పవన్, లోకేష్ కన్నా… వారి లోక్‌సభ అభ్యర్థులే మిన్న..!

సార్వత్రిక ఎన్నికల్లో బాగంగా ఏపీలో జరిగిన జమిలీ ఎన్నికల్లో బయటపడుతున్న విచిత్రాలు అన్నీ ఇన్నీ కావు. మామూలుగా… ఒక్క ఎమ్మెల్యే లేదా ఎంపీ ఎన్నికలు జరిగితే… సమస్య రాదు. కానీ.. ఏపీలో మాత్రం.. రెండూ ఒక్కసారే వచ్చాయి. ఎమ్మెల్యే అభ్యర్థికి ఓటేసిన వాళ్లు.. అదే పార్టీకి చెందిన ఎంపీ అభ్యర్థికి ఓటేయాలని లేదు. అంత వరకు ఓకే కానీ.. అసలు పేరు గొప్ప లీడర్లుగా ప్రచారం పొందిన వారి.. డొల్లతనం..ఓట్లలో బయటపడింది.

జనసేన అధినేత కన్నా… వీవీ లక్ష్మినారాయణనే పాపులర్..!

జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఈ ఎన్నికలపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అసెంబ్లీలో అడుగు పెట్టడానికి సన్నాహాలు చేసుకున్నారు. రెండు చోట్ల నుంచి పోటీ చేశారు. అందులో గాజువాక ఒకటి. భీమవరం సంగతేమో కానీ… గాజువాకలో మాత్రం.. పవన్ కల్యాణ్ గెలుస్తాడని.. అందరూ అనుకున్నారు. పవన్ కల్యాణ్ గాజువాకలో పోటీ చేయడం వల్ల… సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మినారాయణకు..ఎంతో ప్లస్ అవుతుందని.. ఆయనకు.. గాజువాకలో రికార్డు స్థాయి మెజార్టీ వచ్చి..  ఎంపీగా గెలుస్తారని.. విశ్లేషించారు. కానీ వాస్తవం మాత్రం వేరేగా ఉంది. పవన్ కల్యాణ్..ను మించి… వీవీ లక్ష్మినారాయణ గాజువాకలో పలుకుబడి సాధించారు. ఎంతగా అంటే.. ఇద్దరి మధ్య 14.6 శాతం ఓట్ల తేడా ఉంది. అంటే.. పవన్ కన్నా.. వీవీ లక్ష్మినారాయణకు.. 14.6 శాతం ఓట్లు వచ్చాయి. గాజువాక అసెంబ్లీ సెగ్మెంట్‌లో పవన్‌కు 58,539 ఓట్లు రాగా.. వీవీ లక్ష్మినారాయణకు 68, 567 ఓట్లు వచ్చాయి. అంటే.. వీవీ లక్ష్మినారాయణ కోసం.. జనసేనకు ఓట్లు వేసిన వారందరూ… పవన్ కల్యాణ్‌కు వేయలేదు.

మంగళగిరిలో లోకేష్‌ పరిస్థితీ అదే..!

ఇక ముఖ్యమంత్రి తనయుడిగా రాజకీయ ఆరంగేట్రం చేసిన.. నారా లోకేష్ పోటీ చేసిన మంగళగిరి నియోజకవర్గంలోనూ అదే పరిస్థితి. మంగళగిరి.. గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది. అక్కడ ఎంపీ అభ్యర్థిగా గల్లా జయదేవ్ ఉన్నారు. లోకేష్ మంగళగిరిలో పోటీ చేయడం వల్ల.. తనకు ఎంతో ప్లస్ అవుతుందని.. ఆయన చాలా సార్లు ప్రచారసభల్లో చెప్పారు. కానీ… ఎంతో కొంత గల్లా జయదేవ్ వల్లనే.. నారా లోకేష్‌కు కాస్త పరువు నిలబడిందని… వచ్చిన ఓట్ల ద్వారా తేలిపోతోంది. మంగళగిరిలో.. నారా లోకేష్‌కు… లక్షా మూడు వేల పైచిలుకు ఓట్లు వచ్చాయి. అయినప్పటికీ.. ఆయన నాలుగు వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. కానీ… గల్లా జయదేవ్‌కు… మంగళగిరి నియోజకవర్గంలో.. వచ్చిన ఓట్లు… లక్షా పదివేలకుపైగానే. దాదాపుగా 7,100 ఓట్లు గల్లా జయదేవ్‌కు ఎక్కువగా వచ్చాయి. అంటే.. గల్లాకు ఓటేసినవారంతా… లోకేష్‌కు ఓటేసి ఉంటే.. కచ్చితంగా గెలిచి ఉండేవారు. కానీ.. అలా చేయలేదు. వాళ్లు వేరే ప్రత్యామ్నాయం చూసుకున్నారు. ఫలితంగా లోకేష్‌ పరువు పోగొట్టుకోవాల్సి వచ్చింది.

వారసత్వం కాదు.. నాయకత్వమే చూస్తున్నారు..!

పవన్ కల్యాణ్, లోకేష్‌లకు… ఎన్నికల బరిలో జరిగిన అవమానం చూస్తే.. ప్రజలు.. తమ ప్రతినిధులుగా ఎవర్ని ఎన్నుకోవాలన్న విషయంలో పూర్తి క్లారిటీతో ఉన్నారని అర్థం చేసుకోవచ్చు.  వీవీ లక్ష్మినారాయణ.. నిజాయితీపరుడైన అధికారిగా… ప్రజల్లో గుర్తింపు పొందారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజం. ఆయన నిజాయతీ పరుడైన అధికారి కాబట్టి..అందరూ ఓటేయాలని లేదు. ఎవరి ఓటింగ్ ప్రయారిటీలు వారికి ఉంటాయి. అయితే.. ఎక్కువ మంది ప్రజలు.. నాయకుడ్ని చూస్తారని.. ఓటింగ్ ద్వారా స్పష్టమయింది. జనసేన తరపున బరిలో నిలబడిన పవన్ కల్యాణ్… కన్నా… మాజీ జేడీకి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారని ఓటింగ్‌తో తేలింది. అదే సమయంలో.. మిస్టర్ ప్రెసిడెంట్ అంటూ.. పార్లమెంట్‌లో గళమెత్తిన గల్లాకు.. లోకేష్‌ కన్నా ఎక్కువ నాయకత్వ సామర్థ్యం ఉందని నమ్మారు కాబట్టే… మెజార్టీ కట్టబెట్టారు. ఈ విషయంలో… ఆ నేతలు ఆత్మ పరిశీలన చేసుకోవాలేమో..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close