‘హీరో’లో మ‌హేష్ బాబు , కృష్ణ‌

గ‌ల్లా జ‌య‌దేవ్ కుమారుడు గ‌ల్లా అశోక్ క‌థానాయ‌కుడిగా ఎంట్రీ ఇస్తున్న సినిమా… హీరో. శ్రీ‌రామ్ ఆదిత్య ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈచిత్రం సంక్రాంతి కానుక‌గా… జ‌న‌వ‌రి 15న వ‌స్తోంది. కృష్ణ ఫ్యామిలీతో అశోక్ కి ఎటాచ్‌మెంట్ ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో కృష్ణ‌, మ‌హేష్ బాబు పేర్లు కూడా గ‌ట్టిగానే వినిపిస్తున్నాయ్‌. అయితే.. వినిపించ‌డ‌మే కాదు…. వాళ్లిద్ద‌రూ క‌నిపించ‌బోతున్నార‌ని టాక్‌.

`హీరో`లో అశోక్ కౌబోయ్ అవ‌తారంలో ద‌ర్శ‌న‌మివ్వ‌బోతున్నాడు. కౌబోయ్ అంటే… ముందు గుర్తొచ్చేది కృష్ణ‌. తెలుగులో కౌబోయ్ చిత్రాల‌కు నాంది ప‌లికింది ఆయ‌నే. ట‌క్క‌రి దొంగ‌లో మ‌హేష్ కూడా కౌబోయ్ గా క‌నిపించాడు. ఆ గెట‌ప్ మ‌హేష్‌కీ మ‌హ బాగా సూట్ అయ్యింది. ఇప్పుడు ఇదే గెట‌ప్ లో అశోక్ క‌నిపించబోతున్నాడు. హీరో సినిమాలో, ఈ హీరోని కౌబోయ్ గెట‌ప్ లోనే ఇంట్ర‌డ్యూస్ చేయ‌బోతున్నాడు ద‌ర్శ‌కుడు. ఇదే సీన్‌లో.. కృష్ణ‌, మ‌హేష్‌లు కూడా కౌబోయ్ గెట‌ప్పుల్లో క‌నిపిస్తారు. దాన్ని గ్రాఫిక్స్ ద్వారా యాడ్ చేశాడ‌ట ద‌ర్శ‌కుడు. అలా.. ఈ ముగ్గురినీ ఒకేసారి కౌబోయ్ గెట‌ప్పుల్లో చూడ‌డం ఫ్యాన్స్ కి ట్రీట్ గా ఉంటుంద‌ని శ్రీ‌రామ్ ఆదిత్య భావిస్తున్నాడు. సినిమా మొదలైన కాసేప‌టికే.. ఈ కౌబోయ్ సీన్ రాబోతోంది. అందుకే శ్రీ‌రామ్ ఆదిత్య కూడా ప‌నిగ‌ట్టుకుని `ఈ సినిమాలోని తొలి ప‌ది నిమిషాలు అస్స‌లు మిస్ కావొద్దు.. అదో ట్రీట్ లా ఉంటుంది` అని ఊరించేస్తున్నాడు

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మాధవీలత ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా మాధవీలత ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీపై పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. పాతబస్తీ గడ్డపై బీజేపీ ఎగరేసి ఒవైసీకి ఓటమి రుచి చూపిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు....

ఎన్నికల వరకు జగన్ అంతే..!?

ఏపీ సీఎం జగన్ రెడ్డిపై రాయి దాడి జరిగి రెండు వారాలు కావొస్తోంది. బస్సు యాత్రలో భాగంగా ఓ వ్యక్తి రాయి విసరడంతో జగన్ ఎడమ కంటిపైన స్వల్ప గాయమైంది. బ్యాండేజ్...

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close