సంక్రాంతి సినిమాల‌కు ముందు నుయ్యి.. వెనుక గొయ్యి

సంక్రాంతి అనేది చిత్ర‌సీమ‌కు చాలా కీల‌క‌మైన సీజ‌న్‌. యేడాదిలో కొత్త క్యాలెండ‌ర్ సంక్రాంతితోనే మొద‌ల‌వుతుంది. ప్ర‌తీ యేటా సంక్రాంతికి పెద్ద సినిమాలు రావ‌డం ఆన‌వాయితీ. అయితే.. 2022 ఆ అదృష్టానికి నోచుకోవ‌డం లేదు. ఆర్‌.ఆర్‌.ఆర్‌, భీమ్లా నాయ‌క్‌, రాధే శ్యామ్ లు వాయిదా ప‌డ‌డంతో స్టార్ల సంద‌డి లేకుండా పోయింది. `బంగార్రాజు` వ‌స్తున్నాడు కాబ‌ట్టి స‌రిపోయింది. లేదంటే… ఇంత హంగామా కూడా ఉండేది కాదు. బంగార్రాజుతో పాటుగా హీరో, రౌడీ బాయ్స్ సినిమాలు రాబోతున్నాయి. ఈ మూడు సినిమాల‌కు కావ‌ల్సినన్ని థియేట‌ర్లు దొరికేశాయి. కాక‌పోతే.. స‌మ‌స్య‌లు చాలా ఉన్నాయ్‌.

ఆంధ్రాలో 50 శాతం ఆక్యుపెన్సీతో థియేట‌ర్లు న‌డుపుకోవ‌డం పెద్ద స‌మ‌స్య‌. అక్క‌డ టికెట్ రేట్లు అంతంత మాత్ర‌మే. బెనిఫిట్ షోలు, ఫ్యాన్స్ షోలూ లేవు. ఉన్న రేట్ల‌కు, 50 శాతం ఆక్యుపెన్సీతో, అందులోనూ నైట్ క‌ర్ఫ్యూ నిబంధ‌నల మ‌ధ్య సినిమాని న‌డిపించ‌డం చాలా క‌ష్టం. బంగార్రాజు క‌మిట్ అయ్యాడు కాబ‌ట్టి.. ఈనెల 14న రావాల్సివ‌స్తోంది. ఇదే ప‌రిస్థితి వారం రోజుల ముందు గానీ క‌నిపిస్తే.. అప్పుడు బంగార్రాజు కూడా ఆగిపోయేవాడేమో..? ఇప్పుడు ఆపేస్తే బ‌య్య‌ర్లు గోల చేస్తారు. అలాగ‌ని వాళ్లేం హ్యాపీగా లేరు. బంగార్రాజుని ఏపీలో మంచి రేట్ల‌కు కొనేశారు. ఇప్పుడున్న రేట్ల‌కు.. పెట్టుబ‌డి రాబ‌ట్టుకోవ‌డ‌మే గ‌గ‌నం. 50 శాతం ఆక్యుపెన్సీతో అయితే మ‌రింత క‌ష్టం. రౌడీ బాయ్స్‌, హీరోల‌కూ ఇలాంటి ప‌రిస్థితే ఉంది. కాక‌పోతే.. ఇప్పుడు కాక‌పోతే ఇంకెప్పుడు? మున్ముందు ఎలాంటి ప‌రిస్థితులు ఉంటాయో ఇప్పుడే చెప్ప‌లేరు. ఫిబ్ర‌వ‌రి, మార్చిల‌లో ప‌రిస్థితులు ఇంకా దారుణంగా ఉండొచ్చ‌ని భ‌య‌ప‌డుతున్నారంతా. అందుకే ఎంతోకొంత ఈ సీజ‌న్‌లోనే రాబ‌ట్టుకుందాం అని నిర్మాత‌లు ఫిక్స‌యిపోయారు. బంగార్రాజుకీ ఇప్పుడు వెన‌క‌డుగు వేసే టైమ్ లేదు. అనుకున్న స‌మ‌యానికి సినిమాని విడుద‌ల చేయాల్సిందే. కానీ ఈ నిర్ణ‌యంతో ఎంత రిస్క్ తీసుకుంటున్నామ‌న్న‌ది సంక్రాంతి సీజ‌న్ అయ్యేంత వ‌ర‌కూ తెలీదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అల్ల‌రి న‌రేష్‌.. మ‌ళ్లీనా..?

ఈవీవీ మంచి ద‌ర్శ‌కుడే కాదు. నిర్మాత కూడా. ఈవీవీ సినిమా ప‌తాకంపై ఆయ‌న కొన్ని మంచి చిత్రాల్ని అందించారు. ఫ్లాపుల్లో ప‌డి స‌త‌మ‌త‌మ‌వుతున్న ఈవీవీకి... త‌న సొంత బ్యాన‌రే మ‌ళ్లీ నిల‌బెట్టింది. ఈవీవీ...

బీజేపీని టార్గెట్ చేసే స్టైల్ మార్చిన కేసీఆర్ !

తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రధాని మోదీని ఇష్టారీతిన విమర్శించడమే ఇప్పటి వరకూ బీజేపీపై చేస్తున్న యుద్దంగా భావించేవారు. అయితే అనూహ్యంగా ఇప్పుడు స్టైల్ మార్చారు. వికారాబాద్‌లో కలెక్టరేట్ భవనాలను ప్రారంభించిన ఆయన......

“ఆ ప్రశ్న” అడిగితే అసహనానికి గురవుతున్న జనసేన !

మంత్రి అంబటి రాంబాబుపై జనసేన పార్టీ నేతలు విరుచుకుపడుతున్నారు. ఆయనపై రకరకాల పద ప్రయోగాలు చేస్తూ మండి పడుతున్నారు. అంబటి రాంబాబును బపూన్‌ను చేస్తూ.. ఆయన ఫోటోను మార్ఫింగ్ చేసి మరీ...

లెక్కల్లేవ్ ..అయినా ఏపీని అలా వదిలేశారేంటి !?

ప్రజలు ప్రభుత్వాన్ని ఎన్నుకున్నంత మాత్రాన వారికి రాసిచ్చినట్లు కాదు. ఏదైనా రాజ్యాంగ పరంగా చేయాలి. ప్రజలు పన్నులు కట్టగా వచ్చే డబ్బును.. వారిని చూపించి చేసే అప్పును.. పద్దతిగా వాడాలి....

HOT NEWS

css.php
[X] Close
[X] Close