అన్ని అలాంటివే వస్తున్నాయట

మధుశాలిని తెలుగులో అల్లరి నరేష్ కితకితలు సినిమాలో రెండో హీరోయిన్ గా నటించింది. ఇప్పుడు ఏకంగా లోకనాయకుడు కమల్ హాసన్ తో చీకటి రాజ్యం సినిమాలో నటించి అందరి మెప్పు పొందుతుంది. సినిమాలో మధుశాలిని కమల్ తో చేసిన లిప్ లాక్ సన్నివేశాలు ఇప్పుడు కోలీవుడ్లో టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాయి. అయితే కమల్ లాంటి సీనియర్ హీరోతో నటించే ఛాన్స్ రావడమే గొప్ప అవకాశం కాబట్టి సినిమాలో మధు రెచ్చిపోయింది. సినిమాలో కమల్ తో రెండు లిప్ లాక్ సీన్లలో నటించిన మధుశాలిని చీకటి రాజ్యంతో మంచి మార్కులే కొట్టేసింది.

అయితే ఈ సినిమా వల్ల ఎంత పేరొచ్చిందే అంతే బాధ పడుతుంది అమ్మడు. అదేంటి సినిమా పర్వాలేదనిపించుకుంది కదా మరి ఎందుకు మధుశాలిని బాధపడటం అని అనుకోవచ్చు. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఆమె ముద్దులాటని మెచ్చిన కొందరు తమిళ దర్శక నిర్మాతలు మేము ఛాన్స్ ఇస్తాం కాని మా సినిమాల్లో కూడా లిప్ లాక్ సీన్లలో నటిస్తావా అని అడుగుతున్నారట.

వచ్చింది కమల్ సినిమా ఛాన్స్ వదులుకోవడం ఎందుకని ఆయనతో ముద్దు సన్నివేశాల్లో నటించిన అమ్మడికి ఇక నుండి అలాంటి సీన్లు ఉన్న సినిమాలే వస్తున్నాయట. అంతేకాదు ఇంకొంతమంది దర్శక నిర్మాతలు బోల్డ్ గా కూడా నటిస్తావా అని ఓపెన్ గా అడుగుతున్నారట. పోనీలే ఇలాగైనా క్రేజ్ తెచ్చుకున్నా మధుశాలిని ఈ ఇమేజ్ ని అసలు జీర్ణించుకోలేకపోతుందట. ఇప్పటి వరకు కేవలం మంచి పాత్రలే చేసుకుంటూ వచ్చిన ఈ అమ్మడికి ఇలాంటి ఆఫర్లు రావడంతో బ్యూటీ కొద్దిగా షాక్ లో ఉందని కోలీవుడ్ మీడియా హడావిడి చేస్తుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close