చైతన్య : టీటీడీ చైర్మన్ వ్యక్తి పూజ..! శ్రీవారి ప్రసాదానికి మహాపరాధం..!

ఒక్కటంటే.. ఒక్క క్షణం ఆ శ్రీనివాసుని దివ్య దర్శనం కోసం భక్తులు .. గంటలు గంటలు.. క్యూలో నిల్చుకుంటారు. ఆ దేవదేవుని ప్రసాదాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో కళ్లకు అద్దుకుని భక్తిభావంతో నోట్లో వేసుకుంటారు. ఏ శ్రీవారి భక్తుడూ.. ఆ ప్రసాదాన్ని కాళ్ల వద్ద పెట్టాలని కానీ.. కనీసం నేల మీద పెట్టాలన్న ఆలోచన కూడా రానీయడు. అలాంటి.. స్వామివారి సేవకే.. పరిమితమైన వారు.. అలాంటి పని చేయగలరా.. ? ప్రసాదాన్ని ఇతర వ్యక్తుల కాళ్ల వద్ద పెట్టగలరా..? లేక… ఇతర వ్యక్తులకు నైవేద్యంగా ఉంచగలరా..? శ్రీవారి సామాన్య భక్తులెవరూ అలాంటి పనులు చేయరు. కానీ టీటీడీ చైర్మన్ చేస్తారు. వైవీ సుబ్బారెడ్డి చేస్తారు. చేసి చూపించారు. ఇప్పుడీ వ్యవహారమే కలకలం రేపుతోంది.

శ్రీవారి ప్రసాదాన్ని కూడా చేత్తో అందుకోనంత ఎదిగిపోయారా స్వరూపానంద..!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి .. ఆ పార్టీ అధినేతకు.. స్వరూపానంద స్వామి రాజగురువుగా మారిపోయారు. ఇప్పుడు.. చాలా మంది ప్రభుత్వంతో పని చేయించుకోవాలనుకుంటే.. సిఫార్సుల కోసం… ఆ స్వామిజీ దగ్గరకే వెళ్తున్నారు. అలాంటిది.. ఇక వైసీపీ నేతలు వెళ్లకుండా ఉంటారా..? పెద్ద ఎత్తున వైసీపీ నేతలు.. స్వరూపానందను దర్శించుకుని… సేవ చేసుకుని కానుకలు సమర్పించుకుని వస్తున్నారు. ఈ క్రమంలో.. నెలన్నర కిందటే.. టీటీడీ చైర్మన్ పదవి పొందిన వైవీ సుబ్బారెడ్డి కూడా.. ఆయన సేవకు వెళ్లారు. ఉత్తినే వెళ్లలేదు. తనకు వచ్చిన పదవితో… దక్కే అధికారంతో… దండిగా శ్రీవారి ప్రసాదాలను.. కూడా తీసుకెళ్లారు. స్వరూపానందకు సమర్పించుకున్నారు. అయితే… స్వరూపానంద శ్రీవారి ప్రసాదాన్ని చేత్తో తీసుకోలేదు. కింద పెట్టించారు. తన పీఠం నుంచి ఆయన కదల్లేదు. కింద పెట్టమని సూచించారు. వైవీ సుబ్బారెడ్డికి అలా పెట్టడం… శ్రీవారిని అవమానించడం అన్నట్లుగా అనిపించలేదు.. ఆయన కింద పెట్టేశారు.

మహాప్రసాదాన్ని కాళ్ల వద్ద, కింద పెట్టకూడదని టీటీడీ చైర్మన్‌కి ఎవరైనా చెప్పాలా..?

శ్రీవారి ప్రసాదాన్ని ప్రముఖులకు అందివ్వడం తప్పు కాదు. అందరూ అదే చేస్తారు. కానీ.. ఏ ఒక్కరయినా.. ఇంత వరకూ… ఆ ప్రసాదాన్ని చేత్తో తీసుకోకుండా.. కింద పెట్టించిన సందర్భాలు లేవు. అలా.. ప్రసాదం తీసుకెళ్లిన వాళ్లు… కాళ్ల దగ్గర పెట్టిన సందర్భాలు అసలు లేవు. ఎందుకంటే.. శ్రీవారి ప్రసాదం పరమ పవిత్రం. సాక్షిత్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా .. అత్యంత భక్తి భావంతో… శ్రీవారి ప్రసాదాన్ని అందుకుంటారు. ఇక్కడ మాత్రం.. శ్రీవారి కన్నా.. తానే గొప్ప అని అనుకుంటున్నారేమో కానీ.. స్వరూపానంద మాత్రం… ఆ ప్రసాదాన్ని కూడా.. కింద పెట్టించేశారు.

స్వామి వారిని వదిలేసి వ్యక్తి పూజల్లో టీటీడీ చైర్మన్..!

స్వామి వారి సేవలో పునీతులు కావాల్సిన టీటీడీ చైర్మన్.. ఇలా వ్యక్తి పూజల కోసం.. ఊళ్లు పట్టుకు తిరగడం చాలా మందిని ఆశ్చర్య పరుస్తోంది. ఆయన టీటీడీ చైర్మన్ హోదాలో.. పెద్దలను పరిచయడం చేసుకోవడానికి.. ఢిల్లీ వెళ్లారు. తానిప్పుడు.. టీటీడీ చైర్మన్‌నని చెప్పుకుని… కేంద్రంలోని చాలా మంది పెద్దలను కలిసి ప్రసాదాలు ఇచ్చి పరిచయాలు పెంచుకుని వచ్చారు. ఈ తర్వాత రుషికేష్ వెళ్లి మరీ స్వరూపానందను కలిశారు. స్వరూపానంద ఏడాదికి నాలుగు నెలలు చాతుర్మాస దీక్ష పేరుతో రుషికేష్‌లో గడుపుతారు. ఆ సమయంలో… చాలా మందిని అక్కడికే పిలిపించుకుంటారు. మీడియా కవరేజీ వచ్చేలా చూసుకుంటారు. ఈ క్రమంలో వైవీ సుబ్బారెడ్డి కూడా వెళ్లి సేవించి వచ్చారు. టీటీటీ చైర్మన్‌గా శ్రీవారికి.. ఆయన భక్తులకు… ఇప్పటి వరకూ.. ఎంత సేవ చేశారో కానీ.. ఆ పదవి పేరుతో మాత్రం.. వ్యక్తి పూజ మాత్రం వైవీసుబ్బారెడ్డి చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

బస్సు యాత్ర : వైసీపీ రాంగ్ స్ట్రాటజీ

ఎన్నికల షెడ్యూల్ వచ్చినా నోటిఫికేషన్ రావడానికి సమయం ఉండటంతో...జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రను ప్లాన్ చేసుకున్నారు. ఇరవై ఒక్క రోజుల పాటు ఇరవై ఒక్క పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి బస్సు యాత్ర...

చ‌ర‌ణ్ సినిమాలో.. సుకుమార్ హ్యాండ్ ఎంత‌?

సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్‌పై ద‌ర్శ‌కుడు సుకుమార్ ఓ సినిమా తీశాడంటే అందులో త‌న క్రియేటీవ్ ఇన్వాల్వ్‌మెంట్ కూడా త‌ప్ప‌కుండా ఉంటుంది. 'విరూపాక్ష‌' సినిమా స్క్రీన్ ప్లేలో సుకుమార్ ఇచ్చిన ఇన్ పుట్స్ బాగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close