. రెండు తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి ఉన్న స్టార్ క్యాంపెయినర్లలో ఆయన ఒకరు. కర్ణాటక ఎన్నికల్లో కూడా.. కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయిన్ల జాబితాలో… చిరంజీవి పేరు పెడుతోంది.

71 లక్షల మంది నమ్మకాన్ని సహాయమంత్రి పదవి కోసం అమ్మేశారా..?

తెలంగాణలో చిరంజీవికి గొప్పగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తెలంగాణ ఎన్నికల్లో చిరంజీవి, విజయశాంతి.. స్టార్ క్యాంపెయినర్లుగా ఉంటారని కాంగ్రెస్ పార్టీ ఆశ పడుతోంది. కానీ విజయశాంతి, బాలకృష్ణ.. ప్రచారబరిలో ఉంటారు కానీ.. చిరంజీవి కనిపించడం లేదు. ఆయన సినిమా షూటింగ్‌లో ఉన్నారు. ప్రజారాజ్యం పార్టీ.. ఓ విఫల ప్రయోగం. ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి, టీడీపీకి భిన్నంగా… మూడో శక్తిగా ప్రజారాజ్యం రాజకీయ పయనం ప్రారంభించడాన్ని… ప్రజాస్వామ్యవాదులందరూ ఆహ్వానించారు. ఎందుకంటే.. రాజకీయాలు ఎప్పుడూ కూడా… రెండు పార్టీల మధ్య కాకుండా… ప్రత్యామ్నాయం గా చిరంజీవి వచ్చినప్పుడు.. ప్రజలకు ఓ చాయిస్ కనిపించినట్లయింది. అందుకే… 71 లక్షల మంది ప్రజలు ఓట్లేశారు. పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు గెలిచారు. అంటే.. 2009లో వైఎస్ ప్రభుత్వంపై తీవ్రమైన వ్యతిరేకత లేదు… టీడీపీ బలమైన ప్రతిపక్షంగా ఉంది.. . రాజకీయ శూన్యత లేదు.. అయినప్పటికీ.. ప్రజారాజ్యం పార్టీకి 71 లక్షల ఓట్లు వచ్చాయి. అయినప్పటికీ.. చిరంజీవి వారినందర్నీ వదిలేసి..కేవలం తన మంత్రి పదవి కోసం.. పార్టీని నడపలేక.. కాంగ్రెస్ పార్టీలో కలిపేశారు.

పార్జీకి నడపలేకపోతే పవన్‌కి అయినా ఇచ్చి ఉండాల్సింది కదా..?

చిరంజీవి పార్టీని నడపలేకపోతే… తమ్ముడు పవన్ కల్యణ్‌కి అప్పజెప్పాల్సింది. ప్రజారాజ్యాం తీసుకోవాలనుకుంటే… పవన్ కల్యాణ్ ఉత్సాహంగా నడుపుకునేవారు. కానీ చిరంజీవి.. తీసుకెళ్లి .. కాంగ్రెస్ పార్టీలో కలిపారు. ఎందుకు కలిపారంటే.. ఓ పెద్ద లిస్ట్ చిరంజీవి చదివారు.. మహిళా రిజర్వేషన్ల కోసం.. సచార్ కమిటీ నివేదికలు అమలు కోసం.. అంటూ చిరంజీవి చాలా చెప్పారు. కానీ.. ఒక్కటి కూడా అమలు కాలేదు. అందులోనూ… చిరంజీవి కేబినెట్ మంత్రి అయ్యారా.. అంటే అదీ లేదు. మామూలు సహాయమంత్రి పదవి అయ్యారు. చిరంజీవి లాంటి స్థాయి కలిగిన నేతకు..సహాయ మంత్రి పదవా..? ఇది కచ్చితంగా జనసేనకు ఇబ్బందికరమే. ఎందుకంటే… పవన్ కల్యాణ్ తప్పు కూడా ఉంది.

పీఆర్పీకి వచ్చినంత ఆదరణ జనసేనకు రాకపోవడానికి అదేనా కారణం..?

ఇప్పటి వరకు పవన్ కు ఉన్న అడ్వాంటేజ్ ఏమిటంటే.. ప్రజారాజ్యం పట్ల ప్రజల్లో తీవ్రంగా వ్యతిరేకంగా ఉంది. పవన్ కల్యాణ్ పై లేదు. ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటులో పవన్ ఉన్నారు. ప్రచారం కూడా చేశారు. కానీ ప్రజారాజ్యం విలీన ప్రక్రియలో మాత్రం లేరు. ఇది పవన్ కల్యాణ్ విశ్వసనీయతను పెంచింది. జనసేనకు ఇబ్బంది లేకుండా చేసింది. ఇప్పటికి కూడా ప్రజారాజ్యం వైఫల్యం పవన్ కల్యాణ్ ను వెంటాడుతూనే ఉంటుంది. ఈ విషయాన్ని చాలా సార్లు పవన్ కల్యాణ్ కూడా చెప్పారు. ప్రజారాజ్యం వైఫల్యం వల్ల ప్రజలు తనపై కూడా అనుమానంతో చూస్తున్నారని.. అందుకే నేను తొందరపడనని.. చెప్పుకొచ్చారు. అంటే.. జనసేన వెనుక ఆ ప్రజారాజ్యం వైఫల్యం నీడలా ఉందన్నమాట. అందుకే.. గతంలో ప్రజారాజ్యంకు వచ్చినంత ఆదరణ ఇప్పుడు ఉండటం లేదు. ఏ సర్వేలో చూసినా… గతంలో ప్రజారాజ్యానికి వచ్చినంత ఫోర్స్ కనబడటం లేదు. చాలా పరిమితంగా ఆదరణ ఉంది. దీనికి కారణం.. ప్రజారాజ్యం భయాలు ప్రజలను వెంబడించడమే.

పీఆర్పీ వైఫల్యాన్ని తప్పించుకోవడం పవన్‌కు పెద్ద సవాల్..!

ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చిరంజీవి ఉన్నారో లేరో తెలియని పరిస్థితి. చిరంజీవి అలా చేశారు కాబట్టి.. పవన్ కల్యాణ్ అలా చేస్తారని చెప్పలేదం. ఎన్టీఆర్ నటుడే. ఇప్పటికీ.. ఎన్టీఆర్ రాజకీయాల్లో ఓ బెంచ్ మార్క్‌లో ఉన్నారు. కమలహాసన్ నటుడే.. ఓ స్పష్టమైన విధానంతో ముందుకు వెళ్తున్నారు. రజనీకాంత్ కన్నా తక్కువే పాపులారిటీ ఉన్నప్పటికీ… రాజకీయాల్లో తనదైన ముద్ర వేస్తున్నారు. కానీ.. రజనీకాంత్… ఏం చేస్తున్నారో తెలియడం లేదు. నటులు కూడా మనుషులే . నటులందరూ.. జెండా ఎత్తేస్తారని చెప్పలేం. చిరంజీవి జెండా ఎత్తేశాడని.. పవన్ కల్యాణ్ అలా చేస్తాడని చెప్పలేం. ప్రజారాజ్యంలా వేస్తాడని చెప్పలేం. అయితే.. కచ్చితంగా ప్రజారాజ్యం వైఫల్యం పవన్ కల్యాణ్‌ను వెంటాడుతుంది. దానిని అధిగమించాల్సిన బాధ్యత పవన్ కల్యాణ్‌కు ఉంటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.