చైతన్య : సెటిల్మెంట్ల పాలన ఏపీకి శాపమే..!

ప్రభుత్వం మారిదే.. గత ప్రభుత్వ నిర్ణయాలన్నింటినీ తప్పు పట్టి.. రద్దు చేసేప్రయత్నం ఏ సర్కారూ చేయలేదు. అవినీతి, అక్రమాలు జరిగినట్లుగా ఆధారాలు ఉంటేనే ముందడుగు వేస్తుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు.. వ్యతిరేకించాము కాబట్టి… అధికారంలోకి వచ్చాక వాటిని మార్చడమో..తీసేయడమోచేయాలని అనుకోరు. కానీ ఏపీ సర్కార్ అందుకున్న భిన్నంగా వ్యవహరిస్తోంది. తాము డీల్ చేస్తున్నది ఆశా వర్కరా… విద్యుత్ కంపెనీలా అన్నది చూడటం లేదు. అందరితోనూ ఒకే ఫార్ములా పాటిస్తున్నారు. అందర్నీ సెటిల్మెంట్ల తరహాలో బెదిరించి… పని పూర్తి చేస్తున్నారు.

విద్యుత్ సంస్థలను బెదిరించి ఏం సాధించారు..?

ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలన్నింటినీ సమీక్షిస్తున్నారు. ఈ క్రమంలో… కాంట్రాక్టర్లకు.. విద్యుత్ కంపెనీల ప్రతినిధులకు నోటీసులిచ్చి పిలిపిస్తున్నారు. ధరలు తగ్గించాలని బెదిరింపులకు దిగుతున్నారు. మాటల్లోనే కాదు..లేఖల్లోనూ.. బెదిరింపు తరహా వాక్యాలు ఉండటంతో… పీపీఏల విషయంపై.. ఏపీసర్కార్‌తో చర్చకు వచ్చిన విద్యుత్ కంపెనీల ప్రతినిధులు ఆందోళనకు గురయ్యారు. విద్యుత్ సంస్థలు కోర్టును ఆశ్రయించాయి. ఇప్పుడు.. కరెంట్ కొనడమే ఆపేశారు. ఆయా సంస్థలను… ఆర్థికంగా ఇబ్బంది పెట్టేందుకు కోర్టుల్ని కూడా లెక్క చేయడం లేదు.

నవయుగ కంపెనీని ఏ దండోపాయంతో వెళ్లిపోయేలా ఒప్పించారు..?

పోలవరం ప్రాజెక్ట్ విషయంలోనూ..ప్రభుత్వం తీరుపై… విమర్శలు కొద్ది రోజులుగా వస్తున్నాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసినప్పటి నుంచి ఈ పీపీఏల రద్దు, కాంట్రాక్టుల రివర్స్ టెండరింగ్ గురించి పదే పదే చెబుతున్నారు. రెండింటిపై నిపుణుల కమిటీలను నియమించారు. తాము ముందుగా చెప్పినట్లుగానే.. ఆయా కమిటీలు నివేదికలు ఇచ్చాయి. వాటినే ముందు పెట్టి.. మిగతా కార్యక్రమాలను.. ఏపీ సర్కార్ నడిపేస్తోంది. పోలవరం ప్రాజెక్ట్ విషయంలో.. అక్రమాలు జరిగాయన్న సమాచారం కానీ.. ఫిర్యాదులు కానీ లేవని.. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లోనే స్పష్టం చేసింది. పైగా.. పనులు కూడా.. అత్యంత వేగంగా జరుగుతున్నాయని సర్టిఫికెట్ ఇచ్చింది. అలాంటి ప్రాజెక్ట్ పనులు చేస్తున్న నవయుగ కంపెనీని ఉన్న పళంగా తొలగించాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. అయితే.. ఇక్కడ కూడా.. కాంట్రాక్ట్ కంపెనీతో … పరస్పర అంగీకారానికి వచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించుకుంది.వారు న్యాయవివాదాలకు వెళ్లకుండా.. పరస్పర అంగీకారంతో ముందుకెళ్తున్నట్లుగా ప్రకటించింది. ఈ పరస్పర అంగీకార ఒప్పందం ఏమిటో.. బయటకు తెలియదు . అంటే.. అక్కడా సెటిల్మెంట్ చేసేశారన్నమాట.

ఆశా వర్కర్ల నుంచి పోలవరం దాకా.. అన్నీ అంతేనా..?

పీపీఏలు, పోలవరం ప్రాజెక్ట్ విషయంలోనే కాదు.. గత ప్రభుత్వం చేపట్టిన ప్రతి పనిని…నియామకాన్ని.. ఏపీ సర్కార్ ప్రస్తుతం రివ్యూ చేస్తోంది. చివరికి ఆశా వర్కర్ల స్థాయిలోనూ…ఈ రివ్యూ అమలవుతోంది. ప్రస్తుతం ఉన్నవాళ్లు తప్పుకుంటే ఆ స్థానంలో తమవారిని నియమించుకునేందుకు పావులు కదుపుతున్నారు. రాయలసీమలో సెటిల్మెంట్లు చేసే నేతలు.. సమస్య పరిష్కరించమని తమ దగ్గరకు వచ్చే వారికి సంబంధించి సర్వం లాగేసుకుని…వారికే… కొంత సాయం చేస్తారు. దానికే ..ఎంతో చేశామని చెప్పుకుంటారు. ఇప్పుడు వైఎస్ జగన్ కూడా అదే చేస్తున్నారు. దీని వల్ల ఏపీ ఓ సెటిల్మెంట్ రాజ్యంగా మారుతోంది కానీ… సన్ రైజ్ స్టేట్‌గా లేకుండా పోయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏబీపీ సీఓటర్ సర్వే : బీఆర్ఎస్‌కు ఒక్కటే !

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి మంచి జోరు మీద ఉన్న కాంగ్రెస్ పార్టీకి లోక్ సభ ఎన్నికల్లో గట్టి పోటీ ఎదురయినప్పటికీ పది వరకూ లోక్ సభ సీట్లను గెల్చుకునే అవకాశం...

ఏబీపీ సీఓటర్ సర్వే : టీడీపీ కూటమికి 20, వైసీపీకి 5 లోక్‌సభ సీట్లు

ఎన్డీఏ కూటమి బలం రోజు రోజుకు పెరుగుతోంది. వైసీపీపై వ్యతిరేకత అంతకంతకూ పెరుగుతోందని సర్వేల వెల్లడిస్తున్నయి. అత్యంత ఖచ్చితంగా సర్వేలు, ఒపీనియన్ పోల్స్ వెల్లడిస్తుందని పేరున్న ఏబీపీ- సీఓటర్ ఎన్నికలకు ముందు నిర్వహించిన...

సునీత సాక్ష్యాలకు పాత ఆరోపణలే అవినాష్ రెడ్డి కౌంటర్ !

వివేకా హత్య కేసులో సునీత జస్టిస్ ఫర్ వివేకా పేరుతో పెడుతున్న ప్రెస్ మీట్లు వెల్లడిస్తున్న సంచనల విషయాలతో అవినాష్ రెడ్డికి మైండ్ బ్లాంక్ అవుతోంది. స్పందించకపోతే నిజం అని...

రాయి కేసు : లీకులిచ్చి జగన్ పరువు తీసిన పోలీసులు !

అనవసర డ్రామాలతో భద్రతా వైఫల్యమని పోలీసుల్ని చేతకాని వాళ్లుగా చేస్తున్నారని కోపం వచ్చిందేమో కానీ విజయవాడ పోలీసులు వైసీపీతో పాటు జగన్ పరువు తీసే లీకులు మీడియాకు ఇచ్చారు. జగన్ పై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close