ఆ మధురానుభూతి ఎన్నటికీ మరువలేను: మహేష్ బాబు

టాలీవుడ్ నెంబర్:1 హీరో ప్రిన్స్ మహేష్ బాబు తన కుటుంబంతో కలిసి దుబాయ్, స్విట్జర్ ల్యాండ్ లో నూతన సంవత్సరం వేడుకలు జరుపుకొని మొన్ననే హైదరాబాద్ తిరిగివచ్చేరు. దుబాయ్ లోని ప్రపంచ ప్రసిద్ధి చెందిన కృత్రిమ ద్వీపం బూర్జ్ అల్ అరబ్, ప్రపంచంలోకెల్లా ఎత్తయిన బూర్జ్ ఖలీఫా భవనాన్ని సందర్శించారు. జీవితంలో ఎన్నడూ మరువలేని గొప్ప మదుర స్మృతులు పొందామని మహేష్ బాబు తన ట్వీటర్ లో తెలిపారు.

బూర్జ్ అల్ అరబ్ లో బస చేసినప్పుడు అక్కడి హోటల్ సిబ్బంది తమ పట్ల చూపిన ప్రత్యేక ఆధారభిమానాలను ఎన్నడూ మరువలేమని తెలిపారు. అక్కడ హోటల్ యాజమాన్యం తమను, తమ ఇద్దరు పిల్లలను అలరించేందుకు తాము ఉంటున్న రూమ్ కే శాంటాక్లాజ్ ని పంపించడం ఎన్నటికీ మరిచిపోలేని గొప్ప అనుభూతిని కలిగించిందని మహేష్ బాబు తన ట్వీట్ లో పేర్కొన్నారు. బూర్జ్ ఖలీఫా భవనం చివరి అంతస్తులు మబ్బులలో మాయం అయిపోవడం చూసి తాము చాల త్రిల్ అయిపోయామని తెలిపారు. ఆ దృశ్యాన్ని తన కుమారుడు గౌతంతో కలిపి తన కెమెరాలో బందించి ట్వీటర్ లో మహేష్ బాబు పోస్ట్ చేసారు.

మహేష్ బాబు తమా విదేశీ పర్యటన ముగించుకొని రెండు మూడు రోజుల క్రితమే హైదరాబాద్ తిరిగి వచ్చేరు. శ్రీకాంత అడ్డాల దర్శకత్వంలో మహేష్ బాబు, కాజల్ అగర్వాల్, సమంత మరియు ప్రణీత సుభాష్ కలిసి నటించబోతున్న సినిమా షూటింగ్ త్వరలో చెన్నైలో మొదలవబోతోంది. ఆ షూటింగ్ కోసం మహేష్ బాబు త్వరలోనే చెన్నై బయలుదేరబోతున్నారు. ఈ సినిమాకి మిక్కి జె.మేయర్ సంగీతం అందిస్తున్నారు. ప్రసాద్ వి పొట్లూరి నిర్మించబోతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at [email protected]