బంధువులకు పందేరం..! “ఐటీ గ్రిడ్” లోకేశ్వర్ రెడ్డికీ ఓ సలహాదారు పదవి..!

ఎన్నికలకు ముందు ఐటీ గ్రిడ్ పేరుతో… టీడీపీ యాప్, వెబ్ సైట్‌ను టార్గెట్ చేసి.. ప్రజల వ్యక్తిగత సమాచారం… చోరీ చేశారంటూ… హడావుడి చేసిన కేసుల్లో.. తెర ముందు వైసీపీ పెట్టిన వ్యక్తి పేరు తుమ్మల లోకేశ్వర్ రెడ్డి. ఐటీ నిపుణుడిగా.. వైసీపీ ప్రచారం చేసుకుని.. విజిల్ బ్లోయర్ గా… కేటీఆర్ సర్టిఫికెట్ ఇచ్చిన ఆ వ్యక్తికి.. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం కీలక పదవి దక్కింది. నేరుగా ముఖ్యమంత్రికి సలహాదారుగా నియమితులయ్యారు. సలహాదారులందరికీ.. నెలకు రూ. 3లక్షలకుపైగా జీతభత్యాలు ఉన్నందున ఈయనకు కూడా.. అలాగే… ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. అదనంగా సిబ్బంది, కార్లు, క్వార్టర్లు, పింగాళి గ్లాసులు ఇతర వస్తువులు కొనుగోలుకు… నిధులు ఇస్తారు.

నిజానికి ఐటీ గ్రిడ్ అనే కంపెనీని టార్గెట్ చేయడానికి కర్త, కర్మ, క్రియ విజయసాయిరెడ్డి. ఆయన తన స్కెచ్‌ను.. ఈసీ వద్ద పొరపాటున.. రిజిస్టర్ చేసి.. దొరికిపోయారు. విజయసాయి రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు జనవరి 23వ తేదీన ఐటీ గ్రిడ్ సంస్థలో సోదాలు చేశారు. కానీ కేసు అధికారికంగా నమోదు చేయలేదు. తర్వాత అసలు విషయం బయటపడటంతో.. వైసీపీ నేత లోకేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదు చేశారంటూ.. హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. లోకేశ్వర్ రెడ్డి.. జగన్మోహన్ రెడ్డి సమీప బంధువు. ఆయన ఏ ఐటీ కంపెనీల్లో పని చేశారో ఎవరికీ తెలియదు కానీ.. డేటా నిపుణుడిగా చెప్పుకుని… ఆయన ఫిర్యాదుపై కేసులు పెట్టారు. దాని కేంద్రంగా టీడీపీపై బురద చల్లారు. ఇప్పుడు.. వైసీపీ అధికారంలోకి వచ్చినా.. ఆ కేసులో కదలిక లేదు.

ఈ తుమ్మల లోకేశ్వర్ రెడ్డికి ఇప్పుడు.. ఉద్యోగం కల్పించారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పటికే వివిధ రంగాల్లో సలహాదారుల పేరుతో పదుల సంఖ్యలో … నియామకాలు జరిపిన సర్కార్.. కొత్తగా… టెక్నికల్ సలహాదారుగా.. లోకేశ్వర్ రెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జగన్మోహన్ రెడ్డి సలహాదారులందరూ.. అయితే… బంధువులు.. లేకపోతే సాక్షి ఉద్యోగులు. లోకేశ్వర్ రెడ్డి నియామకంతో.. మరోసారి ఆ విషయం స్పష్టమయిందనే విమర్శలు వస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

హిందూ ధర్మ పరిరక్షణే తిరుపతిలో టీడీపీ అస్త్రం..!

తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికలో తెలుగుదేశం పార్టీ ప్రచార వ్యూహాన్ని ఖరారు చేసుకుంది. ఎప్పటిలా అభివృద్ధి చేస్తామనో.. మరొకటో చెప్పడం లేదు. ట్రెండ్‌కు తగ్గట్లుగా.. హిందూత్వాన్ని.. హిందూ ధర్మాన్నే హైలెట్ చేసుకోవాలని నిర్ణయించింది. అందుకే.....

కేక్ క‌ట్ చేసి హ‌ర్ట్ చేసిన విజ‌య్ సేతుప‌తి

ఈరోజు విజ‌య్ సేతుప‌తి బ‌ర్త్ డే. త‌మిళంలో త‌నో పెద్ద స్టార్‌. తెలుగులోనూ అభిమానుల్ని ఏర్ప‌ర‌చుకుంటున్నాడు. అయితే.. త‌న పుట్టిన రోజున అనుకోని వివాదంలో ప‌డ్డాడు విజ‌య్ సేతుప‌తి. ఆ త‌ర‌వాత‌.. త‌న...

“డీపీఆర్‌”ల కోసం సీఎంల వెంట పడుతున్న షెకావత్..!

పిట్టపోరు పిల్లి తీర్చిందంటున్నట్లుగా అయింది తెలుగు రాష్ట్రాల మధ్య జల పంచాయతీ. ఎలాంటి లొల్లి లేకుండా ఎవరి ప్రాజెక్టులు వారు కట్టుకుంటే.. కేంద్రానికి ఫిర్యాదు చేసేవాళ్లు ఉండేవారు కాదు. కానీ రాజకీయం కోసం.....

వ్యాక్సిన్‌పై నెగెటివ్‌ ప్రచారం కట్టడి ఎలా..?!

కరోనా వ్యాక్సిన్ కోసం ప్రజలు అంత ఆతృతగా ఎదురు చూడటం లేదు. అదేదో కరోనా నుంచి కాపాడే వజ్రాయుధం అని ప్రజలు అనుకోవడం లేదు . దాని వల్ల కొత్త సమస్యలు వచ్చి...

HOT NEWS

[X] Close
[X] Close