“మహానటి” ఇప్పుడు ఎవరి నోట విన్నా ఈ సినిమా మాటే. సావిత్రి అంటే.. ఎంత ఉన్నతంగా ఊహించుకుంటారో… అంతకంటే.. పదింతలు ఎక్కువగా సినిమాను దృశ్యకావ్యంగా మలిచారు నాగ్ అశ్విన్. అందుకే ఇప్పుడు ఓవర్సీస్లోనే కాదు.. తెలుగు రాష్ట్రాల్లోనూ “మహానటి” మేనియానే. ఇలాంటి టాక్ వచ్చిన సినిమా ముందు..ఎంత సూపర్ స్టార్ సినిమా అయినా నిలబడటం అసాధ్యం. ఈ విషయంలో బాక్సాఫీస్ నిపుణులకు కూడా భిన్నాభిప్రాయాలు ఉండకపోవచ్చు.
“మహానటి” సినిమాకు వచ్చిన అసాధారణ టాక్‌తో..ముందుగా అల్లు అర్జున్ సినిమా ” నా పేరు సూర్య” పై తొలి దెబ్బ పడనుంది. ఇప్పటికే మిక్స్డ్ టాక్‌తో.. యావరేజ్ కలెక్షన్లతో ఉన్న ఈ సినిమా తొలి వారానికే చాప చుట్టేయాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే డ్రాప్ అయిపోయిన కలెక్షన్లను.. కొద్దిగా అయినా పెంచేలా పబ్లిసిటీ చేయగలిగితే…బయ్యర్లను సేఫ్ చేయాలనే ఆలోచన చేస్తున్నారు. అందుకే సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. దీనికి పవన్ కల్యాణ్‌ను ముఖ్య అతిధిగా పిలిచారు. ఎప్పుడూ లేని విధంగా పవన్ కల్యాణ్ కూడా రావడానికి అంగీకించారు. సక్సెస్ మీట్ ఈ రోజు జరగనుంది. కానీ ఈ లోపే మహానటి ప్రభంజనం ప్రారంభమయింది. ఇలాంటి పరిస్థితుల్లో పవన్ కల్యాణ్ వచ్చి.. ఎన్ని మాటలు చెప్పినా.. తేలిపోయిన సినిమాకు కలెక్షన్లు పెరుగుతాయా అంటే.. చెప్పలేమంటున్నారు… బాక్సాఫీస్ వర్గాలు.
మల్టిప్లెక్స్‌లలో మహానటి షోలు.. వారాంతాల్లో… అనూహ్యంగా పెరగబోతున్నాయి. వేరే సినిమాకు చోటు దక్కే అవకాశాలు కూడా కష్టమేనన్న అంచనాలున్నాయి. ఇలాంటి సమయంలో.. పూరి జగన్నాథ్ తన కుమారుడ్ని హీరోగా పెట్టి.. తీసిన… మెహబూబ్ పదకొండో తేదీన రిలీజ్ చేస్తున్నారు. షార్ప్ ట్రైలర్స్‌తో కొంత బజ్ క్రియేట్ చేసుకోగలినా.. సినిమాపై మాత్రం.. అంత గొప్ప.. ఎక్స్పెక్టేషన్స్ లేవు. ఇప్పుడు మహానటి తడాఖాతో… అసలు మెహబూబా… బాక్సాఫీస్ రాడార్లోకి వస్తుందా..అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి 28 ఏళ్ల కిందట… ఏ రోజైతే.. జగదేకవీరుడు – అతిలోక సుందరి సినిమాను రిలీజ్ చేసి ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారో.. ఇప్పుడు అదే రోజున మహానటిని రిలీజ్ చేసి.. అంతకు మించిన హిట్ కొట్టారు… అశ్వనీదత్ అండ్ డాటర్స్.. !