తెలంగాణ మున్సిపల్ బిల్లుకు గవర్నర్ బ్రేక్..!

తెలంగాణ సర్కార్ తో అత్యంత సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్న గవర్నర్ తీరులో ఇటీవలి కాలంలో స్పష్టమైన మార్పు వచ్చిందన్న ప్రచారం జరుగుతోంది దానికి సంబంధించి ఓ స్పష్టమైన సూచన నేడు కనబడింది. అదే మున్సిపల్ చట్టానికి.. గవర్నర్ బ్రేక్ వేయడం. మున్సిపల్ ఎన్నికలను నెలలో పూర్తి చేయాలన్న లక్ష్యంతో… కొత్త చట్టం తీసుకొచ్చి మరీ.. ప్రత్యేక సమావేశాలు పెట్టి.. బిల్లును ఆమోదింప చేసిన తెలంగాణ సీఎం కేసీఆర్‌కు.. రాజ్‌భవన్‌లో పెద్ద బ్రేక్ పడింది. ఈ బిల్లుపై… రాజ ముద్ర వేయడానికి గవర్నర్ నిరాకరించారు. బిల్లులో రాజ్యాంగ ఉల్లంఘనలు ఉన్నాయని గవర్నర్ నిర్ణయించారు. ఈ మేరకు.. బిల్లులో.. మార్పులు, చేర్పులు చేయాలని స్పష్టంగా సూచిస్తూ.. ప్రభుత్వానికి తిరుగుటపా పంపారు.

మున్సిపల్ బిల్లుపై.. తక్షణం ఆమోద ముద్ర వేస్తారని ఆశలు పెట్టుకున్న… తెలంగాణ సర్కార్‌కు… నరసింహన్ నిర్ణయం షాక్ ఇచ్చింది. అసలు ఏ మాత్రం.. ఇలా చేస్తారని ఊహించలేకపోయింది. ఉన్నది ఉన్నట్లుగా ఆమోద ముద్ర వేస్తారన్న నమ్మకం ఉండటంతో.. అసెంబ్లీని ప్రోరోగ్ చేశారు. దీంతో.. ఇప్పటికిప్పుడు.. అసెంబ్లీని సమావేశం పరిచే అవకాశం లేకుండా పోయింది. గవర్నర్ ఇలా… కొర్రీలు పెడతారని తెలిస్తే.. అసెంబ్లీని నిరవధిక వాయిదావేసేవారు కానీ ప్రోరోగ్ చేసేవారు కాదు. ఆమోదించిన బిల్లులో ఇప్పుడు గవర్నర్ సూచించినట్లుగా సవరణలు చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. దీంతో.. తాత్కాలికంగా బయట పడేందుకు సవరణలతో.. ఆర్డినెన్స్ జారీ చేసి.. మున్సిపల్ ఎన్నికల పనికి అడ్డం రాకుండా చూసుకోవాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది.

నిజానికి మున్సిపల్ బిల్లు విషయంలో విపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. రాజ్యాంగ విరుద్దంగా ఉందని గవర్నర్ కు కూడా ఫిర్యాదు చేశాయి. ముఖ్యంగా బీజేపీ నేతలు కూడా.. బిల్లుపై ఫిర్యాదు చేశారు. దీంతో.. నరసింహన్.. సీరియస్‌గా తీసుకున్నారని చెబుతున్నారు. అదే సమయంలో… ఆయన తెలంగాణ గవర్నర్ గా కొనసాగాలంటే.. బీజేపీ విధానానికి అనుగుణంగా.. టీఆర్ఎస్ విషయంలో .. కాస్త కఠినంగా ఉండాలన్న అవగాహనకు వచ్చి ఉంటారని చెబుతున్నారు. గతంలో.. ఇంటర్ బోర్డు వ్యవహారంతో పాటు.. పోడు భూములు.. ఇతర అంశాల్లోనూ గవర్నర్ కలుగచేసుకుని సమీక్షలు నిర్వహించారు. ఇప్పుడు అసెంబ్లీ ఆమోదించిన బిల్లుకే కొర్రీలు పెట్టారు. ఇవన్నీ టీఆర్ఎస్‌ను కాస్త ఆందోళనకు గురి చేస్తున్న వ్యవహారాలే..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

లాక్‌డౌన్ దిశగా రాష్ట్ర ప్రభుత్వాల ఆలోచనలు..!

వైరస్ దెబ్బకు మళ్లీ షట్‌డౌన్ ఆలోచనలు చేస్తున్నాయి ప్రభుత్వాలు. కర్ణాటక ప్రభుత్వం బెంగళూరులో వారం పాటు కంప్లీట్ లాక్ డౌన్ ప్రకటించేసింది. అక్కడ ఇప్పటికే వారంతాల్లో లాక్ డౌన్ అమలవుతోంది. అయినా.. అనూహ్యంగా.....

సినీ అవకాశం పేరిట “జబర్దస్త్” చీటింగ్

సినిమా ఇండస్ట్రీలో వేషాలు ఇప్పిస్తామంటూ చెప్పి యువతీ యువకులను మోసం చేయడం ఎప్పట్నుంచో జరుగుతున్నదే. యువతీయువకుల దగ్గరనుండి సినిమా అవకాశాలు పేరిట డబ్బులు గుంజడం, యువతుల పై లైంగిక వేధింపులకు పాల్పడడం వంటి...

వెబ్ సిరీస్‌గా ‘మైదానం’

క‌థ‌ల కొర‌త.. కొర‌త అంటుంటారు గానీ, వెద‌కాలే కానీ, మ‌న చుట్టూనే బోలెడ‌న్ని క‌థ‌లు. మ‌న సాహిత్యంలో ఎన్నో గొప్ప పాత్ర‌లు, న‌వ‌ల‌లు. వాటిని వాడుకోవడం తెలియాలంతే. ఓటీటీ వేదిక‌లు వ‌చ్చాక‌.. కంటెంట్,...

ఐశ్వ‌ర్య‌రాయ్‌కి క‌రోనా.. ఆరాధ్య‌కి కూడా

అమితాబ్ బ‌చ్చ‌న్‌, అభిషేక్ బ‌చ్చ‌న్ ల‌కు క‌రోనా సోక‌డం, ప్ర‌స్తుతం ముంబైలోని నానావ‌తీ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతుండ‌డం తెలిసిన విష‌యాలే. ఇప్పుడు ఐశ్వ‌ర్య‌రాయ్‌కి కూడా క‌రోనా సోకింది. కూతురు ఆరాధ్య‌కి కూడా క‌రోనా...

HOT NEWS

[X] Close
[X] Close