టికెట్ల అమ్మకానికి టాలీవుడ్ త‌ల ఊపిన‌ట్టేనా?

సినిమా టికెట్ల అమ్మ‌కాల వ్య‌వ‌హారం మొత్తం ఏపీ ప్ర‌భుత్వం త‌న చేతుల్లోకి తీసుకోవాల‌న్న నిర్ణ‌యం… టాలీవుడ్ కే హాట్ టాపిక్ అయ్యింది. నిజానికి ఇదేమంత తెలివైన చ‌ర్య కానే కాదు. ఓ ర‌కంగా టాలీవుడ్ ని భ‌య‌పెట్ట‌డం లాంటిది. టాలీవుడ్ పై జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి ఉన్న మ‌మ‌కారం ఏమిటో తెలియంది కాదు. ఇప్ప‌టికే జ‌గ‌న్ చ‌ర్య‌లు… టాలీవుడ్ ప‌తానానికి ఇదోదికంగా సాయం చేస్తూ వ‌చ్చాయి. అందులో ఇదొక‌టి.

జ‌గ‌న్ నిర్ణ‌యంపై టాలీవుడ్ లో పెద్ద చ‌ర్చే న‌డుస్తోంది. కానీ ఎవ్వ‌రూ నోరు మెద‌ప‌డం లేదు. ఏం మాట్లాడితే ఏమైపోతామో.. అన్న భ‌యం వాళ్ల‌ది. సినిమా వాళ్ల‌కు వ్యాపారాలున్నాయి.భూములున్నాయి. లోలోప‌ల లొసుగులు చాలా ఉన్నాయి. వాట‌న్నింటిపైనా త‌మ వాక్కులు ప్ర‌భావం చూపిస్తాయ‌న్న భ‌యం. అందుకే ఇంత‌మంది బ‌డా హీరోలు, నిర్మాత‌లు, ద‌ర్శ‌కులు ఉన్నా అంతా నిశ్శ‌బ్దంగా చూస్తున్నారంతే. ఈ నిశ‌బ్దం వెనుక మ‌రికొన్ని మ‌త‌ల‌బులూ ఉన్నాయి. జ‌గ‌న్ మొండిఘ‌టం. తాను అనుకున్న‌ది చేసి తీర‌తాడంతే. ఇప్పుడు ఈ విష‌యంలో టాలీవుడ్ అంతా ఏక‌మై నిర‌స‌న తెలిపినా – జ‌గ‌న్ ఆగ‌డు. పైగా మ‌రింత మొండిత‌నంతో తాను చేయాల‌నుకున్న‌వ‌న్నీ అమ‌లు ప‌రిచి తీర‌తాడు. ఎలాగూ… ఆప‌లేం క‌దా.. అన్న నిర్లిప్త వైఖ‌రి టాలీవుడ్ మౌనానికి ఓ కార‌ణం కావొచ్చు. లేదంటే.. ఈ వ్య‌వ‌హారంపై ఎవ‌రైనా కోర్టుకెళ్ల‌డం ఖాయం. కోర్టు జ‌గ‌న్ స‌ర్కారుకి మొండి చేయి చూపించ‌డం ఇంకా గ్యారెంటీ… అన్న న‌మ్మ‌కాలూ ఉండొచ్చు.

అస‌లు ఈ పోర్ట‌ల్ వ్య‌వ‌స్థ ఎలా ప‌ని చేస్తుంది? దాని వ‌ల్ల ఎవ‌రికి ఎలాంటి లాభం? ఈ విష‌యంపై చాలామంది నిర్మాత‌ల‌కే ఇంకా స్ప‌ష్ట‌త లేదు. అలాంటప్పుడు ఏం మాట్లాడ‌తారు? ఎవ‌రిని విమ‌ర్శిస్తారు? అందుకే అంతా వేచి చూసే ధోర‌ణిలో ప‌డిపోయారు. ఇప్ప‌టికే ఏపీలో టాలీవుడ్ ప‌రిస్థితేం బాలేదు. ఇప్పుడు జ‌గ‌న్ నిర్ణ‌యాన్ని విమ‌ర్శిస్తే.. మ‌రింత క్లిష్ట‌ప‌రిస్థితుల్ని ఎదుర్కోవాల్సివ‌స్తుంది. ఎలాగూ.. ఈ టికెటింగ్ వ్య‌వ‌స్థ వ‌ర్కవుట్ అవ్వ‌దు.. అలాంట‌ప్పుడు ఇప్పుడు గొడ‌వ ప‌డాల్సిన అవ‌స‌రం ఏముంద‌న్న న‌మ్మ‌కంతోనే ఎవ్వ‌రూ నోరు మెద‌ప‌డం లేదు.అందుకే… టికెట్ల అమ్మ‌కానికి త‌లూపేసి – జ‌గ‌న్ ద‌గ్గ‌ర మార్కులు కొట్టేసే ప్ర‌య‌త్నాలు చేసినా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన అవ‌స‌రం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రాణభయంతో దేశం విడిచి వెళ్లిన పట్టాభి !?

టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మాల్దీవ్స్ వెళ్లారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.  ఆయన విమానం ఎక్కినప్పటి నుండి దిగిన వరకూ ఆయనకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో కనిపించాయి. ఓ పార్టీ...

‘గీతా’లో మరో సంతకం

'బొమ్మరిల్లు’ సినిమా దర్శకుడు భాస్కర్ జాతకాన్ని మార్చేసింది. ఆ సినిమానే ఆయన ఇంటిపేరు అయింది. రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి పెద్ద హీరోలతో సినిమా చేసే ఛాన్స్ త్వరగానే వచ్చేసింది. అయితే...

విష్ణు నిర్ణ‌యం బాగుంది.. కానీ!?

`మా` అధ్య‌క్షుడిగా ఇటీవ‌లే ప‌ద‌వీ బాధ్య‌త‌లు స్వీక‌రించారు మంచు విష్ణు. వీలైనంత త్వ‌ర‌గా త‌న మార్క్ ని చూపించాల‌ని తాప‌త్ర‌య‌ప‌డుతున్నారు. `మా` బై లాస్ లో కొన్నింటికి మార్చాల‌న్న‌ది విష్ణు ఆలోచ‌న‌. ...

ఏపీ చీకట్లే తెలంగాణ వెలుగులకు సాక్ష్యాలన్న కేసీఆర్

టీఆర్ఎస్ అధినేతగా 9వసారి ఏకగ్రీవంగా ఎన్నికైన కేసీఆర్ తన ప్రసంగంలో .. తెలంగాణ అభివృద్ధిని.. ఏపీతో పోల్చి విడిపోవడం వల్ల ఎంత ప్రగతి సాధించామో వివరించారు. రాష్ట్రం విడిపోతే తెలంగాణ చీకట్లోకి...

HOT NEWS

[X] Close
[X] Close