ఇల్లు అంటే కేవలం పెద్ద హాలు, కిచెన్, బెడ్ రూములు కాదు. అంత కంటే ఎక్కువ. లగ్జరీ హోమ్స్ అయితే అర్థం పూర్తిగా మారిపోతోంది. లగ్జరీ హోమ్స్‌లో ఇప్పుడు వెల్నెస్ ట్రెండ్ నడుస్తోంది.
ఉదయం లేచిన వెంటనే బాత్రూమ్లో అడుగుపెడితే కాలి కింద హీటెడ్ ఫ్లోర్ .. షవర్ ఆన్ చేస్తే స్టీమ్, అరోమాథెరపీ ఆయిల్స్ ఆటోమాటిక్‌గా కలిసి, ఐదు నక్షత్రాల హోటల్ స్పా అనుభవం అందించేలా ఏర్పాట్లు ఇంట్లోనే ఉంటున్నాయి. లగ్జరీ ఫ్లాట్లు, విల్లాల్లో ఈ స్పా-స్టైల్ బాత్రూమ్స్ డిఫాల్ట్ ఫీచర్‌గా మారాయి. భార్యకు వేరే, భర్తకు వేరే అన్నట్టు హిస్-అండ్-హర్స్ డ్యూయల్ బాత్రూమ్స్ ఇప్పుడు స్టేటస్ సింబల్‌గా మారాయి.
ఒక్కో వైపు 300 చదరపు అడుగుల విస్తీర్ణం, వాక్-ఇన్ క్లోసెట్, పర్సనల్ సానా, జకూజీ వరకు ఉంటున్నాయి. నిద్ర ఇప్పుడు కేవలం మంచం మీద పడుకోవడం కాదు, టెక్నాలజీ సహాయంతో శాస్త్రీయంగా శరీరాన్ని మెరుగుపర్చుకునే ప్రక్రియ. స్మార్ట్ బెడ్స్ శరీర ఉష్ణోగ్రతను గమనించి ఆటోమాటిక్‌గా కూలింగ్ లేదా వార్మింగ్ అడ్జస్ట్ . చేస్తాయి. రాత్రి గాఢ నిద్రలోకి జారిపోయేందుకు లైటింగ్ స్లోగా డిమ్ అయిపోతుంది, గది గాలిలో లావెండర్ లేదా ఛమోమైల్ సుగంధం సన్నగా వ్యాపిస్తుంది.
లగ్జరీ ప్రాజెక్టుల్లో యోగా-మెడిటేషన్ రూమ్స్ బాగా కనిపిస్తున్నాయి. ఒక్కో రూమ్ 200-400 చదరపు అడుగుల విస్తీర్ణంలో, ఫ్లోర్ టు సీలింగ్ గ్లాస్ విండోస్, ఓక్ వుడ్ ఫ్లోరింగ్, సౌండ్‌ప్రూఫ్ వాల్స్, ఆటోమాటిక్ ఎయిర్ ప్యూరిఫికేషన్ సిస్టమ్‌లతో ఉంటాయి. ఉదయం 5 గంటలకు సూర్యోదయం చూస్తూ యోగా చేస్తే ఒక రిసార్ట్‌లో ఉన్నట్టు ఫీల్ కలిగేలా చేస్తున్నారు. ఇవన్నీ డబ్బున్నోళ్ల కష్టాలు.