పెద్ద హీరోలు ఓటీటీకి ఒప్పుకోరు

వెండి తెర – ఓటీటీ …. వీటి మ‌ధ్య గ‌ట్టి పోటీ ఎదురైంది. థియేట‌ర్లు మూసిన వేళ‌లో, సినిమాల్ని లాక్కోవాల‌ని ఓటీటీ ఆరాట‌ప‌డుతోంది. ఎలాగైనా స‌రే, థియేట‌ర్ వ్య‌వ‌స్థ‌ని కాపాడుకోవాల‌ని సినిమాల్ని వెండి తెర‌పైనే చూడాల‌న్న పోరాటం మ‌రోవైపు. మ‌రి.. భ‌విష్య‌త్తులో సినిమా ప‌రిశ్ర‌మ ఏ దారిన వెళ్తుంది? హీరోల మాటేంటి? దీనిపై స్పందించారు ప్ర‌ముఖ పంపిణీదారుడు అభిషేక్ నామా. ఆయ‌న తెలుగు 360తో మాట్లాడుతూ “ఓటీటీ నుంచి గ‌ట్టిపోటీ ఉంది. అయితే.. పెద్ద హీరోలు త‌మ సినిమాల్నిఓటీటీకి అమ్మ‌డానికి ఒప్పుకోరు. వాళ్ల అభిమానుల‌కూ ఓటీటీ వేదిక‌లు అంత తృప్తినివ్వ‌వు. ప‌వ‌న్‌క‌ల్యాణ్ లాంటి హీరో సినిమాని బుల్లి తెర‌పై చూడ‌లేం. థియేట‌ర్లో చూస్తే వ‌చ్చే ఆ కిక్ వేరు. చిన్న సినిమాల బ‌డ్జెట్ త‌క్కువ‌. వాటిని ఓటీటీ ద్వారా తిరిగి సాధించుకోవొచ్చు. కానీ పెద్ద సినిమా అంటే ఈరోజుల్లో వంద కోట్ల మాట‌. అంత ఖ‌ర్చు పెట్టి ఓటీటీ సంస్థ‌లు పెద్ద సినిమాల్ని కొన‌లేవు. ఓ తెలుగు సినిమా వ‌చ్చిందంటే, రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, క‌ర్నాట‌క‌, త‌మిళనాడు, ఓవ‌ర్సీస్‌ల‌లో కూడా అమ్ముకుంటారు. ఇప్పుడు నార్త్ ఇండియా మార్కెట్ బాగా పెరిగింది. అవ‌న్నీ కోల్పోడానికి ఏ నిర్మాతా ఒప్పుకోడు. త‌మిళ‌నాడులో ఓటీటీ ద్వారా కొన్ని సినిమాలు విడుద‌ల‌య్యాయి. వాటి ఫ‌లితం అంతంత మాత్ర‌మే. అవేమీ నిర్మాత‌ల‌కు గానీ, ఓటీటీ సంస్థ‌ల‌కు గానీ డ‌బ్బులు ఇవ్వ‌లేక‌పోయాయి. దీన్ని బ‌ట్టి… ఓటీటీ ప్ర‌భావం ఎంతో అర్థం చేసుకోవొచ్చు” అని తేల్చేశారు.

పంపిణీదారుడిగా ‘వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్‌’తో వంద సినిమాల మైలు రాయిని అందుకున్నారు అభిషేక్‌. ఇప్పుడు సుధీర్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా తీస్తున్నారు. షూటింగుల‌కు అనుమ‌తి రాగానే ఈ సినిమా ప‌ట్టాలెక్కుతుంది. త్వ‌ర‌లోనే మూడు కొత్త సినిమాల‌కు సంబంధించిన ప్ర‌క‌ట‌న కూడా విడుద‌ల చేస్తున్న‌ట్టు అభిషేక్ నామా తెలిపారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ దళిత రైతు ఆత్మహత్య ప్రభుత్వ హత్యే..!

నెల్లూరు జిల్లాలో ఓ దళిత రైతు.. తన భూమిని బలవంతంగా లాక్కుంటున్నారన్న ఆవేదనతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఇలాంటి ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల జరుగుతున్నాయి. అయితే.....

‘ల‌వ్ స్టోరీ’ ప్లానింగు ఇదీ….

సాధార‌ణంగా శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలు తీసే తీరు పాసింజ‌ర్ రైలుని త‌ల‌పిస్తుంటాయి. ఆగి... ఆగి.. కొంచెం.. కొంచెం.. త‌న మూడ్ ని బ‌ట్టి, షూటింగ్ చేస్తుంటాడు శేఖ‌ర్ క‌మ్ముల‌. దానికి త‌గ్గ‌ట్టుగా లాక్...

ఆర్‌.ఎఫ్‌.సీలో సెటిలైపోతున్న రౌడీ

పూరి జ‌గ‌న్నాథ్ - విజ‌య్ దేవ‌ర‌కొండ కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపుదిద్దుకుంటున్న సంగ‌తి తెలిసిందే. విజ‌య్ న‌టిస్తున్న తొలి పాన్ ఇండియా ప్రాజెక్టు ఇది. క‌థ ప్ర‌కారం సినిమా మొత్తం ముంబైలోనే...

‘ఓ పిట్ట క‌థ’ లాభాల వెనుక పెద్ద క‌థ‌

లాక్ డౌన్‌కి ముందు, థియేట‌ర్లు మూసివేయ‌డానికి ఓ వారం ముందు విడుద‌లైన సినిమా 'పిట్ట‌క‌థ‌'. మంచి ప‌బ్లిసిటీతో విడుద‌లైన ఈ చిన్న సినిమా.. బాక్సాఫీసు ద‌గ్గ‌ర ఏ ర‌క‌మైన ప్ర‌భావాన్నీ చూపించ‌లేక‌పోయింది. క‌రోనా...

HOT NEWS

[X] Close
[X] Close