జగన్ గాయాన్ని పెద్దది చేసి ఏం సాధించాలనుకున్నారు..?

హాఫ్ సెంటిమీటర్.. అంటే… ముల్లు గుచ్చుకున్నంత కూడా కాదు. బియ్యం గింజ ..అదీ కూడా.. బాస్మతి బియ్యం కాదు.. మామూలు బియ్యం గింజ అంత గాయం. విశాఖ ఎయిర్‌పోర్టులో జగన్‌కు సానుభూతి తేవాలని.. తను త్యాగం అయిపోవడానికి సిద్ధపడ్డ వీరాభిమాని చేసిన గాయంతో.. జగన్ అయిన గాయం…కచ్చితంగా అంతే. దానికి విశాఖ ఎయిర్‌పోర్టులో ప్రాథమిక చికిత్స చేసి… యాంటిబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్ ఇచ్చి పంపేశారు. అంటే.. అది అసలు గాయమే కాదు. కానీ.. విచిత్రంగా హైదరాబాద్‌కు వెళ్లేసరికి….ఆ గాయం సెంటిమీటరున్నర అయింది. లోపలికి దిగబడిపోయింది. అక్కడ నరాలకు తాకింది. ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. చివరికి తొమ్మిది కుట్లు వేయాల్సి వచ్చింది. ఇప్పుడే చెప్పలేము.. మరో రోజు ఆగాల్సిందే అన్నట్లుగా డాక్టర్ శివారెడ్డి మీడియా ముందు అద్భుతంగా వల్లించిన హెల్త్ రిపోర్ట్ చూసి… చాలా మందికి మైండ్ బ్లాంక్ అయిపోయింది.

అంత పెద్ద గాయం జగన్ కు అయితే.. అలా అభివాదాలు చేసుకుంటూ.. ఆశీర్వాదాలు ఇచ్చుకుంటూ.. జగన్ విశాఖ నుంచి హైదరాబాద్ ఎలా వచ్చాడన్నది పెద్ద మిస్టరీ. ఈ మిస్టరీ వెనుక అసలు కథేమిటో చాలా మందికి క్లారిటీ ఉంది. జగన్ మోహన్ రెడ్డి.. విశాఖలో ఫ్లైట్ ఎక్కగానే.. ఢిల్లీలో స్క్రిప్ట్ రెడీ అయిపోయిందని టీడీపీ నేతలు చెబుతున్నారు. దాని ప్రకారం.. ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా.. హాస్పిటల్ కు వెళ్లాలి. అక్కడ డాక్టర్లు చేయాల్సిన సీన్ క్రియేట్ చేస్తారు. ఈ లోపు.. ఏపీలో.. క్షేత్ర స్థాయిలో కొన్ని గుంపులు చేయాల్సిన పనులు చేస్తాయి. ఇక ఢిల్లీలో ఉన్నవాళ్లు.. దానికి సంబంధించి కొనసాగింపుగా చేపట్టాల్సిన చర్యలను అప్పటికే రెడీ చేస్తారు. ఈ వ్యవహారం మొత్తం జగన్ అలా హాస్పిటల్‌లో పడుకుని ఉండగానే సాగిపోవాలనుకున్నారు. అందుకే… లేని గాయాన్ని ఉన్నట్లుగా… చూపించి.. ఆపరేషన్లు, కుట్లు అంటూ హడావుడి చేశారనేది వైసీపీ తీరుపై వస్తున్న ప్రధాన ఆరోపణ.

నిజానికి ఆలంటి ప్లానే జరిగి ఉంటే.. అది చాలా తీవ్రమైన విషయం. రాజకీయ ప్రయోజనాల కోసం.. ఏపీని రావణకాష్టంగా మార్చే కుట్ర జరిగిందన్న విషయం మాత్రం స్పష్టమవుతోంది. ఈ విషయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా తప్పిదం చేశారు. తను కావాలని.. గాయం పెద్దది కాకపోయినా.. నాటకం ఆడినట్లు స్పష్టమవుతోంది. ఆయన.. తన పార్టీ శ్రేణులను రెచ్చగొట్టి.. ఏదో చేయించాలని తాపత్రయ పడ్డ విషయం మాత్రం స్పష్టమవుతోంది. ఓ బాధ్యత యుతమైన ప్రతిపక్ష నాయకుడుచేయాల్సిన పని మాత్రం అది కాదున్నది చాలా మంది అభిప్రాయం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ విషయంలో విచారణకు ఆదేశించిన నిమ్మగడ్డ..!

స్టేట్ ఎలక్షన్ కమిషన్ కార్యాలయంలో చేసిన వాస్తు మార్పులపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ సీరియస్ అయ్యారు. ఎవరు చెబితే ఆ మార్పులు చేశారో తనకు తెలియాలంటూ..విచారణకు ఆదేశించారు. నిమ్మగడ్డ తన ఆఫీసులో జరిగిన...

అమరావతిని కొనసాగిస్తే పదవుల్ని ఇచ్చేస్తాం..! జగన్‌గు చంద్రబాబు ఆఫర్..!

అమరావతిని ఏకైక రాజధాని కొనసాగిస్తూ... ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే... తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ పదవులను వదిలేస్తామని ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు.. ముఖ్యమంత్రి జగన్‌కు బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఎన్నికలకు ముందు...

జేసీ ప్రభాకర్ రెడ్డికి ఎట్టకేలకు బెయిల్..!

జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డికి ఎట్టకేలకు బెయిల్ లభించింది. అచ్చెన్నాయుడుని అరెస్ట్ చేసిన తర్వాతి రోజే...అంటే జూన్ 13న హైదరాబాద్‌లో వారిని అరెస్టు చేసిన పోలీసులు అనంతపురంకు తరలించారు....
video

క‌ల‌ర్ ఫొటో టీజ‌ర్‌: బ్లాక్ అండ్ వైట్ కాంబో

https://www.youtube.com/watch?v=T-R3h9va2j4&feature=emb_title ప్రేమ గుడ్డిది. చెవిటిది. మూగ‌ది కూడా. దానికి ప్రేమించ‌డం త‌ప్ప బేధాలు తెలీవు. న‌ల్ల‌ని అబ్బాయి.. తెల్ల‌ని అమ్మాయి ప్రేమించుకోవ‌డం కూడా వింతేం కాదు. కానీ.. మ‌ధ్య‌లోకి ఓ పులి వ‌చ్చింది....

HOT NEWS

[X] Close
[X] Close