బెంగళూరుకి చేరిపోయిన విశాఖ లూలూ మాల్..!

దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుల్లో కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప.. లూలూ గ్రూప్ యాజమాన్యాన్ని తమ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా అంగీకరింపచేశారు. మంచి రాయితీలిచ్చి.. బెంగళూరు వంటి నగరం పిలిస్తే.. లూలూ గ్రూప్ ఆలోచిస్తుందా.. ఓకే చెప్పేసింది. అక్కడ అతి పెద్ద మాల్ నిర్మించబోతోంది. కొన్ని వేల మందికి ఉపాధి లభించబోతోంది. కానీ ఇక్కడ అసలు విశేషం ఏమిటంటే..ఈ లూలూ గ్రూప్.. ఇదే మాల్ డిజైన్‌ను.. రెడీ చేసుకుంది విశాఖ కోసం. శంకుస్థాపన కూడా చేసింది.

ఏషియాలోనే అతిపెద్ద కన్వెన్షన్ సెంటర్ గా విశాఖలో మాల్‌ను తీర్చిదిద్దాలను.. లూలూ గ్రూప్ అనుకుంది. 9 ఎకరాల విస్తీర్ణంలో అత్యాధునిక హంగులతో నిర్మించడానికి ఏర్పాట్లు చేసింది. హోటల్స్, కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణంలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన యుఏఈకి చెందిన లూలూ గ్రూప్ తమ వ్యాపారాల్లోనే విశాఖ మాల్‌ను మణి మకుటంగా మార్చాలనుకుంది. 7వేల మందితో గ్లోబల్ ఈవెంట్స్ ను నిర్వహించుకునేలా భారీ కన్వెన్షన్ సెంటర్ తో పాటు అత్యాధునికమైన ఫంక్షన్ హాల్స్.. ఈ కన్వెన్షన్ సెంటర్ ప్రత్యేకత.. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ విశాఖ చుట్టుపక్కల యువతరు పదివేల మందికి ఉపాధి దొరకుతుందని అంచనా వేశారు. ప్రభుత్వం మారగానే జగన్మోహన్ రెడ్డి లూలూ గ్రూప్‌ను తరిమేశారు. విశాఖలో మాల్ అవసరం లేదన్నారు. అక్కడి ప్రజలకు ఉపాధి దొరకకపోయినా పర్వాలేదనుకున్నారు. వారికి కేటాయించిన 9 ఎకరాలను క్యాన్సిల్ చేశారు.

జగన్ ప్రభుత్వం దెబ్బకు .. ఠారెత్తిపోయిన లూలూ గ్రూప్.. ఏపీలో పెట్టుబడులు పెట్టబోమని తేల్చి చెప్పేసింది. అంత్జాతీయంగా గుర్తింపు పొందిన లూలూ గ్రూప్ ఇలాంటి ప్రకటన చేయడం.. ఏపీపై.. ఇన్వెస్టర్ల అపనమ్మకాన్ని పెంచింది. ఇప్పుడా ఆ లూలూ గ్రూప్ విశాఖలో తాము పెట్టాలనుకున్న పెట్టుబడిని బెంగళూరుకు మార్చింది. విశాఖ ఉపాధి బెంగళూరుకు వెళ్లిపోయింది. ఆదాని డేటా సెంటర్ పోవడంతోనే… విశాఖ ఓ గొప్ప అవకాశాన్ని కోల్పోయినట్లయింది. లూలూ గ్రూప్ పోవడంతో.. మెట్రో సిటీ రేంజ్‌కు చేరే అవకాశాన్నీ విశాఖ చేజార్చుకుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆది.. పాన్ ఇండియా సినిమా

సాయికుమార్ త‌న‌యుడిగా ఇండ్ర‌స్ట్రీలోకి అడుగుపెట్టాడు ఆది. ప్రేమ కావాలి, లవ్లీ సినిమాల‌తో మంచి విజ‌యాలు ద‌క్కాయి. ఆ త‌ర‌వాతే ట్రాక్ త‌ప్పాడు. ప్ర‌తిభ ఉన్నా, అవ‌కాశాలు వ‌స్తున్నా స‌ద్వినియోగం చేసుకోవ‌డం లేదు. ఇప్పుడు...

దేవ‌ర‌కొండ‌.. మిడ‌ల్ క్లాస్ మెలోడీస్!

దొర‌సానితో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మ‌య్యాడు ఆనంద్ దేవ‌ర‌కొండ‌. విజ‌య్ దేవ‌ర‌కొండ త‌మ్ముడు కావ‌డం, రాజ‌శేఖ‌ర్ కుమార్తె హీరోయిన్ గా ప‌రిచ‌యం అవ్వ‌డంతో ఈ ప్రాజెక్టుపై ఆశ‌లు, అంచ‌నాలు పెరిగాయి. కానీ ఆ సినిమా...

సచివాలయం కూల్చివేతకు హైకోర్టు బ్రేక్…!

శరవేగంగా జరుగుతున్న తెలంగాణ సచివాలయ భవనాల కూల్చివేతకు హైకోర్టు బ్రేక్ వేసింది. సోమవారం వరకూ కూల్చివేతలు ఆపాలని.. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కూల్చివేతలు నిలిపివేయాలంటూ.. చిక్కుడు ప్రభాకర్ అనే వ్యక్తి దాఖలు...

క‌రోనా టైమ్ లోనూ… క‌నిక‌రించ‌డం లేదు!

క‌రోనా క‌ష్టాలు చిత్ర‌సీమ‌కు కుదిపేస్తున్నాయి. సినిమా రంగం ఈ ఉప‌ద్ర‌వం నుంచి ఇప్ప‌ట్లో బ‌య‌ట‌ప‌డ‌డం క‌ష్ట‌మే. చేయ‌గ‌లిగింది ఏమైనా ఉంటే, అది న‌ష్టాల్ని త‌గ్గించుకోవ‌డ‌మే. అందుకే కాస్ట్ కటింగ్‌, బ‌డ్జెట్ కంట్రోల్ అనే...

HOT NEWS

[X] Close
[X] Close