సీబీఐ డైరక్టర్ వర్మేనట..! కేంద్రం యూటర్న్ తీసుకుందేంటి..?

రాత్రికి రాత్రి తనను సీబీఐ డైరక్టర్‌గా తప్పిస్తూ.. కేంద్రం తీసుకున్న నిర్ణయంపై అలోక్ వర్మ సుప్రీంకోర్టుకు వెళ్లారు. దానిపై నేడు విచారణ జరగనుంది. ఈ లోపే.. కేంద్రం పూర్తిగా యూటర్న్ తీసుకుంది. ఆలోక్‌ వర్మ, రాకేశ్‌ అస్థానా తమ పదవుల్లోనే కొనసాగుతారని సీబీఐ అధికార ప్రతినిధి ఓ ప్రకటన ేచశారు. తన అధికారాలను తొలగించి, తనను సెలవులపై పంపడాన్ని సవాల్‌ చేస్తూ ఆలోక్‌ వర్మ సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు దీనిపై నేడు విచారణ జరగనుంది. సీబీఐ స్వతంత్ర సంస్థ. ఆ సంస్థ ఉన్నతాధికారులను తొలగించడానికి.. ఏకపక్షంగా నియమించడానికి కేంద్రానికి అధికారం లేదు.

ఈ నేపధ్యంలోనే.. సుప్రీంకోర్టు నుంచి మొట్టి కాయలు వస్తాయన్న ఉద్దేశంతోనే వారు పదవుల్లోనే ఉన్నారన్న అధికారిక ప్రకటన చేసినట్లు ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. సీబీఐ అధికారులపై విచారణ జరుగుతున్న నేపథ్యంలో మీడియాలో వస్తున్న పలు కథనాలపై కూడా ఆ సంస్థ అభ్యంతరం తెలిపింది. ఆలోక్‌ వర్మను అధికారాల నుంచి తొలగించిన అనంతరం ఆయన కార్యాలయం నుంచి కొన్ని పత్రాలు మాయమయ్యాయంటూ, వాటిల్లో రఫేల్‌ ఒప్పంద అవినీతి పత్రాలు కూడా ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయని అవన్నీ అసత్య వార్తలని సీబీఐ పేర్కొంది. మరో వైపు … ఆలోక్‌వర్మ ఇంటిపై .. కేంద్ర ప్రభుత్వం పెద్ద స్థాయిలో నిఘా పెట్టింది. ఇలా నిఘా ఉన్న నలుగుర్ని …అలోక్ వర్మ భద్రతా సిబ్బంది పట్టుకున్నారు. ఢిల్లీలోని ఆయన ఇంటి చుట్టూ సంచరిస్తుండటంతో భద్రతా సిబ్బంది వారిని బంధించారు.

వారు అనుమానాస్పద వ్యక్తులు అనుకున్నారు కానీ.. వారు ఇంటలిజెన్స్ అధికారులు. వర్మ ఇంట్లోకి ప్రవేశించాలనుకున్న ఇద్దరు వ్యక్తులను అక్కడ ఉన్న భద్రతా సిబ్బంది బయటకు లాగేశారు. వారు నిఘా సంస్థ సిబ్బందని ఐబీ కూడా అంగీకరించింది. మొత్తానికి సీబీఐ విషయంలో కేంద్రం.. తప్పు మీద తప్పు చేసుకుంటూ వెళ్తోంది. ఈ రోజు సుప్రీంకోర్టు తీర్పు.. కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి భిన్నంగా వస్తే.. మోడీకి మరిన్ని చిక్కులు తప్పవు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డీజీపీకి యంత్రాంగం సహకరించడం లేదా ?

పోలింగ్ అనంతర హింసను అరికట్టడంలో డీజీపీకి పూర్తి స్థాయిలో యంత్రాంగం సహకరించడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ అంశంపై ఈసీకి కూడా ఫిర్యాదులు అందడంతో ఏపీ సీఎస్ తో పాటు...

టెన్షన్ లో వైసీపీ ఫైర్ బ్రాండ్స్..!!

ఏపీ ఎన్నికల ట్రెండ్స్ వైసీపీకి ఘోర పరాజయం తప్పదని తేల్చుతుండటంతో ఆ పార్టీ ఫైర్ బ్రాండ్స్ పరిస్థితి ఏంటన్నది ఆసక్తికర పరిణామంగా మారింది. హోరాహోరీ పోరులో గెలిచి నిలుస్తారా..? దారుణమైన పరాభవం చవిచూస్తారా..?...

సూర్య‌, కార్తి సినిమా… రౌడీ చేతుల్లో?!

విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా మైత్రీ మూవీస్‌ బ్యాన‌ర్‌లో ఓ సినిమా రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. 'టాక్సీవాలా' ఫేమ్ రాహుల్ సంకృత్య‌న్‌ ద‌ర్శ‌కుడు. ఇదో పిరియాడిక‌ల్ యాక్ష‌న్ డ్రామా. విజ‌య్ దేవ‌ర‌కొండ పుట్టిన రోజున...

2 శాతం ఎక్కువ – ఏపీ ఓటర్లలో చైతన్యం ఎక్కువే !

ఎవరికి ఓటేస్తారన్న విషయం పక్కన పెడితే ఎలాగైనా ఓటేయాలన్న ఓ లక్ష్యాన్ని ఓటర్లు ఖచ్చితంగా అందుకుంటున్నారు. అది అంతకంతకూ పెరిగిపోతోంది. 2014తో పోలిస్తే 2019లో ఒక్క శాతం పోలింగ్ పెరగ్గా 2019తో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close