అమిత్‌షాతో భేటీకి మంగళవారం ఢిల్లీకి జగన్..!?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంగళవారం అత్యవసరంగా ఢిల్లీకి వెళ్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు మీడియా ప్రతినిధులకు అనధికారిక సమాచారం అందింది. జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్తారని.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు అందుబాటులో ఉన్న కేంద్ర మంత్రులందర్నీ కలుస్తారని చెబుతున్నారు. లాక్ డౌన్ ప్రకటించిన తర్వాత దేశీయ విమానాల రాకపోకలు.. చార్డెడ్ విమానాలకు.. వారం రోజుల కిందటే అనుమతి ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లే అవకాశం ఉంది. అమిత్ షాలో ఇప్పుడు అంత అర్జంట్‌గా చర్చించాల్సిన అంశాలేమిటన్నదానిపై వైసీపీ వర్గాలు నోరు మెదపడం లేదు.

ప్రస్తుతం కరోనా వైరస్ విజృంభిస్తున్న కారణంగా ఎక్కువగా ఆన్ లైన్ … చర్చలు..సమావేశాలకే అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు. నేరుగా మంత్రివర్గం లాంటి అత్యంత కీలకమైన సమావేశాలు మాత్రమే నిర్వహిస్తున్నారు. కేంద్రమంత్రుల కార్యాలయాలు తెరుస్తున్నప్పటికీ.. నేరుగా వచ్చేవారు తక్కువగానే ఉంటున్నారు. లాక్ డౌన్ ప్రకటించిన తర్వాత..సడలింపులు ఇచ్చిన తర్వాత ఏ ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన పెట్టుకోలేదు..మొదటి సారి ఏపీ సీఎం జగన్.. అమిత్ షాతో భేటీకి ఢిల్లీకి వెళ్తున్నారు.

ప్రస్తుతం రాష్ట్రంలో భిన్నమైన పరిస్థితులు ఉన్నారు. కోర్టు తీర్పులు వ్యతిరేకంగా వస్తూండటంతో..న్యాయవ్యవస్థపైనే వైసీపీ నేతలు విమర్శలు ప్రారంభించారు. అదే సమయంలో..రాజ్యాంగ ఉల్లంఘన విస్తృతంగా జరుగుతోందన్న ఆరోపణలు.. ఫిర్యాదులు కూడా వస్తున్నాయి. ఎస్‌ఈసీని విషయంలో హైకోర్టు తీర్పును పట్టించుకోనట్లుగా ప్రభుత్వం వ్యవహరిస్తూండటంతో పాటు… ఎస్‌ఈసీగా రమేష్‌కుమార్ ను గుర్తించకపోవడంతో.. ఇప్పుడా పోస్టులో ఎవరుఉన్నారు..? అనేదానిపై క్లారిటీ లేకపోవడంతో..రాజ్యాంగ సంక్షోభం తరహా పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ పరిణామాల నేపధ్యంలో జగన్ అమిత్ షాను కలిసేందుకు వెళ్తూండటం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ దళిత రైతు ఆత్మహత్య ప్రభుత్వ హత్యే..!

నెల్లూరు జిల్లాలో ఓ దళిత రైతు.. తన భూమిని బలవంతంగా లాక్కుంటున్నారన్న ఆవేదనతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఇలాంటి ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల జరుగుతున్నాయి. అయితే.....

‘ల‌వ్ స్టోరీ’ ప్లానింగు ఇదీ….

సాధార‌ణంగా శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలు తీసే తీరు పాసింజ‌ర్ రైలుని త‌ల‌పిస్తుంటాయి. ఆగి... ఆగి.. కొంచెం.. కొంచెం.. త‌న మూడ్ ని బ‌ట్టి, షూటింగ్ చేస్తుంటాడు శేఖ‌ర్ క‌మ్ముల‌. దానికి త‌గ్గ‌ట్టుగా లాక్...

ఆర్‌.ఎఫ్‌.సీలో సెటిలైపోతున్న రౌడీ

పూరి జ‌గ‌న్నాథ్ - విజ‌య్ దేవ‌ర‌కొండ కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపుదిద్దుకుంటున్న సంగ‌తి తెలిసిందే. విజ‌య్ న‌టిస్తున్న తొలి పాన్ ఇండియా ప్రాజెక్టు ఇది. క‌థ ప్ర‌కారం సినిమా మొత్తం ముంబైలోనే...

‘ఓ పిట్ట క‌థ’ లాభాల వెనుక పెద్ద క‌థ‌

లాక్ డౌన్‌కి ముందు, థియేట‌ర్లు మూసివేయ‌డానికి ఓ వారం ముందు విడుద‌లైన సినిమా 'పిట్ట‌క‌థ‌'. మంచి ప‌బ్లిసిటీతో విడుద‌లైన ఈ చిన్న సినిమా.. బాక్సాఫీసు ద‌గ్గ‌ర ఏ ర‌క‌మైన ప్ర‌భావాన్నీ చూపించ‌లేక‌పోయింది. క‌రోనా...

HOT NEWS

[X] Close
[X] Close