“అక్కడ ఉంది చంద్రబాబునాయుడు కాదు.. లోకేష్”.. ఈ మాట ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అంతర్గత చర్చల్లోనూ తరచుగా వినిపిస్తున్న డైలాగ్ ఇది. ఈ మాట ఎందుకంటే చంద్రబాబు రాజకీయ కుట్రల్ని కూడా సాఫ్ట్ గా ఎదుర్కోవాలనుకుంటారు కానీ..లోకేష్ అలా కాదు.. ముల్లును ముల్లుతోనే తీస్తారు. ఆ విషయం వారికి మొదటి ఆరు నెలలలోనే అర్థమైపోయింది. ఇప్పుడు నేరుగా ఆ ముల్లును దింపుతున్న వైనం అర్థం చేసుకుని అల్లాడిపోతున్నారు. నారా లోకేష్ ను బెదిరించడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ అన్నింటినీ చూసే నారా లోకేష్ ఇక్కడి వరకు వచ్చారు.
లోకేష్ భయంతోనే అంతా సైలెంట్
వైఎస్ఆర్సీపీ ఉనికి ఇప్పుడు ఉందా లేదా అన్నది చాలా మంది డౌట్. తెర ముందు మాట్లాడేందుకు కనిపిస్తున్నది ఇద్దరంటే ఇద్దరు ఒకరు పేర్ని నాని.. మరొకరు అంబటి రాంబాబు. వీరిద్దరూ ఎంత మాట్లాడితే అంత మైనస్ టీడీపీకి. మిగిలిన ఎవరూ మాట్లాడటం లేదు. బొత్స సత్యనారాయణ అవసరం అయితే ఓ ప్రెస్మీట్ అలా పెట్టేసి.. ఇలా మాయమవుతారు. ఇక ఏ ఒక్క సీనియర్ నేత కూడా మాట్లాడటం లేదు. అంతా ఎక్కడికిపోయారని ఆశ్చర్యపోతున్నారు. చివరికి సజ్జల రామకృష్ణారెడ్డి కూడా మాట్లాడటం లేదు. వీళ్లందరికీ ఓ క్లారిటీ ఉంది. ఆ క్లారిటీనే నారా లోకేష్.
పులివెందుల దెబ్బ మాస్టర్ ప్లానర్
పులివెందుల జడ్పీటీసీ ఎన్నికలను వాయిదా వేయించాలని నీలం సహానిపై వైసీపీ తీవ్ర ఒత్తిడి తెచ్చింది. మరో పది నెలల కాలానికి ఎన్నిక ఎందుకని .. గతంలో నిమ్మగడ్డ ఏడాదిన్నర వాయిదా వేశారని ఒత్తిడి చేశారు. కానీ వారి ప్రయత్నాలు ఫలించలేదు. నిజానికి ఇప్పుడెందుకు ఈ ఎన్నికలు అని కడప టీడీపీ నేతలు కూడా అనుకున్నారు. కానీ లోకేష్ రాజకీయం అర్థమయ్యాక.. అడుగు ముందుకేశారు. ఇవాళ కడప టీడీపీ నేతలు .. గతంలో ఎప్పుడూ సాధించనంత సంతృప్తికర విజయాలను నమోదు చేశారు. ఇంత కాలం తాము పడిన బాధలకు తగ్గ విజయానందాన్ని చూస్తున్నారు.
డిఫెన్సివ్ రాజకీయాలు కాదు.. హిట్టింగే !
నారా లోకేష్.. డిఫెన్సివ్ రాజకీయాలు చేయడం లేదు. ఆయనది ఎప్పుడూ ఎదురుదాడే. ఆయనచాలా సాఫ్ట్ అనుకుని కొంత మంది అనుకున్నారు. కించ పరిస్తే బాధపడి వెనక్కి పోతాడని అనుకున్నారు. కానీ ఆయనను అలా చేసి చేసి.. చివరికి కాలకేయుల పట్ల ఎలా వ్యవహరించాలో అర్థం చేసుకున్నారు. దానికి తగ్గట్లుగానే రాజకీయాలు చేస్తున్నారు. వైసీపీకి వణుకుపుట్టిస్తున్నారు. వైసీపీ వాళ్లు ఎప్పటికప్పుడు ఇపుడు.. లోకేష్ అక్కడ.. జాగ్రత్తగా ఉండాలనుకునేలా నిరంతరం గుర్తు చేసుకునేలా చేశారు.