మ‌హేష్ – పూరి.. మ‌ళ్లీ క‌లిసిపోయారు

టాలీవుడ్‌లోని క్రేజీ కాంబినేష‌న్ల‌లో మ‌హేష్‌బాబు – పూరి జ‌గ‌న్నాథ్‌ల జోడీ త‌ప్ప‌నిస‌రిగా ఉంటుంది. వీళ్లిద్ద‌రూ క‌లిస్తే.. బాక్సాఫీసు ప‌రిస్థితి ఏమిట‌న్న‌ది పోకిరితో రుజువైంది. బిజినెస్‌మేన్ కూడా బ్యాడ్ సినిమా ఏం కాదు. అందులో కొత్త మ‌హేష్‌ని చూసే అవకాశం ద‌క్కింది. అప్ప‌టి నుంచీ.. వీరిద్ద‌రి కాంబోలో హ్యాట్రిక్ సినిమా చూడాల‌ని మ‌హేష్ అభిమానులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

కానీ ఇద్ద‌రి మ‌ధ్య కొంత గ్యాప్ వ‌చ్చింది. ‘నేను ఫ్లాపుల్లో ఉన్న‌ప్పుడు మ‌హేష్ బాబు న‌న్ను ప‌ట్టించుకోలేదు..’ అన్న‌ట్టు ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడాడు పూరి. దాంతో.. ఇద్ద‌రి మ‌ధ్య ఏదో జ‌రిగిందన్న విష‌యం లీకైంది. ‘జ‌గ‌న‌ణ‌మ‌న‌’ సినిమా ప్ర‌క‌టించి, దాన్ని ప్ర‌క‌ట‌న‌ల‌కే ప‌రిమితం చేశాడు పూరి. ఇవ‌న్నీ చూశాక ఇక మ‌హేష్ – పూరి క‌ల‌వ‌ర‌ని అంతా ఫిక్స‌యిపోయారు. కానీ రాజ‌కీయాలు, సినిమాలూ ఒక్క‌టే. ఇక్క‌డ కూడా శాశ్వ‌త మిత్రులు శాశ్వ‌త శ‌త్ర‌వులూ ఉండ‌రు. ‘పూరితో సినిమా చేయ‌డానికి నాకెలాంటి అభ్యంత‌రాలూ’ లేవు అంటూ మ‌హేష్ కొత్త స్టేట్‌మెంట్ ఇచ్చాడు. త‌న అభిమాన ద‌ర్శ‌కుల‌లో పూరి ఒకడ‌ని, త‌న‌తో సినిమా చేయ‌డానికి ఇప్ప‌టికీ ఆస‌క్తిగానే ఉన్నాన‌ని, క‌థ చెప్ప‌డ‌మే ఆల‌స్యం అంటూ క్లారిటీ ఇచ్చాడు. పూరి కూడా మ‌హేష్ ఫ‌స్ట్ లుక్‌పై పాజిటీవ్‌గా స్పందించాడు. దాంతో.. ఇద్ద‌రి మ‌ధ్య ఉన్న చిన్న గ్యాప్ కూడా మాయ‌మైపోయింది. పూరి అస‌లే భీక‌ర‌మైన ఫామ్‌లో ఉన్నాడు. మ‌హేష్ కి కూడా ‘హిట్‌’ ద‌ర్శ‌కుల‌తో ప‌నిచేయ‌డానికి పెద్ద‌గా అభ్యంత‌రాలు ఉండ‌వు. సో… వీళ్ల హ్యాట్రిక్‌ సినిమాకి ఉన్న అడ్డంకుల‌న్నీ తొల‌గిపోచ‌యిన‌ట్టే అన్న‌మాట‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మరింత చిక్కిన పోలవరం అంచనాలు..! ఇక ప్రాజెక్ట్ కష్టమేనా..!?

మెతక వైఖరితో ఉంటే.. కేంద్రం నిధులను ఎలా చిక్కిపోయేలా చేస్తోందో తాజా ఉదాహరణగా పోలవరం ప్రాజెక్ట్ నిలుస్తోంది. సహాయ, పునరావాసాలతో కలిపి... గత ప్రభుత్వం దాదాపుగా 55వేల కోట్లకు ఆమోదింప చేసుకుంది. దాని...

చ‌రిత్ర సృష్టించిన ధావ‌న్

ఐపీఎల్ లో మ‌రో రికార్డ్ న‌మోద‌య్యింది. ఈసారి శిఖ‌ర్ ధావ‌న్ వంతు. ఐపీఎల్ లో వ‌రుస‌గా రెండు సెంచ‌రీలు చేసిన బ్యాట్స్‌మెన్‌గా ధావ‌న్ రికార్డు సృష్టించాడు. ఓ బ్యాట్స్‌మెన్ వ‌రుస‌గా రెండు మ్యాచ్‌ల‌లో...

జాతికి జాగ్రత్తలు చెప్పిన మోదీ..!

ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. మధ్యాహ్నం నుంచి ఉత్కంఠ రేపిన ఆరు గంటల ప్రసంగంలో కీలకమైన విధానపరమైన ప్రకటనలు ఏమీ లేవు. పండగల సందర్భంగా ప్రజలు స్వేచ్చగా తిరుగుతున్నారని.. ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పేందుకు...

ఏపీకి విరాళాలివ్వట్లేదా..! జగన్ అడగలేదుగా..?

సినీ స్టార్లు, పారిశ్రామికవేత్తలు తెలంగాణకు పెద్ద ఎత్తున విరాళాలు ప్రకటిస్తున్నారు. భారీ వర్షాల కారణంగా ఇబ్బందుల్లో పడిన హైదరాబాద్‌ను.. అక్కడి ప్రజలను ఆదుకోవడానికి సీఎంఆర్ఎఫ్‌కు విరాళాలివ్వాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. ఇలా పిలుపునిచ్చారో...

HOT NEWS

[X] Close
[X] Close