జంబ‌ల‌కిడికి భ‌లే… ఛాన్సు

ఈవారం రెండు సినిమాలొచ్చాయి. ఒక‌టి ‘నా నువ్వే’. రెండోది ‘సమ్మోహ‌నం’. నా నువ్వే గురించి చెప్పుకోవ‌డానికి ఏం లేదు. ‘స‌మ్మెహ‌నం’లో మాత్రం క్లాస్ ఆడియ‌న్స్‌కి న‌చ్చే ల‌క్ష‌ణాలు క‌నిపించాయి. అయితే.. రెండింటి క‌ల‌క్ష‌న్లూ అంతంత మాత్ర‌మే. ఈవారం ‘జంబ‌ల‌కిడి పంబ‌’ రాబోతోంది. టైటిల్ తోనే జ‌నాల్ని థియేట‌ర్‌కి ర‌ప్పించే స‌త్తా ఉంది. శ్రీ‌నివాస రెడ్డి కామెడీ కూడా జ‌నాల‌కు న‌చ్చుతుంది కాబ‌ట్టి… ‘హీరోగా ఏం చేశాడో చూద్దాం’ అని థియేట‌ర్‌కి వ‌చ్చేవాళ్లు ఎక్కువే ఉంటారు. పైగా ‘గీతాంజ‌లి’, ‘జ‌య‌మ్ము నిశ్చ‌య‌మ్మురా’ అంటూ.. మంచి క‌థ‌ల‌నే ఎంచుకుంటున్నాడు శ్రీ‌నివాస‌రెడ్డి. ఆ న‌మ్మ‌కం కూడా ఓ ప్ల‌స్ పాయింటే. దానికి తోడు బాక్సాఫీసు మ‌రీ డ‌ల్‌గా ఉంది. స‌రైన సినిమా ప‌డి చాలారోజులైంది. ‘జంబ‌ల‌కిడి పంబ‌’పై గొప్ప అంచనాలు లేక‌పోవొచ్చు. కానీ రెండు గంట‌ల పాటు నాన్ స్టాప్‌గా న‌వ్విస్తే గనుక కాసులు కురిపించుకోవొచ్చు. వినోదం రాబ‌ట్టే.. ‘స‌రుకు’ ఈ క‌థ‌కు ఉంద‌ని ట్రైల‌ర్ల‌లో అర్థ‌మ‌వుతోంది. పైగా… బాక్సాఫీసు ద‌గ్గ‌ర గ‌ట్టి పోటీ కూడా లేదు. 14న రావాల్సిన సినిమా ఎక్కువ థియేట‌ర్లు దొరుకుతాయి అన్న ఆశ‌తో కాస్త ఆల‌స్యంగా వ‌స్తోంది. అది కూడా ఈసినిమాకి క‌లిసొచ్చేదే. మ‌రి శ్రీ‌నివాసరెడ్డి అదృష్టం ఎలా ఉందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ర‌వితేజ టైటిల్‌… ‘కిలాడీ?

ర‌వితేజ - ర‌మేష్ వ‌ర్మ కాంబినేష‌న్‌లో ఓ చిత్రం రూపుదిద్దుకోనుంది. కోనేరు స‌త్య‌నారాయ‌ణ నిర్మాత‌. ఈ చిత్రానికి `కిలాడీ` అనే పేరు ప‌రిశీలిస్తున్నారు. ప్ర‌స్తుతం `క్రాక్‌` సినిమాతో బిజీగా ఉన్నాడు ర‌వితేజ‌....

అంతర్జాలం లో “తానా ప్రపంచ సాహిత్య వేదిక” ప్రారంభం

ఈ నెలలో అంతర్జాలం లో "తానా ప్రపంచ సాహిత్య వేదిక" ను ప్రారంభిస్తున్నామని తద్వారా తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణ, పర్వ్యాప్తి లో తానా మరో ముందడుగు...

తెలంగాణ ఉద్యోగులకు సగం జీతాలే..!

తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ నెల కూడా ప్రభుత్వ ఉద్యోగులకు సగం జీతమే ఇవ్వాలని నిర్ణయించారు. రాష్ట్రానికి ఆదాయం పెరగకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. ఆర్థికశాఖకు ఆదేశాలు...

“అద్దె మైకు” చాలించు అంటూ సొంత పార్టీ కార్యకర్తల వాయింపు

వైకాపా ప్రతినిధి అద్దేపల్లి శ్రీధర్ ఈరోజు ఉదయం ఒక టీవీ ఛానల్ డిబేట్ లో మాట్లాడుతూ- హైకోర్టు పై విమర్శలు చేసిన తమ పార్టీ నేతలు, అభిమానులు చాలా వరకు...

HOT NEWS

[X] Close
[X] Close