బాహుబలి-2లోనూ శృంగారం

శృంగార ప్రియులకు శుభవార్త. వచ్చే ఏడాది రిలిజీ కాబోతున్న బాహుబలి ఆఖరి భాగంలో కూడా సుతిమెత్తనైన శృంగార సన్నివేశాలుంటాయని తెలిసింది. బాహుబలి పార్ట్ 1లో చక్కటి కథాగమనం మధ్యలో ఓ అందమైన శృంగార సన్నివేశాన్ని అజంతా శిల్పంలా మలిచారు దర్శకుడు రాజమౌళి. ఎత్తైన పర్వతాలనీ, మహావేగంతో జారిపడుతున్న జలపాతాలను లెక్కచేయకుండా తన ఊహాసుందరి కోసం శివుడు (ప్రభాస్) కొండల ఆవల ఉన్న అందాల లోకంలోకి అడుగుపెడతాడు. అక్కడ అతనికి అవంతిక (తమన్నా) కనిపిస్తుంది. ఆమెలోని వీర,రౌద్ర రసాలను తగ్గించి శృంగార భావోద్దీపనచేస్తాడు హీరో. సంపూర్ణంగా మనసు, తనువు అర్పిస్తుంది అవంతిక. ఈ సన్నివేశాలు శృంగార ప్రియులు హృదయాలను కట్టిపడేసింది. అయితే కొంతమంది మహిళావాదులు మాత్రం స్త్రీ స్వేచ్ఛను హరించేలా ఈ సన్నివేశాలను చిత్రీకరించారనీ, అవంతిక ప్రేమలో పడకముందే శివుడు ఆమెధరించిన పై వస్త్రాలు (సైనిక దుస్తులు) ఒలిచివేస్తాడనీ, ఇది స్త్రీ వ్యక్తిత్వాన్నీ, స్వేచ్ఛను హరించినట్లే అవుతుందనీ, మరో రకంగా చెప్పాలంటే, శివుడు అవంతిక ఇష్టానికి వ్యతిరేకంగా ప్రవర్తించాడని, ఇది రేప్ చేయడమేనంటూ స్త్రీవాదులు మండిపడ్డారు. ఇలాంటి సన్నివేశాల్లో నటించిన తమన్నాను సైతం తప్పుపట్టారు.

గత కొంతకాలంగా ఈ తరహా విమర్శలను గమనిస్తున్న తమన్నా సమాధానం ఇస్తూ – `ఎవరి అభిప్రాయం వారికుంటుంది. అలాగే క్రిటిక్స్ వారి అభిప్రాయం వారు చెప్పారు. అయితే చివరకు ఒక్కటే తెలుసుకోవాల్సింది, సినిమాలున్నవి వినోదం పంచిపెట్టడానికే… బాహుబలిలో మహిళను మహోన్నతంగా చూపించే ప్రయత్నం జరిగింది. అమ్మాయి అందాన్ని ద్విగిణీకృతం చేశారు. కేవలం వినోదం కోసం చూసే సినిమాలో సన్నివేశాలపై మరీ అంతలోతుగా విశ్లేషణ చేసుకుంటూ పోకూడదు’

అవంతిక పాత్ర శృంగార సన్నివేశాలపై వచ్చిన కామెంట్స్ కు తమన్నా ఈ విధంగా సున్నితంగా సమాధానమిచ్చింది. అలాగే బాహుబలి చిత్రంలోని కట్టప్ప పాత్రపై కూడా అనుకోని విమర్శలు తలెత్తాయి. కట్టప్ప పాత్రద్వారా పలికించిన కొన్ని డైలాగ్ లు దళిత వర్గాలను కించపరిచేవిగా ఉన్నాయంటూ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ లో నిరసన వ్యక్తమైంది.

ఇదంతా ఇలా ఉంటే, మరో పక్క బాహుబలి పార్ట్ 2 నిర్మాణ కార్యక్రమాలు శరవేగంగా సాగిపోతున్నాయి. పార్ట్ 2లో తమన్నా పాత్ర చాలా స్వల్పంగానే ఉంటుందని అంటున్నారు. ఈ కంక్లూజన్ పార్ట్ లో అనుష్క (దేవసేన) పాత్ర చాలా లెంగ్తీగా ఉంటుంది. సరస, సున్నిత శృంగారానికి దర్శకుడు రాజమౌళి ప్రత్యేకమైన పీఠం వేస్తారన్నది సినీప్రేక్షకులకు తెలిసిందే. ఇదే ఫార్ములాలో బాహుబలి పార్ట్ 2లో అనుష్క అందాలు ఆరబోస్తుంది. బాహుబలి (ప్రభాస్)తో దేవసేన (అనుష్క) ప్రేమ సన్నివేశాలు కూడా బాగా పండించే ప్రయత్నం జరిగిందనే అంటున్నారు. బాహుబలి – దేవసేన శృంగార సన్నివేశాలు కూడా శివుడు – అవంతిక ప్రేమసన్నివేశాలకు ఏమాత్రం తగ్గకుండా తీసినట్లు సినీవర్గాల నుండి అందిన సమాచారం. మరి ఈ సన్నివేశాలు వివాదరహితంగా ఉంటాయా ? లేక మరోసారి దుమారం రేపుతాయా? అన్నది వేచిచూడాలి.

– కణ్వస

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అక్టోబ‌ర్ 2: డ‌బుల్ బొనాంజా

ఒకేరోజు రెండు సినిమాలు వ‌స్తే ఆ సంద‌డే వేరుగా ఉంటుంది. థియేట‌ర్లు మూత‌బ‌డిన వేళ‌.. ఒక సినిమా విడుద‌ల కావ‌డ‌మే అద్భుతం అన్న‌ట్టు త‌యారైంది. అయితే ఈసారి ఓకేరోజు రెండు సినిమాలు ఓటీటీ...

ఈపీఎస్, ఓపీఎస్ మధ్యలో శశికళ..!

ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ తమిళనాడు రాజకీయం జోరందుకుంటోంది. ముఖ్యంగా నాయకత్వ సమస్యతో ఉన్న అధికార పార్టీ అన్నాడీఎంకే ఇది మరీ ఎక్కువగాఉంది. ముఖ్యమంత్రి ఈ.పళనిస్వామి.. ఉపముఖ్యమంమత్రి ఈ.పన్నీర్ సెల్వం మధ్య...

అమరావతికి ముంపు లేదని మరోసారి సర్టిఫికెట్ వచ్చేసిందా..!?

రాజధాని అమరావతి ముంపు ప్రాంతంలో ఉందని గతంలో హరిత ట్రిబ్యునల్ లో కేసులు వేశారు. దీంతో ముంపు నివారించే పధకం రూపొందించాకే రాజధాని నిర్మాణం పై ముందుకు వెళ్లాలని హరిత ట్రిబ్యునల్ ఆదేశించింది....

ఐపీఎల్ స్టోరీస్‌: విరాట్ కి ఏమైంది?

విరాట్ కోహ్లీ.. ప్ర‌పంచంలోనే నెంబ‌ర్ వ‌న్ బ్యాట్స్‌మెన్‌. ప్ర‌త్య‌ర్థి ఎవ‌రైనా, ఫార్మెట్ ఏదైనా - బౌల‌ర్ల‌పై భీక‌రంగా విరుచుకుపోవ‌డ‌మే త‌న‌కు తెలుసు. ఐపీఎల్ అంటే.. మ‌రింత చెల‌రేగిపోతాడు. ఐపీఎల్ లో అత్య‌ధిక ప‌రుగులు...

HOT NEWS

[X] Close
[X] Close