ఏపీకి వచ్చేందుకు ఢిల్లీలో లాబీయింగ్ చేసుకుంటున్న శ్రీలక్ష్మి..!

ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మిని ఎలా అయినా ఏపీ క్యాడర్‌కు తీుసకు రావాలన్న పట్టుదలతో…జగన్ ప్రభుత్వం ఉన్నట్లుగా ఉంది. జగన్ అక్రమాస్తుల కేసులో నిందితురాలైన శ్రీలక్ష్మి.. జైల్లో చాలా కాలం పాటు ఉన్నారు. అనారోగ్యం పాలయ్యారు. బెయిల్ పొంది.. అనారోగ్యం నుంచి కోలుకున్న తర్వాత విధుల్లో చేరారు. రాష్ట్ర విభజన సమయంలో.. ఆమెను తెలంగాణ క్యాడర్ కు కేటాయించారు. అయితే… ఏపీలో వైసీపీ గెలిచిన తర్వాత… జగన్మోహన్ రెడ్డి.. కొంత మంది తెలంగాణ అధికారులను ప్రత్యేకంగా ఏపీకి తీసుకు రావాలనుకున్నారు. వారిలో ఐఏఎస్ శ్రీలక్ష్మి, ఐపీఎస్ స్టీఫెన్ రవీంద్ర ఉన్నారు. కేసీఆర్ తో జరిగిన తొలి భేటీలోనే… వీరిని ఏపీకి డిప్యూటేషన్ పై పంపాలని జగన్ కోరారు. దానికి కేసీఆర్ అంగీకరించారు. రెండు రాష్ట్ర ప్రభుత్వాల అంగీకారంతో.. ఫైల్ ను.. కేంద్రానికి పంపారు.

సివిల్ సర్వీస్ అధికారుల డిప్యూటేషన్లు చూసే.. ఢిల్లీలోని డీవోపీటీ విభాగం మాత్రం… వీరి డిప్యూటేషన్ ఫైళ్లను పక్కన పెట్టేసింది. నిబంధనల ప్రకారం.. బలమైన కారణం లేకపోవడంతో… డిప్యూటేషన్ పని జరగడం లేదు. విజయసాయిరెడ్డి.. ఢిల్లీ స్థాయిలో పలుకుబడి ఉపయోగించినా పని కాకపోవడంతో… నేరుగా శ్రీలక్ష్మినే ఢిల్లీకి పిలిపించారు. విజయసాయిరెడ్డి దగ్గరుండి.. శ్రీలక్ష్మిని.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా వద్దకు తీసుకెళ్లారు. పార్లమెంట్ ప్రాంగణంలో.. అమిత్ షాను..శ్రీలక్ష్మి కలిశారు. తనను ఏపీకి డిప్యూటేషన్ పంపే ఫైల్ ను క్లియర్ చేయాలని విజ్ఞప్తి చేశారు.

అయితే.. డిప్యూటేషన్ పై అమిత్ షా హామీ ఇచ్చారో లేదో క్లారిటీ లేదు. మరో వైపు శ్రీలక్ష్మీకి ఓకే చెబితే.. స్టీఫెన్ రవీంంద్ర ఫైల్ కూడా ఓకే అవుతుందని ఏపీ సర్కార్ భావిస్తోంది. అయితే.. స్టీఫెన్ రవీంద్రను మాత్రం.. ఢిల్లీకి పిలిపించలేదు. నిబంధనల కారణంగా కాకుండా… కొన్ని ప్రత్యేకమైన రాజకీయ కారణాల వల్లే డిప్యూటేషన్లను కేంద్రం ఆపిందనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపధ్యంలో కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మీడియా వాచ్‌: సాయంకాలం ప‌త్రిక‌లు వ‌స్తున్నాయా?

సోష‌ల్ మీడియా విజృంభిస్తున్న త‌రుణంలో.. ప్రింట్ మీడియా ఇప్ప‌టికే గ‌డ్డు ప‌రిస్థితుల్ని ఎదుర్కొంటోంది. ఈ నాలుగేళ్ల‌లో ముఖ్యంగా క‌రోనా త‌ర‌వాత పేప‌ర్లు చ‌దివేవాళ్లు బాగా త‌గ్గిపోయారు. పైగా అన్నీ స‌ద్దివార్త‌లే. ఫేస్ బుక్,...

ఎన్డీఏలోకి వైసీపీకి ఆహ్వానం.. బీజేపీ ఆగ్రహం !

రాజకీయాలు చిత్రంగా ఉంటాయి. ఓ యాక్షన్‌కు రియాక్షన్ ఎలా ఉంటుందో చెప్పడం కష్టం. ఎన్డీఏ నుంచి ఎంతో మంది భాగస్వాములు వెళ్లిపోయినా రిపబ్లికన్ పార్టీ పేరుతో మహారాష్ట్రాలో రాజకీయాలు రామ్...

హుజురాబాద్‌లో “సమీప” గుర్తుల బాధ ఎవరికో !?

రాజకీయాల్లో "సమీప" ప్రత్యర్థులు ఎక్కువగా ఉంటారు. అయితే ఇప్పుడు ఆ సమీప ప్రత్యర్థులు ప్రధాన పార్టీలకు చెందిన వారే అయి ఉండాలని లేదు. ఒక్కో సారి పోలింగ్ అయిపోయిన తర్వాత ఎవరో...

చిరంజీవి చేతికి స‌ర్జరీ

ఆదివారం చిరంజీవి బ్ల‌డ్ బ్యాంక్‌లో ఓ కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా చిరంజీవి హాజ‌ర‌య్యారు. అయితే ఆయ‌న చేతికి క‌ట్టు చూసి కాస్త కంగారు ప‌డ్డారు. చిరుకి ఏమైంది? ఆ చేతికి...

HOT NEWS

[X] Close
[X] Close