ముగ్గురు అందాల భామలతో రాహుల్ రోమాన్స్!

మహేష్ బాబు హీరోగా నటించిన శ్రీమంతుడు సినిమాలో రాహుల్ రవీంద్రన్ తన ప్రతిభని నిరూపించుకొని అందరినీ ఆకట్టుకొన్నాడు. త్వరలో అతను ‘విప్ లవ్’ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు. దానికి ‘శోభన్ బాబు’ అనే టైటిల్ ఖరారు అయ్యింది. ఆ సినిమాలో రాహుల్ రవీంద్రన్ ముగ్గురు అందాల భామలతో రొమాన్స్ చేయబోతున్నాడు. ఇదివరకే పార్వతీ నాయర్, నిత్యా షెట్టి అందులో హీరోయిన్లుగా ఖరారు అయ్యేరు. ఇప్పుడు తాజాగా మంగళూరుకు చెందిన ఐషాని షెట్టి మూడో హీరోయిన్ గా ఖరారు అయ్యింది. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు ఇప్పటికే దాదాపు పూర్తయ్యాయి. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. సినిమాలో చాలా వరకు హైదరాబాద్ లోనే జరుగుతుంది. పాటల షూటింగ్ కోసం కేరళ మరియు విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంది. ఈ సినిమాకి రమణ గోగుల సంగీతం సమకూర్చుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at [email protected]