చంద్రబాబు హయాంలో అక్రమ ఇసుక తవ్వకాలే లేవన్న జగన్ సర్కార్..!

ఏపీలో అక్రమ ఇసుక తవ్వకాలు జరగలేదని.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఏర్పడిన ప్రభుత్వం క్లీన్ చిట్ ఇవ్వడం సాధ్యమా..? అస్సలు ఊహించలేం. కానీ ఇది నిజం… ఏపీలో కృష్ణానది పరివాహక ప్రాంతంలో అసలు ఇసుక అక్రమ తవ్వకాలే జరగలేదని.. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కు.. ఏపీ ప్రభుత్వం తెలిపింది. కృష్ణానదిలో అక్రమ ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయంటూ.. ఏపీలో టీడీపీ సర్కార్ ఉన్నప్పుడు.. కొంత మంది ఎన్జీటీలో ఫిర్యాదు చేశారు. దానిపై ఎన్జీటీ విచారణ జరుపుతోంది. ఎన్నికల సమయంలో… రూ. వంద కోట్ల జరిమానా కూడా విధించింది. అయితే… ఏపీ సర్కార్ కోర్టుకు వెళ్లి జరిమానాపై స్టే తెచ్చుకుంది.

మరో సారి ఆ ఫిర్యాదులపై విచారణ జరుగుతూండగా.. ఏపీ సర్కార్… అనూహ్యమైన వాదన వినిపించింది. గత సర్కార్ హయాంలో.. ఎక్కడా.. కృష్ణానది తీరంలో.. అక్రమంగా ఇసుక తవ్వకాలు జరగలేదని వాదించింది. జల రవాణా కోసం ప్రకాశం బ్యారేజీ వద్ద పూడిక తీశామని మాత్రం.. తెలిపింది. ఏ ప్రాతిపదికన పూడికతీత చేపట్టారు… పర్యావరణ అనుమతులు తీసుకున్నారా? అని ఏపీ తరపు న్యాయవాదిని ఎన్జీటీ ప్రశ్నించింది. అయితే.. పూడికతీతకు పర్యావరణ అనుమతులు అవసరం లేదని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. వాదనలు విన్న ఎన్జీటీ… రెండు వారాల్లో సమగ్ర నివేదిక అందజేయాలని ఆదేశించింది.

గత ప్రభుత్వంలో ఎన్నో అక్రమాలు జరిగాయని.. ఇసుక తవ్వకాలతో టీడీపీ నేతలు కోట్లు సంపాదించారని… వైసీపీ నేతలు చాలా కాలంగా ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. ఆ కారణంగానే… అధికారంలోకి రాగానే.. ఇసుక విధానాన్ని రద్దు చేశారు. ప్రస్తుతం.. కొత్త ఇసుక విధానాన్ని ఖరారు చేయలేదు. పరిమితంగా మాత్రమే రీచ్‌లకు అనుమతి ఇచ్చారు. అయితే అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో.. అసలు ఇసుక అక్రమ తవ్వకాలు లేవంటూ… నేరుగా ఎన్జీటీలోనే ఏపీ ప్రభుత్వం వాదించడం ఆసక్తి కలిగిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

టీడీపీ కూటమికి వంగవీటి రాధా విస్తృత ప్రచారం !

ఎన్డీఏ కూటమి తరపున స్టార్‌ క్యాంపెయినర్‌ రంగంలోకి దిగారు వంగవీటి రాధా. గతంలో కాంగ్రెస్, PRP, వైసీపీ నుంచి పోటీ చేసిన ఆయన ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉన్నారు....

కల్లాల్లో ధాన్యం… రైతుల కళ్లల్లో దైన్యం

తెలంగాణలో కురిసిన అకాల వర్షం రైతులను కన్నీరుపెట్టిస్తోంది. కోతలకు వచ్చిన ధాన్యం తడిసిపోయిందని కొందరు, కల్లాల్లోకి వచ్చిన ధాన్యం పూర్తిగా తడిసిపోయిందని మరికొందరు ఆవేదన చెందుతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలించాలనుకున్న ఈ...

ఇళ‌య‌రాజాకు ఇంకా ఈ వ్యామోహం ఎందుకు?

ఇళ‌య‌రాజా స్వ‌ర‌జ్ఞాని. సంగీత బ్ర‌హ్మ‌. ఆయ‌న అభిమాని కానివారంటూ ఉండ‌రేమో..?! ఆయ‌న్ని దేవుడిగా ఆరాధిస్తారు అభిమానులు. ఇంత గొప్ప ఇళ‌య‌రాజాకు `కాపీ రైట్స్`పై మ‌మ‌కారం ఎక్కువైపోతోంది. త‌న పాట ఎవ‌రు పాడినా, వాడుకొన్నా.....

హీరోయిన్ల నెత్తిమీద `పాన్ ఇండియా` కిరీటం

పాన్ ఇండియా హీరోలు పాన్ ఇండియా సినిమాలూ ఉన్న‌ప్పుడు.. పాన్ ఇండియా హీరోయిన్లూ ఉంటారు. ఉన్నారు కూడా. అదే గుర్తింపుతో సినిమాల్ని చేజిక్కించుకొంటున్న‌వాళ్లూ, ఆ పేరు చెప్పి పారితోషికాన్ని గ‌ట్టిగా గుంజుతున్న‌వాళ్ల గురించే ఈ క‌థ‌నం. ప్ర‌స్తుతం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close