మ‌హేష్ – త్రివిక్ర‌మ్ ప్రాజెక్ట్.. ఇన్‌సైడ్ న్యూస్‌!

టాలీవుడ్ లో మ‌రో క్రేజీ కాంబినేష‌న్ సెట్ట‌య్యింది. మ‌హేష్ – త్రివిక్ర‌మ్ ఈ సారి హ్యాట్రిక్ కొట్ట‌బోతున్నారు. అత‌డు, ఖ‌లేజా త‌ర‌వాత వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో మ‌రో సినిమా ప‌ట్టాలెక్క‌బోతోంది. ఈనెల 31 న లాంఛ‌నంగా ప్రారంభిస్తారు. ఈ సినిమాకి సంబంధించిన ఇంకొన్ని అప్ డేట్స్ త్వ‌ర‌లో రాబోతున్నాయి.

ఈ చిత్రానికి `పార్థూ` అనే పేరు ప‌రిశీల‌న‌లో ఉన్న‌ట్టు టాక్‌. `అత‌డు`లో మ‌హేష్ పేరు పార్థూ. ఈ సినిమాలోనూ హీరోకి అదే పేరు పెట్టి `అత‌డు`లో మ‌హేష్ ని గుర్తు చేయ‌బోతున్నాడ‌ట త్రివిక్ర‌మ్. ప్ర‌స్తుతానికి వ‌ర్కింగ్ టైటిల్ అదే. ఈమ‌ధ్య‌… త్రివిక్ర‌మ్ పొయెటిక్ టైటిల్స్ పెడుతున్నాడు. అలాంటి టైటిల్ ఏదైనా త‌గిలితే… త‌ప్ప `పార్థూ`నే ఫైన‌ల్ చేసే అవ‌కాశాలున్నాయి. క‌థానాయిక‌గా దిశాప‌టానీని ఎంచుకుంటే ఎలా ఉంటుంది? అనే ఆలోచ‌న‌లో ఉన్నార్ట‌. మ‌రో ఇద్ద‌రు ముగ్గురు పేర్లు కూడా లిస్టులో ఉన్నాయి. త్వ‌ర‌లోనే వాటి వివ‌రాలు ప్ర‌క‌టిస్తారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సీఐడీపై సుప్రీంకోర్టుకెళ్లిన ఏబీఎన్, టీవీ5..!

ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు తమపై నమోదు చేసిన రాజద్రోహం కేసులు కుట్రపూరితమని.. తక్షణం ఆ కేసులపై తదుపరి చర్యలను నిలిపివేస్తూ ఆదేశాలివ్వాలని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి, టీవీ5 సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. రెండు టీవీ చానళ్లు వేర్వేరుగా...

కరోనా అనాథల్ని చేసిన పిల్లలకు అండగా జగన్..!

కరోనా ఎన్నో కుటుంబాల్లో చీకట్లు ముసిరేలా చేస్తోంది. కొన్ని చోట్ల ఇంటి పెద్ద దిక్కును కోల్పోగా.. మరికొన్ని చోట్ల..తల్లిదండ్రులు ఇద్దర్నీ కోల్పోయి చిన్నారు అనాథలవుతున్నారు. ఒకటో.. రెండో కాదు.. దాదాపుగా ప్రతి ఊరిలోనూ...

రఘురామ కేసులో “సుప్రీం” టర్న్..!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును కస్టడీలో సీఐడీ పోలీసులు కొట్టారో లేదో తేల్చడానికి సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. జ్యుడిషియల్ అధికారి పర్యవేక్షణలో రఘురామకు వైద్యపరీక్షలు నిర్వహించాలని.....

ఈ సారీ కౌంటర్ దాఖలుకు సీబీఐ, జగన్‌కు తీరలేదు..!

రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ విషయంలో కౌంటర్ దాఖలు చేయడానికి వారాలకు వారాల గడువు సీబీఐకి సరిపోవడం లేదు. ఒక్క సీబీఐకే కాదు.... నిందితుడైన జగన్మోహన్ రెడ్డికీ...

HOT NEWS

[X] Close
[X] Close