రివ్యూ: టక్కర్

Takkar Movie Review

తెలుగు360 రేటింగ్ : 2/5

సిద్ధార్థ్ ప్రతిభ గల నటుడు. ఆయనకి విజయాలు కూడా వచ్చాయి.‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’, ‘బొమ్మరిల్లు’ సినిమాలతో తెలుగులో చాలా క్రేజీ ని తెచ్చుకున్నాడు. ఐతే విజయాలని కొనసాగించడంలో ఇబ్బంది ఎదురైయింది. కొన్ని వరుస పరాజయాలు వచ్చాయి. తర్వాత సినిమాలు కూడా తగ్గాయి. ఎన్నో అంచనాలు పెట్టుకొని తెలుగులో రీఎంట్రీ అనుకున్న ‘మహాసముద్రం’ సినిమా కూడా నిరాశపరిచింది. ఇప్పుడు ‘టక్కర్’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ సినిమా సిద్ధార్థ్ కోరుకునే విజయాన్ని ఇచ్చిందా? టక్కర్ సిద్దుని మళ్ళీ ఫామ్ లోకి తీసుకొచ్చిందా?

గుణశేఖర్ అలియాస్ గున్స్( సిద్ధార్థ్) ది ఓ పేద కుటుంబం. ఉండటానికి మంచి ఇల్లు లేదు. కనీసం బాత్ రూమ్ కి డోర్ కూడా వుండదు. తన పేదరికంపై తనకే చిరాకు కోపం ఉక్రోషం. ఎలాగైనా డబ్బు సంపాయించి ధనవంతుడు కావాలని వైజాగ్ వస్తాడు గున్స్. ఓ ఖరీదైన బెంజ్ కారుకి డ్రైవర్ గా చేరుతాడు. అనుకోకుండా ఆ కారు ప్రమాదానికి గురై దెబ్బతింటుంది. దీంతో ఆ యజమాని గున్స్ ని చితకబాది, ఏడేళ్ళు జీతం లేకుండా తన వద్ద పని చేయాలని అగ్రీమెంట్ రాయించుకుంటాడు. దీంతో జీవితంపై విరక్తి చెందిన గున్స్ ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నిస్తాడు. కానీ ధైర్యం సరిపోదు. దీంతో ఆ సిటీలో ఓ పేరు మోసిన రౌడీ రాజ్(అభిమన్యు సింగ్) గ్యాంగ్ తో గొడవ పెట్టుకుంటే వాళ్ళే చంపేస్తారని ప్లాన్ చేసి.. రాజ్ గ్యాంగ్ పైకి వెళ్తాడు. వాళ్ళ మధ్య జరిగిన గొడవలో సడన్ గా గున్స్ కి ఎక్కడలేని ధైర్యం వస్తుంది. రౌడీలందరినీ చితకబాది అక్కడ వున్న పాత బెంజ్ కారుని తీసుకొచ్చేస్తాడు. ఐతే అదే కారులో లక్కీ (దివ్యాంశ కౌశిక్)ని కిడ్నాప్ చేసి డిక్కీలో దాచుంటారు. అసలు లక్కీ ఎవరు ? ఆమెను ఎందుకు కిడ్నాప్ చేశారు? గున్స్ కి అంత సడన్ గా రౌడీలని కొట్టే బలం ఎలా వచ్చింది ? లక్కీ, గున్స్ జీవితంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి ? ధనవంతుడు కావాలని మొదలుపెట్టిన గున్స్ ప్రయాణం చివరకు ఏ తీరాలకు చేరింది ? అనేది మిగతా కథ.

తన పేదరికంపై విరక్తి చెంది ఎలాగైనా ధనవంతుడు కావాలనుకున్న ఓ కుర్రాడి కథ ఇది. దర్శకుడు సినిమాని ఈ కోణంలో మొదలుపెట్టాడు. గున్స్ పరిచయం, తన పేదరికం, డబ్బు సంపాయించాలానే తన లక్ష్యం.. ఇవన్నీ ఆరంభంలో కథని ముందుకు తీసుకెళ్తాయి. కిడ్నాపర్స్ ని తప్పించడాని గన్స్ ఓ డీల్ చేసుకోవడం, తర్వాత వచ్చిన చేంజింగ్ యాక్షన్ సీక్వెన్స్ ని బాగా తీశారు. ఈ సీక్వెన్స్ హాలీవుడ్ సినిమా ‘బేబీ డ్రైవర్’ ని గుర్తుకు తెచ్చినప్పటికీ స్క్రీన్ పై చూడటానికి బావుంటుంది. ఈ సీన్ తో సినిమాపై ఆసక్తి పెరుగుతుంది. ఐతే ఆ ఆసక్తిని కొనసాగించడంలో మాత్రం దర్శకుడు పూర్తిగా తడబడిపోయాడు. కారు ద్వంసమవ్వడం, ఓ చైనీస్ విలన్ చేతిలో హీరో దెబ్బలు తినడం, చనిపోవడానికి రౌడీలని ఆశ్రయించడం.. ఇవన్నీ చాలా పేలవంగా వచ్చాయి.

ఇక సెకండ్ హాఫ్ లో టక్కర్ పూర్తిగా గాడి తప్పేస్తుంది. ధనవంతుడు కావాలని లక్ష్యం మొదలైన గున్స్ ఎలాంటి లక్ష్యం లేకుండా దొంగలించిన కారుతో రోడ్లపై తిరుగుతుంటాడు. తోడుగా ఓ ప్రేమ కథ మొదలౌతుంది. ఐతే ఆ ప్రేమ కథ ఎలాంటి ఫీలింగ్ ని ఇవ్వదు. డబ్బులు వుంటే చాలు జీవితం హాయిగా వుంటుందనుకునే ఓ అబ్బాయి, జీవితంలో డబ్బుకి మించినది ఎదో వుందని భావించే అమ్మాయికి మధ్య జరిగే ఓ ప్రేమ కథ చెప్పాలని దర్శకుడు ఈ ట్రాక్ రాసుకున్నాడేమో కానీ.. ఈ ప్రేమకథ ఎంతమాత్రం హత్తుకోదు. నిజానికి సెకండ్ హాఫ్ లో నడపడానికి కథే లేదు. కారుని వెంబడించే రాజ్ గ్యాంగ్, గున్స్ ని పట్టుకోవాలనుకునే చైనీస్ గ్యాంగ్.. ఈ గొడవే తప్పితే ఊహించని మలుపు కానీ అనూహ్యమైన పాత్ర గానీ ఏదీ వుండదు.
విలన్ బ్యాచ్ తో చేయాలనుకున్న కామెడీ కూడా తేలిపోయింది. నిజానికి లక్కీ సేవ్ చేయడంతోనే ఈ కథ అయిపోతుంది. కానీ మరో ఇరవై నిముషాలు ప్రేమ, పెళ్లి పేరుతో సాగదీశారు. పోనీ ఆ ప్రేమకథలో ఏదైనా కొత్తదనం ఉందా అంటే లేదు. చివరికి రెగ్యులర్ ముగింపే.

సిద్దార్థ్ నటన గురించి ఇప్పుడు కొత్తగా చెప్పడానికి ఏమీ లేదు. ఏ పాత్ర చేసిన దానికి న్యాయం చేస్తాడు. ఇందులో చేసిన గున్స్ పాత్రలో కూడా తన ముద్ర వేశాడు. మొదట్లో మాసీగా కనిపిస్తాడు. తన లుక్ కూడా కొత్తగా వుంది. ఐతే సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి మళ్ళీ లవర్ బాయ్ రూట్ లోకి రావడం రొటీన్ గా అనిపిస్తుంది. ఇది దర్శకుడు ఆ పాత్రని తీర్చిదిద్దిన విధానంలోని లోపమే. దివ్యాంశ కౌశిక్ గ్లామరస్ గా కనిపించింది. ఐతే ఆమె పాత్రని చాలా వెరైటీగ డిజైన్ చేయబోయే కన్ఫ్యూజ్ గా డిజైన్ చేసినట్లు కనిపిస్తుంది. తను ఫెమినిస్ట్ అంటుంది. తన ముక్కు పగలగొట్టిన వ్యక్తితోనే మళ్ళీ పెళ్లికి రెడీ అవుతుంది. గున్స్ ని ప్రేమించానని చెబుతుంది. మళ్ళీ అయోమయంగా డబ్బు తీసుకొని వెళ్ళిపోమని చెబుతుంది. ఆ పాత్ర అంత తికమకగా వుంటుంది. అభిమన్యు సింగ్ పాత్ర రొటీన్ గానే వుంది. యోగి బాబు టైమింగ్ వున్న నటుడు. యోగి బాబు కామెడీ పండాలంటే డబ్బింగ్ చాలా ముఖ్యం. ఇందులో రచ్చ రవితో డబ్బింగ్ చెప్పించారు. అది సరిగ్గా కుదరలేదు. ‘వరుణ్ డాక్టర్’ యోగిబాబు కామెడీ డిక్షన్ తో సహా పండింది. అలాంటి వాయిస్ ఏదో ఉండాల్సింది. గున్స్ ఫ్రండ్ గా చేసిన నటుడు కాసేపు నవ్విస్తాడు. మిగతా అందరూ దాదాపు తమిళ నటులే. కొన్ని పాత్రలు రిజిస్టర్ కూడా కావు.

సాకేంతికంగా సినిమా ఓకే అనిపిస్తుంది. కెమరాపనితనం డీసెంట్ గా వుంది. పాటలు రిజిస్టర్ కావు. నిజానికి అన్ని పాటలు కూడా అనవసరం. సెకండ్ హాఫ్ లో ఎడిటింగ్ ఇంకా షార్ఫ్ గా ఉండాల్సింది. దర్శకుడు కార్తీక్ జి. క్రిష్ .. ధనవంతుడు కావాలనుకుని ప్రయాణం మొదలుపెట్టిన ఓ కుర్రాడి కథ చెప్పాలని .. ఈ కథని మొదలుపెట్టాడు. ఐతే సినిమా మధ్యలో వచ్చేసరికి లక్ష్యం పక్కదారి పట్టేస్తుంది. దీంతో రూట్ మ్యాప్ లేని ప్రయాణంలా అయోమయంగా తయారైయిందీ సినిమా.

తెలుగు360 రేటింగ్ : 2/5

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒక ఆదర్శ ముఖ్యమంత్రిని ఇంత అన్యాయంగా అరెస్ట్ చేస్తారా ?!

''74 సంవత్సరాలు ఉన్న ఒక ఆదర్శ ముఖ్యమంత్రిని ఇంత అన్యాయంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం దుర్మార్గం'' అన్నారు సీనియర్ నటుడు మురళీ మోహన్. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్ట్ పై కాస్త...

‘అన్నాయ్‌..’ ఆశ‌లు పోయినాయ్‌!

శ్రీ‌కాంత్ అడ్డాల డ్రీమ్ ప్రాజెక్ట్ `అన్నాయ్‌`. ఇద్ద‌రు స్టార్ హీరోలతో మ‌ల్టీస్టార‌ర్ సినిమాగా తీర్చిదిద్దాల‌న్న‌ది త‌న ప్ర‌య‌త్నం. క‌థ కూడా రెడీ. గీతా ఆర్ట్స్ లో ఈ క‌థ వినిపించారాయ‌న‌. కాక‌పోతే.. బ్ర‌హ్మోత్స‌వం...

అప్పుడు చెల్లాయి.. ఇప్పుడు అమ్మాయి

'వీరసింహరెడ్డి'లో సిస్టర్ ఎమోషన్ ని బలంగా నమ్మాడు దర్శకుడు గోపీచంద్ మలినేని. సినిమాకి ప్రధాన ఆకర్షణగా వున్న పెద్ద బాలయ్య పాత్రని ఇంటర్వెల్ లోనే ముగించి చాలా పెద్ద సాహసమే చేశారు. ఈ...

మెగా 156.. ఆగని రూమర్స్

చిరంజీవి నుంచి ఒకేసారి రెండు సినిమా ప్రకటనలు వచ్చాయి. వశిష్ట దర్శకత్వంలో యువీ క్రియేషన్స్ నిర్మిస్తున్న చిత్రం ఒకటి. మరొకటి మెగాడాటర్ సుస్మిత నిర్మించబోతున్న సినిమా. ఇది మెగాస్టార్ కి 156 చిత్రం....

HOT NEWS

css.php
[X] Close
[X] Close