విజ‌య్ దేవ‌ర‌కొండ `వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్‌`

విజ‌య్ దేవ‌ర‌కొండ – క్రాంతి మాధ‌వ్ కాంబినేష‌న్‌లో ఓ సినిమా తెర‌కెక్కుతోంది. కె.ఎస్‌.రామారావు నిర్మాత‌. ఈ చిత్రానికి వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్ అనే పేరు ఖ‌రారు చేశారు. ఇదో రొమాంటిక్ ల‌వ్ స్టోరీ. న‌లుగురు క‌థానాయిక‌లు ఉన్నారు. వాళ్లంద‌రితోనూ హీరోకి ల‌వ్ ట్రాక్స్ ఉంటాయి. అంద‌రి ద‌గ్గ‌రా అత్య‌త్త‌మ ప్రేమికుడిగానే ఉంటాడు. మ‌రి చివ‌రికి ఎవ‌రి ప్రేమ‌ని గెలుచుకుంటాడ‌న్న‌ది ఆస‌క్తిక‌రం. ఓ ఉత్త‌మ ప్రేమికుడి క‌థ ఇది. అందుకే ఈ టైటిల్ పెట్టారు. క్రాంతి మాధ‌వ్ సినిమాల‌న్నీ ఎమోష‌న‌ల్ కంటెంట్‌తో సాగుతాయి. విజ‌య్ దేవ‌రకొండ అంటేయూత్‌కి ఐకాన్‌లా మారాడు. మ‌రి వీరిద్ద‌రిలో ఎవ‌రు ఎవ‌రి స్టైల్‌కి మౌల్డ్ అయ్యారో చూడాలి. ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో చిత్రీకర‌ణ జ‌రుగుతోంది. ఈయేడాది చివ‌ర్లో ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తారు. రాశీఖ‌న్నా ఓ క‌థానాయిక‌గా న‌టిస్తోంది. ఈనెల 20న ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేయ‌నున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘గైడ్‌లైన్స్’ రూపొందించుకున్న టాలీవుడ్

చిత్ర‌సీమ యావ‌త్తూ 'క్లాప్' కొట్టే ముహూర్తం కోసం ఎదురు చూస్తోంది. మ‌ళ్లీ సెట్లు క‌ళ‌క‌ళ‌లాడే రోజు కోసం క‌ల‌లు కంటోంది. జూన్‌లో చిత్రీక‌ర‌ణ‌లు మొద‌ల‌వుతాయి. అయితే.. కేంద్ర ప్ర‌భుత్వం ఇచ్చే గైడ్ లైన్స్‌కి...

త్రివిక్ర‌మ్‌కి రీమేకులు వ‌ర్క‌వుట్ అవుతాయా?

స్వ‌త‌హాగా ర‌చ‌యిత‌లైన ద‌ర్శ‌కులు రీమేక్‌ల‌ను అంత‌గా ప్రోత్స‌హించ‌రు. కార‌ణం.. వాళ్ల ద‌గ్గ‌రే బోలెడ‌న్ని క‌థ‌లుంటాయి. త్రివిక్ర‌మ్ ఇప్ప‌టి వ‌ర‌కూ రీమేక్ జోలికి వెళ్ల‌లేదు. హాలీవుడ్ క‌థ‌ల్ని, న‌వ‌ల‌ల్ని, పాత సినిమాల్నీ స్ఫూర్తిగా తీసుకుని...

కరోనా టెస్టుల లెక్కలు తేల్చాల్సిందేనన్న తెలంగాణ హైకోర్టు ..!

కరోనా వైరస్ టెస్టులు పెద్దగా చేయకపోవడం.. తెలంగాణ సర్కార్ ను ఇబ్బందుల్లోకి నెడుతోంది. టెస్టుల విషయంలో దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు.. మరోసారి అసంతృప్తి వ్యక్తం చేసింది. కొద్ది రోజుల కిందట..కరోనా...

రోజాకు సొంత పార్టీలోనే ప్రత్యర్థులు ఎక్కువ.. ఈ సారి డిప్యూటీ సీఎం..!

నగరి ఎమ్మెల్యే రోజాకు సొంత పార్టీలోనే ప్రత్యర్థులు ఎక్కువైపోతున్నారు. తాజాగా డిప్యూటీ సీఎం నారాయణస్వామిపై రోజా ఫైరయ్యారు. నారాయణస్వామి పుత్తూరులో పర్యటించారు. కానీ రోజాకు సమాచారం అందలేదు. పుత్తూరు .. ఆమె ఎమ్మెల్యేగా...

HOT NEWS

[X] Close
[X] Close