ల‌వ్ స్టోరీ ట్రైల‌ర్‌: ఫీల్ గుడ్‌… రొమాంటిక్ జ‌ర్నీ

ప్రేమ‌క‌థ‌ల మాస్ట‌ర్‌… శేఖ‌ర్ క‌మ్ముల‌. హ్యాపీడేస్ నుంచి ఫిదా వ‌ర‌కూ.. అన్నీ ల‌వ్ స్టోరీలే చేసినా, ఒక్కో క‌థ‌లో ఒక్కో ఎమోష‌న్ ని జోడించాడు. ఈసారి ఆయ‌న మ‌రో `ల‌వ్ స్టోరీ`చెప్ప‌బోతున్నారు. నాగ‌చైత‌న్య‌, సాయిప‌ల్ల‌వి జంట‌గా న‌టించిన ఈ సినిమా… ఎన్నో వాయిదాల అనంత‌రం ఈనెల 24న విడుద‌ల కాబోతోంది. ఈరోజు ట్రైల‌ర్ వ‌దిలారు.

రెండున్న‌ర నిమిషాల ఈ ట్రైల‌ర్‌లో శేఖ‌ర్ క‌మ్ముల త‌న మార్క్‌ని అడుగుడుగునా చూపించాడు. డాన్స్ త‌ప్ప మ‌రో ప్ర‌పంచం తెలియ‌ని హీరో, ఆ డాన్స్ తో ఎలా ఎద‌గాల‌నుకుంటాడు? బీటెక్ చ‌దివి సాఫ్ట్ వేర్‌జాబ్ చేయాల‌నుకున్న హీరోయిన్ – ఆ ప్ర‌యాణంలో ఎలాంటి ఇబ్బందుల్ని ఎదుర్కొంది? అస‌లు వీళ్లిద్ద‌రూ ఎలా క‌లిశారు? వీళ్ల ప్రేమ‌క‌థ‌కు అడ్డేంటి? ఇదే `ల‌వ్ స్టోరీ` క‌థ‌. ట్రైల‌ర్‌లోనే క‌థంతా తెలిసిపోతుంది. హీరో హీరోయిన్లు, మిగిలిన పాత్ర‌లూ అన్నీ తెలంగాణ యాస‌లోనే మాట్లాడ‌డంతో `ఫిదా` మార్క్ మ‌రోసారి తెర‌పై స్ప‌ష్టంగా క‌నిపించింది. శేఖ‌ర్ క‌మ్ముల సినిమాల్లో ఉండే ల‌వ్ లీ మూమెంట్స్‌, ఎమోష‌న్స్ ఈ సినిమాలో ఉన్నాయ‌న్న సంగ‌తి అర్థ‌మ‌వుతూనే ఉంది. తెలంగాణ‌లో ఉండే.. చిన్న చిన్న గ‌ల్లీల్లో ఈ క‌థ న‌డిపారు. దాంతో స‌హ‌జ‌త్వం మ‌రింత‌గా కొట్టొచ్చిన‌ట్టు క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే పాట‌లు హిట్టు. కాబ‌ట్టి… ఈ సినిమాపై మ‌రింత న‌మ్మ‌కం క‌లుగుతోంది. ట్రైల‌ర్‌లోని ఎలిమెంట్సే థియేట‌ర్లోనూ పండితే.. మ‌రోసారి ఆడియ‌న్స్ ఫిదా అయిపోవ‌డం ఖాయం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

1 COMMENT

  1. Cinima super duper hit. Pakka. . Narangbayapaddadu kani10 th kivadalalsindhi. Chi cinimallo highest grocer KaniSam 70-100 cr. Pakka. Good luck team. Na mata rasi pettukondi.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here