ప్రేమప్రయాణంలోని ‘‘మథనం’’

శ్రీనివాస్ సాయి, భావ‌న‌రావు జంట‌గా అజయ్ సాయి మ‌నికంద‌న్ ద‌ర్శక‌త్వంలో కాశీ ప్రొడక్షన్స్ ప‌తాకంపై దివ్యా ప్రసాద్‌, అశోక్ ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం ‘మ‌థ‌నం’. ఈ మూవీ టీజ‌ర్ తాజాగా విడుద‌లైంది. ముఖ్య అతిథిగా ద‌ర్శకుడు సురేంద‌ర్‌రెడ్డి హాజరయ్యారు. లవ్ స్టోరీని కాస్త డిఫరెంట్‌గా తెరకెక్కించారు ఈ మూవీలో. అన్నంతినకుండా మారాం చేస్తున్న పిల్లవాణ్ని తల్లిదండ్రులు బుజ్జగించే సీన్‌తో ఈ టీజర్ స్టార్ట్ అవుతుంది.

‘‘నాపేరు రామ్, నేను 14 సంవత్సరాలు ఈ చీకటి గదిలో ఉండిపోయాను. నేను బయటకి రావడానికి కారణం ప్రేమ. ఆలోచించడానికి అందంగా ఉంటుంది. దక్కించుకోవడానికి మాత్రం చాలా కష్టంగా ఉంటుంది’’ అంటూ హీరో చెప్పే డైలాగ్స్ సూపర్బ్‌గా ఉన్నాయి. తర్వాత హీరోయిన్ చెప్పే డైలాగ్ కూడా టీజర్‌లో హైలెట్‌గా నిలిచింది.

‘‘నీ సిన్సియారిటీ నాకు బాగా నచ్చింది. బట్ యూ నో ఫస్ట్ నా స్టడీస్’’ అంటూ హీరోయిన్ ఇచ్చే రిప్లై కూడా ఆసక్తికరంగా ఉంది. ‘‘ముందు వాన్ని వాడికి పరిచయం చేయండి, లేదంటే మీ కొడుకు మీకు దక్కకుండా పోతాడు’’ అంటూ టీజర్ చివరలో అజయ్ చెప్పే డైలాగ్ కూడా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. మొత్తానికి టీజర్ ఈ సినిమాపై ఆసక్తి పెంచేలా చేస్తుంది.

హీరో హీరోయిన్ల యాక్టింగ్, ఫొటోగ్రఫీ టీజర్‌లో హైలెట్. రాజీవ్ కనకాల, సితార తదితరులు ఈ మూవీలో నటిస్తున్నారు. టీజర్‌ను బట్టీ ఈ సినిమా యూత్‌కు బాగా కనెక్ట్‌ అయ్యేలా ఉంది. యదార్థ సంఘ‌ట‌న ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. రామ్ అనే యువకుడి కథ ఇది. లవ్ జర్నీలో అతని మథనం ఏమిటన్నదే ఈ మూవీ కథాంశం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close