‘మా’ ఎన్నిక‌లు: ముంద‌స్తు ‘పార్టీలు’

ఈసారి కూడా `మా` ఎన్నిక‌లు త‌ప్పేట్టు లేవు. గ‌తంలో కంటే ఈసారి మ‌రింత ప్ర‌తిష్టాత్మ‌కంగా మారిపోయాయి కూడా. మూడు నెల‌ల ముందే…. `మా`లో ఎన్నిక‌ల హ‌డావుడి క‌నిపిస్తోంది. ఎవ‌రెవ‌రు పోటీ చేస్తున్నార‌న్న విష‌యంలో స్ప‌ష్ట‌త వ‌చ్చేసింది. అయితే ప్ర‌ధానంగా విష్ణు, ప్ర‌కాష్ రాజ్ ల మ‌ధ్యే పోటీ ఉంది. వీరిద్ద‌రూ ఏ చిన్న అవ‌కాశాన్నీ వ‌ద‌లుకోవ‌డం లేదు. ఇప్ప‌టికే… లోపాయికారిగా `మా` ప్ర‌చారం కూడా మొద‌లైపోయిందని టాక్‌. ఓ అభ్య‌ర్థి… `మా` స‌భ్యుల్ని గ్రూపులు గ్రూపులుగా క‌లుస్తున్నాడ‌ట‌. వాళ్ల‌కి చిన్న చిన్న పార్టీలు కూడా ఇస్తున్నాడ‌ట‌. మ‌రొక‌రైతే.. `మా` లోని నిరుపేద స‌భ్యుల ఎకౌంట్లోకి డ‌బ్బులు వేసి `క‌రోనా టైమ్ క‌దా.. ఎందుకైనా ప‌నికొస్తుంది.. ఉంచండి` అంటూ ఫోన్లు చేసి మ‌రీ చెబుతున్నాడ‌ట‌. అంటే… ఎవ‌రి బ్యాచుని వాళ్లు కాపాడుకోవ‌డానికి ప్ర‌య‌త్నాలు మొద‌లెట్టేశార‌న్న‌మాట‌. సినీ పెద్ద‌లు కృష్ణంరాజు, చిరంజీవి లాంటివాళ్లైతే.. ఈసారి `మా` అధ్య‌క్షుడ్ని ఏక‌గ్రీవంగానే ఎంచుకోవాల‌నే భావిస్తున్నారు. కానీ.. ఆ వాతావ‌ర‌ణం క‌నిపించ‌డం లేదు. ఇది వ‌ర‌కు కూడా.. మా లో ఇలాంటి పోటీ క‌నిపించిన‌ప్పుడు.. అభ్యర్థుల్ని పిలిపించి మాట్లాడి – ఎన్నిక‌ల నుంచి త‌ప్పుకోవాల‌ని సూచించారు. కానీ వ‌ర్క‌వుట్ అవ్వ‌లేదు. ఈసారి కూడా అలాంటి వాతావ‌ర‌ణ‌మే క‌నిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎయిడెజ్ కాలేజీలపై ప్రభుత్వ విధానంతో మైనస్సే !

దశాబ్దాలుగా విద్యా సేవ అందిస్తున్న ఎయిడెడ్ కాలేజీలను అయితే ప్రభుత్వానికి స్వాధీనం చేయాలి లేకపోతే ప్రైవేటుగా నిర్వహించుకోవాలని ప్రభుత్వం ఆదేశించడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది. ఎయిడెడ్ కాలేజీలు ప్రభుత్వానివిగానే సాగుతున్నాయి....

తెలంగాణలో కూడా ప్రభుత్వ మటన్ !

ఏపీ ప్రభుత్వం మటన్ మార్టుల పేరుతో ఓ కాన్సెప్ట్‌ను ‌తమ అధికార మీడియా ద్వారా ప్రజలకు తెలియచెబితే జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. చివరికి పశుసంవర్థక మంత్రి అలాంటి ఆలోచనలేదని. అలా...

కేశినేనివి బెదిరింపులా ? నిజంగానే విరక్తి చెందారా ?

కేశినేని నాని ఇక ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నట్లుగా టీడీపీని వ్యతిరేకించే.. వైసీపీకి దగ్గరగా ఉండే మీడియాలో ప్రచారం జరిగింది. ఆయనే ఈ విషయాన్ని చెప్పినట్లుగా ఆ మీడియా చెప్పుకొచ్చింది. తన ఆశక్తతను...

టీ కాంగ్రెస్ సీనియర్ల అసంతృప్తి కూడా కామెడీ అయిపోతోందా !?

తెలంగాణ కాంగ్రెస్‌లో సీనియర్లుగా చెలామణి అయ్యే కొంత మంది నాయకులను రేవంత్ రెడ్డి ప్రణాళిక ప్రకారం సైడ్ చేస్తున్నట్లుగా ఉన్నారు. కలసి వస్తే సరే లేకపోతే వారి అసంతృప్తిని కూడా లెక్కలోకి రాకుండా...

HOT NEWS

[X] Close
[X] Close