కొత్త తరహా ఫంక్షన్‌కి శ్రీకారం చుడుతున్న ‘కిల్లింగ్‌ వీరప్పన్‌’

రామ్‌గోపాల్‌వర్మ డైరెక్టర్‌ అవ్వకముందే సినిమాల మీద, టెక్నాలజీ మీద మంచి గ్రిప్‌ వుందన్న విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా సౌండ్‌ టెక్నాలజీ మీద మంచి పట్టు వున్న వర్మకి బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ ఏ సీన్‌లో ఎలా వుండాలి, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ వల్ల ఏ సీన్‌కి ఎంత ఎలివేషన్‌ వస్తుందన్న విషయం పక్కాగా తెలుసు. ముఖ్యంగా క్రైమ్‌ మూవీస్‌, క్రైమ్‌ థ్రిల్లర్స్‌లో వర్మ ఈ టెక్నిక్‌ని బాగా ఉపయోగిస్తాడు. కొన్ని వర్మ సినిమాల్లో ఆర్టిస్టుల పెర్‌ఫార్మెన్స్‌ కంటే బ్యాక్‌గ్రౌండ్‌లో మ్యూజిక్‌ డైరెక్టర్‌ పెర్‌ఫార్మెన్సే ఎక్కువగా కనిపిస్తుంది. అందుకే తన ఆలోచనలకు దగ్గరగా వుండే మ్యూజిక్‌ డైరెక్టర్స్‌నే తన సినిమాల కోసం సెలెక్ట్‌ చేసుకుంటాడు వర్మ.

రామ్‌గోపాల్‌వర్మ లేటెస్ట్‌ మూవీ ‘కిల్లింగ్‌ వీరప్పన్‌’ జనవరి 1న కన్నడలో విడుదలై సూపర్‌హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. ఈ చిత్రం కోసం శాండీకీస్‌111 చేేసిన బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌కి కన్నడ ప్రేక్షకులు ఫిదా అయిపోయారట. థియేటర్‌ నుంచి బయటికి వచ్చిన ప్రేక్షకులు బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ గురించి చాలా గొప్పగా చెప్పుకుంటున్నారట. దీన్ని దృష్టిలో పెట్టుకొని దర్శకనిర్మాతలు ఈ చిత్రం బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ సీడీలను విడుదల చేయాలని నిర్ణయించింది. ‘ది మూడ్స్‌ ఆఫ్‌ కిల్లింగ్‌ వీరప్పన్‌’ పేరుతో ఒక ఆల్బమ్‌ని రెడీ చేశారు శాండీకీస్‌111. కన్నడ ఫిలిం ఇండస్ట్రీలోనే ఫస్ట్‌టైమ్‌ ఒక సినిమా బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ని రిలీజ్‌ చేస్తున్నారు. ఈ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ ఆల్బమ్‌ని లహరి మ్యూజిక్‌ విడుదల చేస్తోంది. జనవరి 10న బెంగుళూరులో ఈ ఆల్బమ్‌ రిలీజ్‌ ఫంక్షన్‌ని ఘనంగా జరపబోతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వైసీపీలో “వన్ ఇయర్” మార్పు..! సజ్జలే నెంబర్ టూ..!?

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నెంబర్ టూ ఎవరు అంటే.. అందరూ.. ఎంపీ విజయసాయిరెడ్డి పేరును మొదటి ఆప్షన్‌గా పెడతారు. ఎందుకంటే.. అంత క్రియాశీలకంగా ఉంటారు ఆయన. అటు ఢిల్లీలో పరిస్థితుల్ని...

బీజేపీ గవర్నరేగా సంతకం పెట్టింది..! ఎలా స్వాగతిస్తున్నారు..?

ఎస్‌ఈసీగా రమేష్‌కుమార్‌ను తొలగిస్తూ.. తీసుకు వచ్చిన ఆర్డినెన్స్ చెల్లదని..హైకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ నేతలు కూడా.. పోటీలు పడి స్వాగతించారు. ఢిల్లీలో జీవీఎల్ నరసింహారావు దగ్గర నుంచి...

ఫిరాయించిన ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్సీలపై అనర్హతా వేటు..!?

మూడు రాజధానులు, సీఆర్డీఏ బిల్లు విషయంలో మండలిలో టీడీపీకి అనుకూలంగా ఓటు వేయకుండా.. వైసీపీ గూటికి చేరిపోయిన ఎమ్మెల్సీలు పోతుల సునీత, శివనాథరెడ్డిలపై అనర్హతా వేటు వేయడానికి టీడీపీ రంగం సిద్ధం చేసుకుంది....

ఏడాది యాత్ర 11 : అంచనాలు ఎక్కువ… ఆచరణ తక్కువ..!

ఇంత ఓవర్ ఎక్స్‌పెక్టేషన్స్ తట్టులేకపోతున్నాను భయ్యా..! .. అంటాడు ఓ సినిమాలో హీరో. నిజంగానే ఆ సినిమాకు హైప్ ఓ రేంజ్‌లో వచ్చింది. ఎంతగా అంటే.. సినిమా ఎంత అద్భుతంగా తీసినా .....

HOT NEWS

[X] Close
[X] Close