నల్లగొండ రివ్యూ : సీట్ల పీటముడి విడిపోయేదెప్పుడు..?

నల్లగొండ జిల్లాలో … టీఆర్ఎస్ రెండు అసెంబ్లీ సీట్లలోనే అభ్యర్థుల్ని ప్రకటించాల్సి ఉంది. కానీ.. ప్రజాకూటమిలో పొత్తుల వ్యవహారం మాత్రం ఇప్పటి వరకూ తేలలేదు. ఉమ్మడి జిల్లాలోని దేవరకొండ, మునుగోడు స్థానాలను గట్టిగా కోరుతున్న సీపీఐ అందుకు అనుగుణంగానే ఈ రెండు నియోజకవర్గాల్లో రోడ్‌షో, ద్విచక్ర వాహన ర్యాలీలతో ప్రచారాన్ని మొదలు పెట్టారు. మునుగోడు నియోజకవర్గంలో ప్రచారాన్ని సీబీఐ నేత వెంకట్‌రెడ్డి జోరుగా నిర్వహిస్తున్నారు. కోదండరాం నేతృత్వంలోని తెలంగాణ జన సమితి ఉమ్మడి జిల్లాలోని మిర్యాలగూడ, సూర్యాపేటలు ఇవ్వాలని గట్టిగా పట్టుపడుతోంది. కనీసం మిర్యాలగూడ స్థానాన్ని తమకు కేటాయించాలని డిమాండ్ చేస్తోంది.

పార్టీలో టిక్కెట్‌ ఆశించి భంగపడిన నేతలంతా తెరాసను వీడి కాంగ్రెస్‌లో చేరుతున్నారు. ఇప్పటికే జడ్పీ ఛైర్మన్‌, దేవరకొండ నియోజకవర్గ టిక్కెట్‌ ఆశిస్తున్న బాలునాయక్‌ కాంగ్రెస్‌లో చేరగా.. తాజాగా మిర్యాలగూడ టీఆర్ఎస్ నేత, గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిపోయిన అలుగుబెల్లి అమరేందర్‌రెడ్డి బుధవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో జానారెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. బేషరుతుగానే కాంగ్రెస్‌లో చేరుతున్నానని ప్రకటించినా సామాజిక సమీకరణాల దృష్ట్యా జానారెడ్డి ఆశీర్వాదంతో మిర్యాలగూడ టిక్కెట్‌ వస్తుందనే ఆశలో ఆయన ఉన్నారు. పార్టీ అధిష్ఠానం ఒక కుటుంబానికి ఒక టిక్కెట్‌ అని స్పష్టం చేసిన దృష్ట్యా ఊహించని పరిణామాల నేపథ్యంలో ఆయన బరిలో ఉండొచ్చనే అభిప్రాయం అక్కడి పార్టీ కార్యకర్తల్లో నెలకొంది. నల్గొండ నియోజకవర్గానికి చెందిన కొంత మంది గులాబీ శ్రేణులు సైతం మరికొన్ని రోజుల్లో హస్తం గూటికి చేరవచ్చని ప్రచారం జరుగుతోంది.

తొలిసారి ఒంటరిగా పోటీ చేస్తున్న భాజపా తొలి విడతలో మునుగోడు, సూర్యాపేట అభ్యర్థులను ప్రకటించింది. తొలి దశలోనే తన అభ్యర్థిత్వం ఖరారు చేస్తారని అంతా ఊహించిన భువనగిరి సెగ్మెంటులో జిల్లా అధ్యక్షుడు శ్యాంసుందర్‌ పేరు ప్రకటించకపోవడంతో ఆయన కొంత నైరాశ్యంలో మునిగిపోయారు. ఈనెల 28న హైదరాబాద్‌లో భారీ బహిరంగసభ నిర్వహిస్తుండటం దానికి పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా హాజరవుతుండటంతో ఆలోపు లేదా ఆ పర్యటన ముగిసిన అనంతరం రెండో జాబితా వెలువడుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జిల్లాలోని నకిరేకల్‌ స్థానానికి అత్యధికులు పార్టీ టిక్కెట్‌ కోసం దరఖాస్తు చేసుకోగా…నల్గొండ స్థానం నుంచి పార్టీ కిసాన్‌ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గోలి మధుసూదన్‌రెడ్డి పోటీ పడనున్నట్లు తెలిసింది.

నాలుగు సిట్టింగ్‌ స్థానాలతో పాటు ఆలేరు, సూర్యాపేట, భువనగిరి, మిర్యాలగూడల్లో కాంగ్రెస్‌ నాయకులు చిన్నచిన్న సభలు నిర్వహించి ప్రచారాన్ని మొదలుపెట్టారు. మిర్యాలగూడ, ఆలేరుల్లో టీడీపీ ఆశావహులు ఇంటింటి ప్రచారం మొదలుపెట్టారు. మొత్తమ్మీద పన్నెండు స్థానాల్లో దాదాపు నాలుగు నుంచి ఐదు స్థానాలు మహాకూటమి పొత్తుల్లో భాగంగా తమకు కేటాయించాలని టీడీపీ, సీపీఐ, టీజేఎస్ కోరుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బిగ్ బాస్ – 4 వాయిదా?

బిగ్ బాస్ రియాలిటీ షో.. తెలుగులోనూ సూప‌ర్ హిట్ట‌య్యింది. ఎన్టీఆర్‌, నాగార్జున‌, నాని లాంటి హోస్ట్ లు దొర‌క‌డంతో బిగ్ బాస్ కి తెలుగు ఆన‌ట ఆద‌ర‌ణ ద‌క్కింది. ఇప్పుడు నాలుగో సీజ‌న్...

చిరంజీవి ని కలవడం పై వివరణ ఇచ్చిన సోము వీర్రాజు

ఆంధ్రప్రదేశ్ బిజెపి అధ్యక్షుడిగా ఈరోజు అధికారికంగా పగ్గాలు చేపట్టారు సోము వీర్రాజు. పార్టీని 2024లో అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేస్తానని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సందర్భంలో విలేకరులతో మాట్లాడుతూండగా, ఇటీవల చిరంజీవిని...

జగన్ “స్టే” ఆశల్ని వమ్ము చేసిన తప్పుల పిటిషన్..!

మూడు రాజధానుల బిల్లుల అమలుపై హైకోర్టు ఇచ్చిన స్టేటస్‌కోపై స్టే తెచ్చుకుందామనుకున్న ఏపీ సర్కార్‌కు.. కాలం కలసి రావట్లేదు. సుప్రీంకోర్టులో పిటిషన్లు వేస్తున్న ఏపీ ప్రభుత్వ న్యాయ నిపుణులు తప్పుల తడకలుగా వేయడంతో.....

మాకు మహానగరాల్లేవ్.. సాయం చేయండి : జగన్

కేంద్రం నుంచి సాయం పొందాలంటే.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసే విజ్ఞప్తులు కాస్త భిన్నంగా ఉంటాయి. కరోనా వైరస్ ఎక్కువ ప్రభావం చూపుతున్న పది రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోడీ వీడియో...

HOT NEWS

[X] Close
[X] Close