నారా లోకేష్ పాదయాత్రలో ఇచ్చిన హామీల ప్రోగ్రెస్ ను ఎప్పటికప్పుడు సరి చూసుకుంటూ అమలు కాని హామీలను అమలు చేస్తూ వెళ్తున్నారు. కర్నూలు జిల్లాలోని అశోక్‌నగర్‌లోని నగరపాలక సంస్థ పంప్‌హౌస్ ప్రాంతంలో గత నాలుగు దశాబ్దాలుగా నివాసం ఉంటున్న 150 మంది గూడెంకొట్టాల వాసులకు శాశ్వత ఇంటి పట్టాలు ఇప్పిస్తామని పాదయాత్రలో నారా లోకష్ హామీ ఇచ్చారు.
ఈ ప్రాంతంలో నిరుపేదలైన ఈ వాసులు పూరిగుడిసెల్లో జీవనం సాగిస్తున్నారు. శాశ్వత ఇంటి పట్టాల కోసం ఎన్నో సంవత్సరాలుగా ప్రజాప్రతినిధులను కోరుతున్నప్పటికీ, వారి అభ్యర్థనలు ఫలించలేదు. యువగళం పాదయాత్ర సందర్భంగా నారా లోకేశ్ కు వచ్చిన సమయంలో అక్కడి ప్రజలు టీజీ భరత్ నేతృత్వంలో లోకేష్‌ను కలిసి, శాశ్వత ఇంటి పట్టాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. వారి అభ్యర్థనకు స్పందించిన లోకేశ్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నెరవేరుస్తామని హామీ ఇచ్చారు.
ఇప్పుడు కూటమి ప్రభుత్వం 2025 జనవరిలో జీవో నెం.30 ద్వారా కోట్ల విలువైన ఒక ఎకరం స్థలాన్ని నిరుపేదలకు కేటాయించింది. మంత్రి టీజీ భరత్ చేతుల మీదుగా 150 మంది నిరుపేదలకు శాశ్వత ఇంటి పట్టాలు పంపిణీ చేశారు. అధికారం అందిన తర్వాత మర్చిపోకుండా.. నారా లోకేష్ హామీని నెరవేర్చడం అందర్నీ సంతృప్తి పరిచింది.