త‌మ‌న్ స్పీచ్‌పై మ‌హేష్ ఫ్యాన్స్ ఆగ్ర‌హం

అస‌లే స‌రిలేరు నీకెవ్వ‌రు, అల వైకుంఠ‌పుర‌ములో – సినిమాల మ‌ధ్య పోటీ తీవ్రంగా ఉంది. మా సినిమాది రికార్డు అంటే.. మాదే రికార్డు అంటూ పోస్ట‌ర్లు వేసుకుంటున్నారు. ఇప్పుడు మాట‌ల యుద్ధాలు కూడా మొద‌లైపోయిన‌ట్టు అనిపిస్తోంది. విశాఖ‌లో జ‌రిగిన‌ అల వైకుంఠ‌పుర‌ము థ్యాంక్స్ మీట్‌లో త‌మ‌న్ స్పీచ్ వింటే అదే అర్థం అవుతోంది.

నిజ‌మైన మాట‌లే మాట్లాడ‌మంది.. నిజ‌మైన‌ క‌ల‌క్ష‌న్లే చెప్ప‌మంది… ఈరోజు చెప్పాం.. గెలిచాం… కొట్టాం ఈరోజు.. అంటూ అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శించాడు. త‌మ‌న్ మాట‌ల‌కు త్రివిక్ర‌మ్, అల్లు అర‌వింద్‌లైతే.. ప‌డి ప‌డీ న‌వ్వ‌డం, చ‌ప్ప‌ట్లు కొట్ట‌డం క‌నిపించింది. ఈ వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

వ‌సూళ్ల విష‌యంలో మ‌హేష్‌, బ‌న్నీ సినిమాలు పోటీ ప‌డుతున్న విష‌యం తెలిసిందే. ఎవ‌రి అంకెలు స‌రైన‌వో, ఎవ‌రిది అస‌లైన రికార్డో తెలియ‌క ఫ్యాన్స్ త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. ఈ త‌రుణంలో త‌మ‌న్ ఇలాంటి కామెంట్ చేయ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. నిజ‌మైన క‌ల‌క్ష‌న్లు మావే అంటే అర్థం ఏమిటి?

అంటే మ‌హేష్ బాబు సినిమావి ఫేక్ క‌ల‌క్ష‌న్ల‌ని, మావే నిజ‌మైన అంకెల‌ని చెప్ప‌డ‌మే క‌దా ఇదంతా..? ప‌ండ‌గ హ‌డావుడి అయిపోయి, ఇక సినిమాల‌న్నీ స‌ర్దుకోబోతున్న ఇలాంటి త‌రుణంలో అన‌వ‌స‌రంగా ఈ కెలుకుడెందుక‌ని సోష‌ల్ మీడియాలో అభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి. ముఖ్యంగా మ‌హేష్ ఫ్యాన్స్ త‌మ‌న్‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. త‌మ సినిమాల గురించి హీరోలో, నిర్మాత‌లో, ద‌ర్శ‌కులో మాట్లాడారంటే అదో త‌ర‌హా. హీరోలంద‌రి సినిమాల‌కూ ప‌నిచేసే త‌మ‌న్‌లాంటి వాళ్లు ఇలాంటి కామెంట్లు చేయ‌డం ఎందుక‌న్న వాద‌న కూడా వినిపిస్తోంది. రేపు.. స‌రిలేరు నీకెవ్వ‌రు త‌ర‌పున నిర్మాతో, ద‌ర్శ‌కుడో ఇలాంటి కామెంట్లే చేస్తే, త‌మ‌న్‌కి కౌంట‌ర్ ఇవ్వాల‌ని భావిస్తే.. అదే చినికి చినికి గాలివాన‌గా మారే ప్ర‌మాదం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com