నాకూ కొత్త కథలు చేయాలనుంది: తేజ్

పాపం… సాయిధరమ్ తేజ్. ‘సుప్రీమ్’ తరవాత అతడి ఖాతాలో సరైన హిట్ పడలేదు. ‘తిక్క’ ఫ్లాప్‌తో మొదలు పెడితే… ‘ఇంటిలిజెంట్’ వరకూ ప్రతి సినిమాకి తలబొప్పి కట్టే తీర్పు ఇచ్చారు ప్రేక్షకులు. దాంతో యువ హీరోల రేసులో తేజ్ వెనకబడ్డాడు. దానికి తోడు రొటీన్ సినిమాలు చేస్తున్నాడని విమర్శలు ఎదుర్కొంటున్నారు. మెగా అభిమానులు కూడా అతడికి రొటీన్ సినిమాలు చేయవద్దని సలహా ఇచ్చార్ట‌. జూలై 6న ‘తేజ్.. ఐ లవ్ యు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు ఈ హీరో. ఈ సందర్భంగా సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ “రొటీన్‌ కథల జోలికి వెళ్లకుండా కొత్త తరహా కథల్ని ఎంపిక చేసుకోమని అభిమానులు చెబుతుంటారు. నాకూ కొత్త కథలు, కొత్త తరహా సినిమాలు చేయాలని వుంటుంది. కొన్నిసార్లు డేట్స్ అడ్జస్ట్ కాక, షెడ్యూల్స్‌ కుదరని కారణంగా వదులుకోవాల్సి వస్తుంది” అని పేర్కొన్నారు. అలాగే, అభిమానులు ఈ హీరోకి బరువు తగ్గమని కూడా సలహా ఇచ్చారని చెప్పుకొచ్చారు. అవన్నీ విన్న సాయిధరమ్ తేజ్ తగ్గడానికి ప్రయత్నిస్తున్నానని చెబుతున్నారు. ‘తేజ్.. ఐ లవ్ యు’ ప్రచార చిత్రాల్లో బొద్దుగా కనిపించిన ఈ హీరో, తరవాత సినిమాలో కాస్త సన్నబడతాడేమో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

క‌థ‌లు వింటున్న త్రివిక్ర‌మ్‌

స్వ‌త‌హాగా త్రివిక్ర‌మ్ మంచి ర‌చ‌యిత‌. ఆ త‌ర‌వాతే ద‌ర్శ‌కుడ‌య్యాడు. త‌న క‌థ‌ల‌తోనే సినిమాలు తీశాడు. తీస్తున్నాడు. `అ.ఆ` కోసం ఓ న‌వ‌ల ని ఎంచుకున్నాడు. ర‌చ‌యిత్రికి కూడా క్రెడిట్స్ ఇచ్చాడు. అయితే.. క‌థ‌ల...

ఆత్మ‌క‌థ రాస్తున్న బ్ర‌హ్మానందం

అరగుండుగా `అహ‌నా పెళ్లంట‌`లో న‌వ్వించాడు బ్ర‌హ్మానందం. అది మొద‌లు.. ఇప్ప‌టి వ‌ర‌కూ వంద‌లాది చిత్రాల్లో హాస్య పాత్ర‌లు పోషించి, తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో త‌న‌కంటూ ఓ స్థానం సంపాదించుకున్నాడు. ప‌ద్మ‌శ్రీ‌తో ప్ర‌భుత్వం...

క‌మ్ బ్యాక్ కోసం నిత్య‌మీన‌న్ ఆరాటం

అవ‌కాశాలు వ‌చ్చిన‌ప్పుడే ఒడిసిప‌ట్టుకోవాలి. అవి చేజారిపోయాక‌.. ఆరాట‌ప‌డ‌డంలో అర్థం లేదు. చిత్ర‌సీమలో అవ‌కాశ‌మే గొప్ప‌ది. దాన్ని ఎంత వ‌ర‌కూ స‌ద్వినియోగం చేసుకుంటామ‌నే విష‌యంపైనే కెరీర్ ఆధార‌ప‌డి ఉంటుంది. ఆ సంగ‌తి నిత్య‌మీన‌న్‌కి ఇప్పుడిప్పుడే...

గీతా ఆర్ట్స్‌లో వైష్ణ‌వ్ తేజ్‌

గీతా ఆర్ట్స్‌కీ, మెగా హీరోల‌కూ ఓ సెంటిమెంట్ ఉంది. తొలి సినిమాని బ‌య‌టి బ్యాన‌ర్‌లో చేయించి, రెండో సినిమా కి మాత్రం గీతా ఆర్ట్స్ లో లాక్ చేస్తుంటారు. రామ్ చ‌ర‌ణ్ అంతే....

HOT NEWS

[X] Close
[X] Close