ఎన్నాళ్లో వేచిన శుక్ర‌వారం: ఈవారం రెండు సినిమాలు

హ‌మ్మ‌య్య‌… మొత్తానికి థియేట‌ర్లు తెర‌చుకుంటున్నాయి. కొత్త సినిమాల హంగామా క‌నిపించ‌బోతోంది. ఈవారం రెండు సినిమాలు విడుద‌ల‌కు సిద్ధ‌మ‌య్యాయి. స‌త్య‌దేవ్ `తిమ్మ‌రుసు`తో పాటుగా… తేజ `ఇష్క్‌` ఈవార‌మే వ‌స్తున్నాయి. రెండూ చిన్న సినిమాలే. కాక‌పోతే.. కంటెంట్ బ‌లంగా ఉన్న క‌థ‌లు. రెండు సినిమాల ప్ర‌చారం కూడా జోరుగా సాగుతోంది. ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌కు రావ‌డానికి సిద్ధంగా ఉన్నారా, లేదా? థియేట‌ర్ల ద‌గ్గ‌ర ఎలాంటి వాతావ‌ర‌ణం క‌నిపించ‌బోతోంది? అనేది తెలుసుకోవ‌డానికి ఇవి రెండూ పైలెట్ ప్రాజెక్టులుగా ఉప‌యోగ‌ప‌డ‌బోతున్నాయి. ఈ రెండు సినిమాల రిజ‌ల్ట్ ని బ‌ట్టి.. ఆగ‌స్టులో సినిమాలు విడుద‌ల చేయాలా? ఇంకొన్ని రోజులు ఆగాలా? అనే విష‌యంపై నిర్మాత‌లు ఓ నిర్ణ‌యానికి వ‌స్తారు.

* ఏపీలో అదే స‌మ‌స్య‌

తెలంగాణలో 100 శాతం ఆక్యుపెన్సీకి అనుమ‌తి ఉంది. దాంతో పాటు పార్కింగ్ ఛార్జీలు వ‌సూలు చేసుకునే అవ‌కాశాన్ని థియేట‌ర్ల‌కు క‌ల్పిస్తూ ప్ర‌భుత్వం జీవో జారీ చేసింది. అయితే ఏపీలో మాత్రం ప‌రిస్థితి విరుద్ధంగా ఉంది. అక్క‌డ 50 శాతం ఆక్యుపెన్సీకే అవ‌కాశం. దాంతో పాటు నైట్ షోలు లేవు. టికెట్ రేట్ల‌పై ఇంకా ప్ర‌భుత్వం దిగి రాలేదు. దాంతో.. ఏ,బీ సెంట‌ర్ల‌లో థియేట‌ర్లు తెర‌చుకునే అవ‌కాశం లేదు. కేవ‌లం మ‌ల్టీప్లెక్స్‌ల‌లోనే బొమ్మ ప‌డ‌బోతోంది. విశాఖ‌, విజ‌య‌వాడ‌, కాకినాడ లాంటి సిటీల్లోనే థియేట‌ర్లు తెర‌చుకోబోతున్నాయి. సీ సెంటర్ల‌లో థియేట‌ర్లు తెర‌చుకోవ‌డం లేదు. బీ సెంట‌ర్లు కూడా డౌటుగానే ఉన్నాయి. మొత్తానికి ఏపీలో 25 శాతం మాత్ర‌మే థియేట‌ర్లు అందుబాటులో ఉండే అవ‌కాశం ఉంది. అస‌లే 50 శాతం ఆక్యుపెన్సీ.. అందులోనూ మూడొంతుల థియేట‌ర్ల‌కు తాళాలు ప‌డ్డాయి. ఇలాంట‌ప్పుడు సినిమా విడుద‌ల చేసుకోవ‌డం రిస్కే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

ట్రబుల్ షూటర్… ట్రబుల్ మేకర్ అవుతున్నారా?

14... ఇది లోక్ సభ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్. అందుకు తగ్గట్టుగానే ప్రచారం చేపడుతున్నారు. అభ్యర్థుల గెలుపు బాధ్యతను తనే తీసుకొని రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తున్నారు.ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో...

కేసీఆర్‌కు సమాచారం ఇచ్చింది చెవిరెడ్డేనా ?

తెలంగాణలో 8 నుంచి 12 లోక్ సభ స్థానాల్లో బీఆర్ఎస్ గెలుస్తుదంటూ కేసీఆర్ చేసిన ప్రిడిక్షన్ వైరల్ అవుతోంది. అదే సమయంలో ఏపీలో జగన్ గెలుస్తారని తనకు సమాచారం వచ్చిందని కూడా ఓ...

ఫ‌హ‌ద్ ఫాజిల్‌పై ‘పుష్ష‌’ ఆశ‌లు

ఆగ‌స్టు 15న 'పుష్ష 2' రిలీజ్‌కి రెడీ అయ్యింది. ఈ డేట్ కి ఎప్ప‌టి ప‌రిస్థితుల్లోనూ 'పుష్ష 2' రిలీజ్ చేయాల‌ని టీమ్ మొత్తం అహ‌ర్నిశ‌లూ కృషి చేస్తోంది. ఈ సినిమా విడుద‌ల‌పై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close