మాగుంట బెయిల్ రద్దు – అవినాష్‌కి…

వైసీపీకి చెందిన ఇద్దరు ఎంపీలకు బెయిల్ టెన్షన్ పట్టి పీడిస్తోంది. ఓ ఎంపీ తన కుమారుడు బెయిల్ రద్దు అయిపోతుందేమోనని కంగారు పడిపోయారు. ఆయన భయానికి తగ్గట్లుగానే బెయిల్ రద్దు అయింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మాగుంట రాఘవ తన అమ్మమ్మకు బాగో లేదని.. ఆమెను చూసుకోవాలని చెప్పి రెండు వారాల మధ్యంతర బెయిల్ ను ఢిల్లీ హైకోర్టు నుంచి తెచ్చుకున్నారు. అయితే ఈడీ వెంటనే సుప్రీంకోర్టుకు వెళ్లింది. అయితే సుప్రీంకోర్టు మాత్రం బెయిల్ రద్దు చేసేసింది. పన్నెండో తేదీన సరెండర్ కావాలని ఆదేశించింది.

తాను లిక్కర్ స్కాంలో జైల్లో ఉంటే.. మాగుంట రాఘవ భార్య ఆత్మహత్యాయత్నం చేసిందని ఆయన తరపు లాయర్లు కోర్టులో చెప్పుకున్నా ప్రయోజనం లేకపోయింది. మరో అవినాష్ రెడ్డికి మాత్రం ఇంకా బెయిల్ రద్దు టెన్షన్ కొనసాగుతోంది. వివేక హత్య కేసులో సునీత దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు తీసుకుంది. దీనిపై మంగళవారం విచారణ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఈ కేసులో అవినాష్‌ రెడ్డికి ముందస్తు బెయిల్‌ ఇవ్వడంపై పిటిషన్ వేశారు సునీత.

వివేక హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి ప్రధాన కుట్రదారుడని సుప్రీంకోర్టుకు తెలిపారు సునీత తరఫున న్యాయవాది. అలాంటి వ్యక్తికి ముందస్తు బెయిల్ ఇవ్వడం సరికాదని చెప్పారు. మీడియాలో వచ్చిన స్టోరీలు ఆధారంగా హైకోర్టు ఆయనకు బెయిల్ ఇచ్చిందని తెలిపారు. వివేకా హత్య కేసు విచారణకు అడుగడుగునా అవినాష్ రెడ్డి అడ్డుకుంటున్నారని వాదించారు సునీత తరఫున న్యాయవాది. స్థానిక ప్రభుత్వం కూడా ఆయనకు మద్దతు ఇస్తోందని అన్నారు. సీబీఐ విచారణ జరగకుండా ఆటంకాలు సృష్టిస్తున్నారని తెలిపారు. ఏప్రిల్‌్ 24 తర్వాత నాలుగు సార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ అవినాష్ రెడ్డి విచారణకు వెళ్లలేదని గుర్తు చేశారు. సునీత పిటిషన్‌ను విచారణకు తీసుకున్న సుప్రీంకోర్టు విచారణ మంగళవారం చేపట్టబోతున్నట్టు వెల్లడించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

నన్ను ఓ పావుగా వాడుకుంటున్నారు: పూనమ్ కౌర్ ఆవేదన

నటి పూనమ్ కౌర్ ఈమధ్య కాలంలో చేసిన ట్వీట్స్ వైరల్ అయ్యాయి. రాజకీయ దుమారం రేపాయి. పూనమ్ ఓ పార్టీలో చేరబోతుందని, ఆ పార్టీకి అనుకూలమైన ట్వీట్స్ చేస్తోందని కొన్ని కథనాలు వచ్చాయి....

మంగళవారం సుప్రీంకోర్టులో చంద్రబాబు పిటిషన్‌ మెన్షన్ !

స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ కేసులో తనపై అక్రమంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి, రిమాండ్ కు తరలించారని.. రిమాండ్ ను కొట్టి వేయాలని చంద్రబాబు దాఖలు చేసుకున్న పిటిషన్ ను మంగళవారం ధర్మాసనం ముందు...

ప్ర‌వీణ్ స‌త్తారు… మిష‌న్ త‌షాఫి!

చంద‌మామ క‌థ‌లు, గ‌రుడ‌వేగ చిత్రాల‌తో ఆక‌ట్టుకొన్నాడు ప్ర‌వీణ్ స‌త్తారు. ఆయ‌న్నుంచి వ‌చ్చిన ఘోస్ట్, గాండీవ‌ధారి అర్జున నిరాశ ప‌రిచాయి. ఇప్పుడు ఆయ‌న‌.. ఓ వెబ్ సిరీస్‌తో బిజీగా ఉన్నారు. అదే.. మిష‌న్ త‌షాఫీ....

ఈవారం బాక్సాఫీస్‌: ముక్కోణ‌పు పోటీ

గ‌త‌వారం బాక్సాఫీసు కొత్త సినిమాల్లేక వెల‌వెల‌పోయింది. `స‌ప్త సాగ‌రాలు దాటి` అనే ఓ డబ్బింగ్ సినిమా వ‌చ్చింది కానీ, ఎలాంటి ప్ర‌భావం చూపించ‌లేక‌పోయింది. ఈసారి... ఏకంగా మూడు క్రేజీ సినిమాలు విడుద‌ల‌కు సిద్ధ‌మ‌య్యాయి....

HOT NEWS

css.php
[X] Close
[X] Close